tom hanks
-
మూడు దశాబ్దలకు మళ్లీ..!
అరడజను ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’. టామ్ హాంక్స్ టైటిల్ రోల్లో, రాబిన్ రైట్ ఓ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు రాబర్ట్ జెమెక్కిస్ దర్శకత్వం వహించారు. 1994 జూన్‌లో విడుదలైన ‘ఫారెస్ట్ గంప్’ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత యాక్టర్స్ టామ్ హాంక్స్–రాబిన్ రైట్, దర్శకుడు రాబర్ట్ కలిసి ‘హియర్’ అనే సినిమా చేస్తున్నారు. అంతేకాదు... ‘ఫారెస్ట్ గంప్’కు రైటర్‌గా చేసిన ఎరిక్ రోత్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే... ‘ఫారెస్ట్ గంప్’ సినిమాను ఇదే టైటిల్‌తో ఉన్న ‘ఫారెస్ట్ గంప్’ అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పుడు ‘హియర్’ సినిమాను కూడా ఇదే టైటిల్‌తో ఉన్న ఓ గ్రాఫిక్ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారని టాక్. ఇక ‘హియర్’ చిత్రాన్ని నవంబరులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
అదొక జబ్బు! బయటపడాలని కోరుకుంటున్నా.. కోహ్లి పోస్ట్ వైరల్
Virat Kohli: ‘‘పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోవడం కూడా ఓ జబ్బులాంటిదే! అయితే, ఏదో ఒకరోజు నేను ఈ జబ్బు నుంచి బయటపడాలి.. ఈ కోరికల వలయం నుంచి విముక్తి పొందాలని ఆశిస్తున్నా. కీర్తిప్రతిష్టలు పెద్ద విషయమేం కాదు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతున్నామా లేదా? ఉన్నదాంతో సంతృప్తి పడుతున్నామా లేదా అన్నదే ముఖ్యం’’.. బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఒకానొక సందర్భంలో చెప్పిన మాటలు ఇవి. జీవిత పరమార్థాన్ని తెలియజేసే ఈ కోట్‌ను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. కాగా అరంగేట్రం చేసిన అనతికాలంలోనే భారత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన కోహ్లి.. సారథిగానూ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఆటగాడిగా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 72 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ రన్‌మెషీన్.. కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేయగలిగాడు. ఇక బంగ్లాదేశ్ పర్యటన తర్వాత విశ్రాంతి తీసుకున్న కోహ్లి.. శ్రీలంకతో స్వదేశంలో వన్డే సిరీస్‌తో మంగళవారం నాటి తొలి మ్యాచ్‌తో మళ్లీ మైదానంలో దిగనున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఈ మేరకు ఇర్ఫాన్ ఖాన్ మాటలు కోట్ చేస్తూ పోస్టు పెట్టాడు. అంతేకాదు.. ‘‘ఈ కఠిన సమయం కూడా గడిచిపోతుంది. ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదా? నీ పని అయిపోయిందనిపిస్తోందా? పరిస్థితులపై కోపం వస్తోందా? ఇలాంటి గడ్డు పరిస్థితులూ కాలంతో పాటే మారిపోతాయి. నీకెదురైన ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నీకే కాదు నిన్ను విమర్శించిన వాళ్లకూ నువ్వు జవాబు చెప్పినట్లే అవుతుంది’’ అని హాలీవుడ్ యాక్టర్ టామ్ హాంక్స్ చెప్పిన స్ఫూర్తిదాయక మాటలను ప్రస్తావించడం విశేషం. కాగా వన్డే సిరీస్‌కు ముందు కోహ్లి ఈ మేరకు పోస్ట్ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లి పోస్ట్ వెనుక అర్థం ఏమిటంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి: Suryakumar Yadav: సూర్య ఇండియన్ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్లో ఉంటేనా: పాక్ మాజీ కెప్టెన్ Suryakumar Yadav: సూర్య కెరీర్‌పై గంభీర్ ట్వీట్! నీకు అతడు మాత్రమే కనిపిస్తున్నాడా? ఫ్యాన్స్ ఫైర్ -
భార్య మీద పడ్డ ఫ్యాన్స్.. అసభ్య పదజాలంతో దూషించిన నటుడు
Tom Hanks Get Fire On Fans After They Push His Wife Rita Wilson: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. ఈ మూవీ 'ది ఫారెస్ట్ గంప్'కు రీమెక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ యాక్టర్ టామ్ హాంక్స్. ఇటీవల ఈ నటుడు సహనం కోల్పోయి తన అభిమానులపై అరిచాడు. అసభ్యకర పదంతో తిట్టాడు. ఈ సంఘటన బుధవారం (జూన్ 15) రాత్రి న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. ఆస్కార్ విన్నర్ టామ్ హ్యాంక్స్ తన భార్య రిటా విల్సన్, పిల్లలతో కలిసి న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్‌కు వచ్చాడు. డిన్నర్ చేసి బయటకు వెళ్తుండగా కొంత మంది అభిమానులు టామ్ హ్యాంక్స్ చుట్టూ గుమిగూడారు. అటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు అడిగారు. ఈ క్రమంలో తన భార్యపై పడ్డారు. దాంతో ఆమె కిందపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది చూసిన టామ్ హ్యాంక్స్ తన అభిమానులపై విరుచుకుపడ్డాడు. 'వెనక్కి వెళ్లండి. రీటా నా భార్య. తనపై పడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు' అంటూ 'ఎఫ్ పదం' ఉపయోగించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. View this post on Instagram A post shared by Daniel T Myles (@danieltmyles) తర్వాత పలువురు అభిమానులు టామ్ హ్యాంక్స్‌కు క్షమాపణలు తెలిపారు. ప్రస్తుతం టామ్ హ్యాంక్స్ ఎల్విస్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వివిధ ప్రదేశాలకు వెళ్తున్నాడు టామ్. ఈ మూవీ జూన్ 24న విడుదల కానుంది. -
‘కునుకు తీసినంత సులువుగా ప్లాస్మా దానం’
కాలిఫోర్నియా : కరోనాపై విజయం సాధించిన హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాంక్స్(63) ప్లాస్మా దానం చేశారు. గత వారం టామ్ హాంక్స్ ఇచ్చిన ప్లాస్మా బ్యాగు ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. శరీరం నుంచి ప్లాస్మాను తీయడం కునుకు తీసినంత సులువుగా అనిపించిందని పేర్కొన్నారు. కాగా హాలీవుడ్ స్టార్ కపుల్ టామ్ హాంక్స్, రీటా విల్సన్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కోవిడ్ నుంచి కోలుకున్న వీరు ప్రస్తుతం అమెరికాకు చేరుకున్నారు. సేవింగ్ ప్రైవేట్రియాన్, కాస్ట్ అవే, ఫిలడెల్పియా, ఫారెస్ట్ గంప్, స్ప్లాష్, బ్యాచిలర్ పార్టీ, బిగ్, ది టెర్మిమినల్, అపో వంటి చిత్రాలతో మంచి నటుడిగా టామ్ హాంక్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి భార్య సమంతా లూయీస్ నుంచి విడిపోయిన తర్వాత 1998లో నటి రీటాను పెళ్లి చేసుకున్నారు. చదవండి : 2293 కొత్త కేసులు, 71మంది మృతి -
‘కరోనా’కు నటుడి అరుదైన గిఫ్ట్!
కరోనా పేరు వినపడితేనే చాలు ప్రపంచమంతా వణికిపోతోంది. మహమ్మారి ఎక్కడి నుంచి ఎవరికి సోకుతుందోనన్న భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పేరిట ఉన్న బ్రాండ్లు, భవనాలు, మనుషులను కొంతమంది ఆకతాయిలు తులనాడుతున్నారు. వెకిలిగా కామెంట్లు చేస్తూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియాకు చెందిన ఎనిమిదేళ్ల పిల్లాడు కరోనా డీ వెరీస్కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ క్రమంలో తన బాధను వెల్లడిస్తూ ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ అతడు లేఖ రాశాడు.(కరోనా కొత్త లక్షణం: పాదాలు, బొటనవేలు వాపు..!) ‘‘మీకు, మీ భార్యకు కరోనా సోకిందని విన్నాను. ఇప్పుడు మీరెలా ఉన్నారు. నా పేరు అంటే నాకెంతో ఇష్టం. కానీ స్కూళ్లో అందరూ నన్ను కరోనా వైరస్ అని పిలుస్తున్నారు. నాకు ఏడుపొస్తోంది. వాళ్లపై కోపం కూడా వస్తోంది’’అని టామ్ హాంక్స్‌తో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇందుకు స్పందించిన హాలీవుడ్ లెజెండ్ టామ్.. ‘‘నీ లేఖ నన్ను, నా భార్యను ఎంతో ఆశ్చర్యపరిచింది. నన్ను స్నేహితుడిలా భావించినందు వల్లే కదా నువ్విలా చేశావు’’అంటూ సదరు పిల్లాడికి కరోనా బ్రాండ్ టైప్‌రైటర్‌ను బహుమతిగా ఇచ్చారు. ‘‘నువ్వు నాకు మళ్లీ లేఖ రాస్తావు కదా. అందుకే ఈ గిఫ్ట్’’ అని పేర్కొన్నారు. (హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ) కాగా హాలీవుడ్ స్టార్ కపుల్ టామ్ హాంక్స్(63), రీటా విల్సన్(63) ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కోవిడ్ నుంచి కోలుకున్న వీరు ప్రస్తుతం అమెరికాకు చేరుకున్నారు. కాగా కాలిఫోర్నియాలో జన్మించిన టామ్ స్ప్లాష్, బ్యాచిలర్ పార్టీ, బిగ్, ఫారెస్ట్ గంప్, ది టెర్మిమినల్, అపోలో 13 తదితర చిత్రాల ద్వారా నటుడిగా గుర్తింపు పొందాడు. మొదటి భార్య సమంతా లూయీస్ నుంచి విడిపోయిన తర్వాత 1998లో నటి రీటాను పెళ్లి చేసుకున్నారు. -
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్
స్టార్ కపుల్ టామ్ హ్యాంక్స్, రీటా విల్సన్ హాస్పిటల్‌కి టాటా చెప్పి ఇంటికి చేరుకున్నారు. ఓ సినిమా షూటింగ్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు జ్వరం, అలసట అనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు టామ్, రీటా. కరోనా అని నిర్ధారణ కావడంతో ఆస్ట్రేలియాలోనే ఓ హాస్పిటల్లో చేరారు. ఐదు రోజులు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. వీళ్లు కాలిఫోర్నియాలో ఉంటారు. కానీ ఇప్పుడు ప్రయాణం మంచిది కాదని భావించి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం ఆస్ట్రేలియాలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, అక్కడ ఉండాలనుకున్నారు. కొన్నాళ్ల పాటు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. -
ఆ స్టార్ జంటకు కరోనా సోకింది!
హాలీవుడ్ జంట టామ్ హాంక్స్(63), రీటా విల్సన్(63)... కోవిడ్-19(కరోనా వైరస్) బారిన పడ్డారు. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వీరు వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని టామ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఓ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నామని పేర్కొన్నారు. ‘‘స్నేహితులందరికీ హలో.. రీటా, నేను ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాం. కాస్త అలసటగా అనిపించడంతో పాటుగా.. జలుబు, జ్వరం ఒళ్లు నొప్పుల కారణంగా పరీక్షలు చేయించుకున్నాం. కరోనా పాజిటివ్‌గా తేలింది. కాబట్టి ఇప్పటినుంచి వైద్య అధికారుల సూచనలు పాటిస్తూ ఇక్కడే ఉండాలి. మాకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. అబ్జర్వేషన్లో పెడతారు. ఆరోగ్యం కుదుటపడేంతవరకు ఇక్కడే ఉంటాం. మాకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరంతా జాగ్రత్తగా ఉండండి’’అని టామ్ ట్వీట్ చేశారు.(కోవిడ్ ప్రపంచవ్యాప్త మహమ్మారి: డబ్ల్యూహెచ్ఓ) ఈ క్రమంలో టామ్, రీటాలు త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. స్టార్ కపుల్ తమకు వినోదాన్ని పంచుతూనే ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా కాలిఫోర్నియాలో జన్మించిన టామ్ స్ప్లాష్, బ్యాచిలర్ పార్టీ, బిగ్, ఫారెస్ట్ గంప్, ది టెర్మిమినల్, అపోలో 13 తదితర చిత్రాల ద్వారా నటుడిగా గుర్తింపు పొందాడు. మొదటి భార్య సమంతా లూయీస్ నుంచి విడిపోయిన తర్వాత 1998లో నటి రీటాను పెళ్లి చేసుకున్నారు. కాగా తాను కరోనా పాజిటివ్ అని ప్రపంచాన్ని వెల్లడించిన తొలి హాలీవుడ్ స్టార్‌గా టామ్ నిలిచాడు. ఇక హ్యారీపోటర్ నటుడు డేనియల్ ర్యాడ్‌క్లిఫ్‌కు కరోనా సోకిందంటూ రూమర్లు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ర్యాడ్‌క్లిఫ్‌కు ఎటువంటి వైరస్ సోకలేదని ఆయన ప్రతినిధి మీడియాలకు వెల్లడించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా దాదాపు 107కు పైగా దేశాల్లో వేగంగా విస్తరించిన కరోనా వైరస్ (కోవిడ్-19)ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బుధవారం ప్రకటించింది. ఇక దీని కారణంగా ఇప్పటివరకు 4250 మందికి పైగా మృత్యువాత పడగా.. ఇంచుమించు లక్షా 18 వేల మంది కరోనా అనుమానితులుగా ఉన్నారు. pic.twitter.com/pgybgIYJdG — Tom Hanks (@tomhanks) March 12, 2020 -
టామ్ హ్యాంక్స్ భయపడ్డాడు!!
టామ్ హ్యాంక్స్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్. లెజెండ్. లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చెయ్యలేని పాత్రంటూ లేదనిపిస్తాడు. ఎలాంటి పాత్రనిచ్చినా అలవోకగా నటించేస్తాడు. అలాంటి నటుడు భయపడ్డాడు!! అదీ.. ఏ కొత్త పాత్ర చేయడానికో, ఏ దర్శకుడో చెప్పిన సన్నివేశాన్ని అర్థం చేసుకోలేకో, మరింకోటో కాదు. తనతో పాటు కలిసి నటించే నటిని చూసి భయపడ్డాడు. ఆ భయానికి కారణం ఏంటంటే అక్కడున్నది మెరిల్ స్ట్రీప్. ఆమె కొన్ని జనరేషన్స్ స్టార్స్‌కి ఇన్స్పిరేషన్. అవార్డ్ విన్నింగ్ యాక్టర్. అలాంటి స్టార్ టామ్ హ్యాంక్స్తో కలిస్తే? అభిమానులకు ఎలాంటి పండగో చెప్పక్కర్లేదు. తాజాగా విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోన్న ‘ది పోస్ట్’లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఇద్దరూ పోటీ పడి నటించారీ సినిమాలో. ఇక వీరికి తోడు దర్శకుడు స్పీల్బర్గ్ మ్యాజిక్ కూడా తోడవ్వడంతో ‘ది పోస్ట్’ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో మాస్టర్ అనిపించుకుంటోంది. ఇంతటి సక్సెస్ఫుల్ సినిమాలో నటించడం అదృష్టం అంటాడు టామ్ హ్యాంక్స్. మెరిల్ స్ట్రీప్‌తో కలిసి నటించడం కూడా సూపర్ ఎక్స్పీరియన్స్ అంటాడు. నిజానికి సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ముందు మెరిల్ స్ట్రీప్‌తో నటించడానికి భయపడ్డాడట హ్యాంక్స్. ‘ఎందుకూ?’ అనడిగితే, ‘ఏమో! మెరిల్ స్ట్రీప్‌తో నటించడం అంటే భయమేసింది’ అంటున్నాడు. ఆస్కార్స్‌లో ఈ సినిమా మెయిన్ అవార్డులన్నీ పట్టుకెళుతుందని హాలీవుడ్ అంచనా వేసుకుంటోంది. పోటీ పడి నటించిన ఈ స్టార్స్‌లో ఎవరో ఒకరు అవార్డు దక్కించుకునేలాగే ఉన్నారు కూడా!! -
సెక్స్ స్కాండల్వుడ్!!
సెక్స్ స్కాండల్వుడ్.. ఇప్పుడు హాలీవుడ్‌కు ఈ పేరు సరిగ్గా సరిపోతుంది. నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్ అరాచకాలు బయటపడ్డ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా ‘మీటూ..’ అన్న ఉద్యమం ఏ స్థాయిలో జరుగుతోందో చెప్పక్కర్లేదు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వెయిన్‌స్టీన్ తమపై చేసిన లైంగిక వేధింపుల గురించి ప్రపంచానికి తెలియజేస్తూ ఎంతోమంది గొంతు విప్పారు. ఈ సంఘటన జరిగి రెండు నెలలైనా ఇప్పటికీ మీటూ ఉద్యమం అలాగే ఉంది. అలాగే హాలీవుడ్లో ఈ లిస్ట్ వెయిన్‌స్టీన్ దగ్గరే ఆగిపోలేదు. అదలా రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఎక్కడికెళ్లినా మీడియా అడుగుతోన్న ప్రశ్న ఒక్కటే.. ‘‘సెక్స్ స్కాండల్స్ గురించి మీరేమంటారు?’’ అని. చిత్రమేమిటంటే.. పలువురు స్టార్స్ కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారి జాబితాలో ఉండడం. ఓలివర్ స్టోన్, సిల్వెస్టర్ స్టాలోన్, అల్ ఫ్రాంకెన్, గారిసన్ కిల్లర్, లూయిస్ సీకె, కెవిన్ స్పేసీ, చార్లీ షీన్.. ఇలా చాలామంది స్టార్స్‌పై ఆరోపణలు వస్తున్నాయి. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ, పడుతున్న వారి గురించి హీరోయిన్స్ ధైర్యంగా బయటకొచ్చి చెబుతున్నారు. ‘మీటూ..’ హాలీవుడ్లో హీరోయిన్లకు ఓ కొత్త ఆయుధంలా తయారైంది. నాకేం ఆశ్చర్యం కలిగించలేదు! ఈ సెక్స్ స్కాండల్స్ గురించి ప్రముఖ నటుడు టామ్ హ్యాంక్స్ మాట్లాడుతూ –‘‘నాకేం ఆశ్చర్యంగా అనిపించడంలేదు. లైంగిక వేధింపులకు గురిచేసేవాళ్లు అన్ని చోట్లా ఉన్నారు. సినిమా అనే బిజినెస్‌ను ఒక గౌరవంగా భావించే వాళ్ల వల్ల ఏ నష్టమూ జరగదు. పవర్ కోసం, వేరే లాభాల కోసం సినిమాని ఆయుధంగా ఉపయోగించుకునేవాళ్లు ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. హాలీవుడ్ అంటే జస్ట్ సెక్స్ స్కాండల్స్ కాదు. మంచి విషయాలు కూడా చాలా ఉన్నాయి. చెడు పరంగా పరిస్థితులు తప్పకుండా మారతాయి’’ అన్నారు. -
హీరో పోలికల్లో లండన్ రాణి!
చైనీస్ కళాకారుడు డాపెంగ్ రూపొందించి.. ప్రదర్శించిన బ్రిటన్ రాణి మట్టిప్రతిమ... ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లండన్ సామ్రాజ్యాన్ని సుదీర్ఘకాలం పాలించిన రాణిగా ఇటీవల రికార్డు సృష్టించిన రెండో ఎలిజబెత్ శిల్పం... లండన్ వింటర్ ఆర్ట్ అండ్ యాంటిక్ ఫెయిర్‌లో గత నెల్లో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఆమె.. ప్రముఖ నటుడు టామ్ హాంక్స్ పోలికలతో ఉండటం విమర్శకులను ఆశ్చర్యపరచింది. ఆమె రూపాన్ని చూసి అంతా భయపడ్డారు. అసలు ఆమె మహారాణిలాగానే కనిపించడం లేదన్నారు... ఆర్ట్ క్రిటిక్ మార్క్ హడ్సన్. తల వెనుక భాగం చాలా పెద్దగా ఉండి, బాక్సర్ గడ్డంతో చూసేందుకు టామ్ హాంక్స్లా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. నిజానికి మహారాణి ప్రతిమను తయారుచేసేందుకు కళాకారుడు డాపెంగ్ మూడునెలల సమయంలో 13 సార్లు మార్పులు చేర్పులు చేశాడన్నారు. 20 కేజీల బరువున్నశిల్పం.. ముఖం కూడా చాలా మందంగా కనిపిస్తోందని, జుట్టు మాత్రమే రాణి పోలికల్లో ఉందని విమర్శకులు అంటున్నారు. -
‘టామ్’ కథలు..!
ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ టామ్ హ్యాంక్స్ పెన్ను పట్టాడు. అలాగని సినిమా కథో.. స్క్రిప్టో అనుకొనేరు. టైపు రైటర్లపై షార్ట్ స్టోరీస్ రాయాలని డిసైడయ్యాడట. పబ్లిషింగ్ హౌస్ ఆల్ఫ్రెడ్ ఎ నాఫ్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. యాభై ఎనిమిదేళ్ల ఈ స్టార్ టైప్రైటర్ల కలెక్షన్ ఫొటోలు కూడా ఈ పుస్తకంలో ఉంటాయట. టామ్‌కు టైప్రైటర్లంటే ఎంతో మక్కువట. టైప్‌రైటర్ యాప్.. ‘హ్యాంక్స్ రైటర్’ కూడా డెవలప్ చేశాడని ఓ ఆంగ్ల పత్రిక కథనం. ‘1978 నుంచి టైపు రైటర్లు కలెక్ట్ చేస్తున్నా. దానికి కారణమేమీ లేదు’ అన్నాడు టామ్.