హాలీవుడ్ ప్రముఖ నటి మెరిల్ స్ట్రీప్ ఆనందంలో ఉన్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకు ఫ్రాన్స్‌లో 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ చలన చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన పామ్ డి ఓర్ గౌరవ పురస్కారానికి మెరిల్ స్ట్రీప్‌ను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆమె ఆనందానికి కారణం ఇదే.
ఈ ఏడాది మెరిల్ స్ట్రీప్‌కు, జపాన్‌కు చెందిన యానిమేషన్ ‘స్టూడియో ఘిబ్లి’ నిర్వాహకులకు, హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ వాల్టన్ లూకాస్ జూనియర్ (స్టార్ వార్స్, ఇండియానా జోన్స్’ ఫేమ్)కు పామ్ డి ఓర్ పురస్కారాన్ని అందజేస్తారు.
ఈ సందర్భంగా మెరిల్ స్ట్రీప్ మాట్లాడుతూ – ‘‘ఈ అవార్డుకు ఎంపిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. అంతర్జాతీయ నటీనటులు, ఫిల్మ్ మేకర్స్ భాగాస్వామ్యులైన కాన్స్ వేదికగా నేను ఈ అవార్డును గెలుచుకోవడం అనేది ఫిల్మ్ మేకింగ్ రంగంలో నాకు దక్కిన ఓ అద్భుత విజయంగా భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. గతంలో హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్, మైఖేల్ డగ్లస్, హారిసన్ ఫోర్డ్ వంటివారికి పామ్ డీ ఓర్ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment