మీ ఐ ఫోన్ అప్ డేట్ చేయకపోతే అంతే....
ఐ ఫోన్లలో ప్రమాదకరమైన బగ్ ఉన్నట్లు వార్తలు రావడంతో ఐ ఫోన్ మేకర్ యాపిల్ స్పందించింది. ఐఫోన్ , ఐప్యాడ్ ల లో ప్రమాదకరమైన భద్రతా లోపం పరిష్కరించుకోవాలని సూచిస్తూ ఆపిల్ ఆగస్టు 25 న ప్రకటన జారీ చేసింది. ఈ లోపాలను సరిదిద్దుతూ పాచ్ జారీ చేసింది. ఐఓఎస్9.3.5 వెర్షన్‌ను విడుదల చేసింది. తక్షణమే ఓఎస్‌ను అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది. దీని ద్వారా ఐఫోన్ 4ఎస్, ఐఫ్యాడ్2, ఐపాడ్ టచ్(5వ జెనరేషన్)తోపాటు ఆ తర్వాతి మోడల్ డివైజ్‌లలో ఈ కొత్త వెర్షన్‌ను అప్డేట్ చేసుకునే వీలుంది.
తమ ఆపరేటింగ్ సిస్టం లేటెస్ట్ వెర్షన్ డైన్ లోడ్ చేసుకునొ అప్ డేట్ చేసుకోవల్సిందిగా యూజర్లందరిని కోరినట్టు తెలిపింది. తద్వారా భద్రతను పెంచుకోవాల్సిందిగా అప్రమత్తం చేసినట్టు పేర్కొంది. ప్రముఖ నెట్వర్కింగ్ సంస్థ సిస్కోకు చెందిన పరిశోధకులు ఇటీవల గుర్తించారు. ఆ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు మెసేజ్‌ల రూపంలో మాల్వేర్ లింకులను పంపి దాడులకు పాల్పడే ప్రమాదముందని హెచ్చరించారు. మరోవైపు ఓ అంతర్జాతీయ మానవ హక్కుల ఉద్యమకర్తపై నిఘా పెట్టేందుకు మొబైల్ స్పైవేర్‌తో తాజాగా అతని ఫోన్‌పై దాడి జరిగినట్లు యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలోని సిటిజన్ ల్యాబ్, లుకౌట్ సెక్యూరిటీ సంస్థలకు చెందిన పరిశోధకులు గుర్తించారు. సైబర్ దాడి చేసి కాల్స్ ట్రాకింగ్.. లొకేషన్ ట్రాకింగ్‌కు పాల్పడడంతో పాటు.. ఫోన్లోని మెసేజ్‌లు.. కాంటాక్ట్స్.. రికార్డింగ్‌లు.. పాస్‌వర్డ్‌లను తస్కరించే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు. దాంతో స్పందించిన యాపిల్ ఈ చర్యలకు దిగింది. ఇందులో మూడు సెక్యూరిటీ లోపాలను తొలగించినట్లు చెబుతున్నారు.
ఇజ్రాయిల్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఎన్ ఎస్ ఓ గ్రూపు దీనికి కారణంగా నిపుణులు పేర్కొన్నారు. రెడ్ క్రాస్, ఫేస్ బుక్, అల్ జజీరా, సీఎన్ ఎన్ , గూగుల్, పోకీమాన్ సంస్థ లను టార్గెట్ చేసిందనీ, దీనికి టూల్స్ రూపకల్పన చేసిందనీ చెబుతున్నారు.
కాగా సెక్యూరిటీ సమస్యలు ఎక్కువవుతున్న నేపథ్యంలో యాపిల్ సంస్థ తొలిసారిగా బగ్‌బాంటీ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. బగ్ ను గుర్తించిన వారికి రెండు లక్షల డాలర్ల వరకు నగదు బహుమతి కూడా ఇవ్వనున్నట్లు యాపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.