టామ్‌ హ్యాంక్స్‌ భయపడ్డాడు!! | Tom Hanks was afraid of Meryl Streep | Sakshi
Sakshi News home page

టామ్‌ హ్యాంక్స్‌ భయపడ్డాడు!!

Published Mon, Jan 22 2018 1:11 AM | Last Updated on Mon, Jan 22 2018 1:11 AM

Tom Hanks was afraid of Meryl Streep - Sakshi

మెరిల్‌ స్ట్రీప్, టామ్‌ హ్యాంక్స్‌

టామ్‌ హ్యాంక్స్‌ అవార్డ్‌ విన్నింగ్‌ యాక్టర్‌. లెజెండ్‌. లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చెయ్యలేని పాత్రంటూ లేదనిపిస్తాడు. ఎలాంటి పాత్రనిచ్చినా అలవోకగా నటించేస్తాడు. అలాంటి నటుడు భయపడ్డాడు!! అదీ.. ఏ కొత్త పాత్ర చేయడానికో, ఏ దర్శకుడో చెప్పిన సన్నివేశాన్ని అర్థం చేసుకోలేకో, మరింకోటో కాదు. తనతో పాటు కలిసి నటించే నటిని చూసి భయపడ్డాడు. ఆ భయానికి కారణం ఏంటంటే అక్కడున్నది మెరిల్‌ స్ట్రీప్‌.

ఆమె కొన్ని జనరేషన్స్‌ స్టార్స్‌కి ఇన్స్‌పిరేషన్‌. అవార్డ్‌ విన్నింగ్‌ యాక్టర్‌. అలాంటి స్టార్‌ టామ్‌ హ్యాంక్స్‌తో కలిస్తే? అభిమానులకు ఎలాంటి పండగో చెప్పక్కర్లేదు. తాజాగా విడుదలై సూపర్‌ రెస్పాన్స్‌ తెచ్చుకుంటోన్న ‘ది పోస్ట్‌’లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఇద్దరూ పోటీ పడి నటించారీ సినిమాలో. ఇక వీరికి తోడు దర్శకుడు స్పీల్‌బర్గ్‌ మ్యాజిక్‌ కూడా తోడవ్వడంతో ‘ది పోస్ట్‌’ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడంలో మాస్టర్‌ అనిపించుకుంటోంది. ఇంతటి సక్సెస్‌ఫుల్‌ సినిమాలో నటించడం అదృష్టం అంటాడు టామ్‌ హ్యాంక్స్‌.

మెరిల్‌ స్ట్రీప్‌తో కలిసి నటించడం కూడా సూపర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అంటాడు. నిజానికి సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ముందు మెరిల్‌ స్ట్రీప్‌తో నటించడానికి భయపడ్డాడట హ్యాంక్స్‌. ‘ఎందుకూ?’ అనడిగితే, ‘ఏమో! మెరిల్‌ స్ట్రీప్‌తో నటించడం అంటే భయమేసింది’ అంటున్నాడు. ఆస్కార్స్‌లో ఈ సినిమా మెయిన్‌ అవార్డులన్నీ పట్టుకెళుతుందని హాలీవుడ్‌ అంచనా వేసుకుంటోంది. పోటీ పడి నటించిన ఈ స్టార్స్‌లో ఎవరో ఒకరు అవార్డు దక్కించుకునేలాగే ఉన్నారు కూడా!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement