మూడు దశాబ్దలకు మళ్లీ..!  | Tom Hanks Is Reuniting With His Forrest Gump Team for Here This November | Sakshi
Sakshi News home page

మూడు దశాబ్దలకు మళ్లీ..! 

Published Sun, Mar 31 2024 1:18 AM | Last Updated on Sun, Mar 31 2024 1:18 AM

Tom Hanks Is Reuniting With His Forrest Gump Team for Here This November - Sakshi

అరడజను ఆస్కార్‌ అవార్డులు గెలుచుకున్న హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’. టామ్‌ హాంక్స్‌ టైటిల్‌ రోల్‌లో, రాబిన్‌ రైట్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటించిన ఈ సినిమాకు రాబర్ట్‌ జెమెక్కిస్‌ దర్శకత్వం వహించారు. 1994 జూన్‌లో విడుదలైన ‘ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత యాక్టర్స్‌ టామ్‌ హాంక్స్‌–రాబిన్‌ రైట్, దర్శకుడు రాబర్ట్‌ కలిసి ‘హియర్‌’ అనే సినిమా చేస్తున్నారు.

అంతేకాదు... ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రైటర్‌గా చేసిన ఎరిక్‌ రోత్‌ ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే... ‘ఫారెస్ట్‌ గంప్‌’ సినిమాను ఇదే టైటిల్‌తో ఉన్న ‘ఫారెస్ట్‌ గంప్‌’ అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పుడు ‘హియర్‌’ సినిమాను కూడా ఇదే టైటిల్‌తో ఉన్న ఓ గ్రాఫిక్‌ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారని టాక్‌. ఇక ‘హియర్‌’ చిత్రాన్ని నవంబరులో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement