
Virat Kohli: ‘‘పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోవడం కూడా ఓ జబ్బులాంటిదే! అయితే, ఏదో ఒకరోజు నేను ఈ జబ్బు నుంచి బయటపడాలి.. ఈ కోరికల వలయం నుంచి విముక్తి పొందాలని ఆశిస్తున్నా.
కీర్తిప్రతిష్టలు పెద్ద విషయమేం కాదు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతున్నామా లేదా? ఉన్నదాంతో సంతృప్తి పడుతున్నామా లేదా అన్నదే ముఖ్యం’’.. బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఒకానొక సందర్భంలో చెప్పిన మాటలు ఇవి.
జీవిత పరమార్థాన్ని తెలియజేసే ఈ కోట్‌ను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. కాగా అరంగేట్రం చేసిన అనతికాలంలోనే భారత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన కోహ్లి.. సారథిగానూ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.
ఆటగాడిగా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 72 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ రన్‌మెషీన్.. కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేయగలిగాడు. ఇక బంగ్లాదేశ్ పర్యటన తర్వాత విశ్రాంతి తీసుకున్న కోహ్లి.. శ్రీలంకతో స్వదేశంలో వన్డే సిరీస్‌తో మంగళవారం నాటి తొలి మ్యాచ్‌తో మళ్లీ మైదానంలో దిగనున్నాడు.
ఈ నేపథ్యంలో కోహ్లి ఈ మేరకు ఇర్ఫాన్ ఖాన్ మాటలు కోట్ చేస్తూ పోస్టు పెట్టాడు. అంతేకాదు.. ‘‘ఈ కఠిన సమయం కూడా గడిచిపోతుంది. ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదా? నీ పని అయిపోయిందనిపిస్తోందా? పరిస్థితులపై కోపం వస్తోందా?
ఇలాంటి గడ్డు పరిస్థితులూ కాలంతో పాటే మారిపోతాయి. నీకెదురైన ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నీకే కాదు నిన్ను విమర్శించిన వాళ్లకూ నువ్వు జవాబు చెప్పినట్లే అవుతుంది’’ అని హాలీవుడ్ యాక్టర్ టామ్ హాంక్స్ చెప్పిన స్ఫూర్తిదాయక మాటలను ప్రస్తావించడం విశేషం. కాగా వన్డే సిరీస్‌కు ముందు కోహ్లి ఈ మేరకు పోస్ట్ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లి పోస్ట్ వెనుక అర్థం ఏమిటంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
చదవండి: Suryakumar Yadav: సూర్య ఇండియన్ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్‌లో ఉంటేనా: పాక్ మాజీ కెప్టెన్
Suryakumar Yadav: సూర్య కెరీర్‌పై గంభీర్ ట్వీట్! నీకు అతడు మాత్రమే కనిపిస్తున్నాడా? ఫ్యాన్స్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment