
మరో హాలీవుడ్ ఆఫర్
బాలీవుడ్‌లో విభిన్న నటుడిగా పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్‌ఖాన్‌ను మరో హాలీవుడ్ అవకాశం వరించింది..
బాలీవుడ్‌లో విభిన్న నటుడిగా పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్‌ఖాన్‌ను మరో హాలీవుడ్ అవకాశం వరించింది. టామ్ హాంక్స్ హీరోగా నటిస్తున్న ‘ఇన్‌ఫెర్నో’ చిత్రంలో ఇర్ఫాన్ నటించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత రచయిత డాన్‌బ్రౌన్ రాసిన క్రైమ్ థ్రిల్లర్ నవల ‘ఇన్‌ఫెర్నో’కి ఇది తెరరూపం. ఇప్పటికే ఇర్ఫాన్ ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’, ‘లైఫ్ ఆఫ్ పై’, ‘అమేజింగ్ స్పైడర్ మేన్’ చిత్రాలలో నటించారు. ఆయన తాజాగా నటించిన ‘జురాసిక్ వరల్డ్’ జూలై 12న విడుదల కానుంది.