హీరోతో ఆ పని చేయాలంటూ నిర్మాత బలవంతం చేశాడు: నటి | Hollywood Actress Sharon Stone Names Producer Who Suggested She Sleep With Sliver Co-Star Billy Baldwin - Sakshi
Sakshi News home page

Sharon Stone: హీరోతో ఆ పని చేయాలంటూ నిర్మాత బలవంతం చేశాడు

Published Wed, Mar 13 2024 12:42 PM | Last Updated on Wed, Mar 13 2024 12:55 PM

Hollywood Actress Sharon Stone Reveals Identity Of Hollywood Producer Who Told Her To Sleep With Hero - Sakshi

తనను బలవంతం చేసిన నిర్మాత పేరును వెల్లడించిన షరాన్ స్టోన్

హాలీవుడ్‌ నటి న షరాన్ స్టోన్ గుర్తుందా? అదేనండి 90లలో వచ్చిన 'బేసిక్ ఇన్స్టింక్ట్'సినిమాతో ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోయింది. ఆ తర్వాత 1993లో వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘స్లీవర్‌’తో యువత కలల రాణిగా మారిపోయింది. ఆ సినిమాలోని శృంగార సన్నివేశాలు అప్పట్లో పెద్ద ట్రెండ్‌ సెట్‌ చేశాయి. ఆ తర్వాత వరుస సినిమాలతో హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు హాలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టించాయి. ముఖ్యంగా  ఓ నిర్మాత తనను వేధించాడంటూ ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే ఆ నిర్మాత ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. చాలా రోజుల తర్వాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ నిర్మాత ఎవరో బహిర్గతం చేసింది ఈ ఓల్డ్‌ బ్యూటీ. ‘స్లీవర్‌’మూవీ షూటింగ్‌ సమయంలో హీరో బిల్లీ బాల్డ్‌విన్‌తో శృంగారంలో పాల్గొనాలని నిర్మాత రాబర్డ్‌ ఈవెన్స్‌(2019తో ఈయన మరణించాడు) బలవంతం పెట్టినట్లు గుర్తు చేసింది. 

‘ఓ రోజు నిర్మాత రాబర్డ్‌ తన ఆఫీస్‌కు రమ్మని కబురు పంపారు. నేను అక్కడికి వెళ్లగా.. సినిమా గురించి మాట్లాడుతూ బిల్లీ బాల్డ్‌విన్‌తో చనువుగా ఉంటే ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగుంటుందని చెప్పారు. అతనితో నిజంగానే శృంగారంలో పాల్గొంటే.. ఆ సన్నివేశాలను తెరపై చక్కగా పండుతాయని ప్రలోభ పెట్టాడు. కానీ నేను ఆ పని చేయలేనని చెప్పేశాను’ అని నటి షరాన్‌ స్టోన్‌ చెప్పుకొచ్చింది. 

షరాన్‌ స్టోన్‌ చేసిన ఆరోపణలపై నటుడు బిల్లీ బాల్డ్‌విన్‌ ఎక్స్‌(ట్విటర్‌)వేదికగా కౌంటర్‌ ఇచ్చాడు. ‘సినిమా రిలీజైన ఇన్నేళ్లకు షారన్‌ స్టోన్‌ నా గురించి ఎందుకు మాట్లాడుతుందో చెప్పండి? ఆమెకు ఇప్పటికీ నాపై క్రష్‌ఉందా? లేదా ఆమె ఇచ్చిన చనువును అడ్వాన్స్‌గా తీసుకోకపోవడంతో ఇనేళ్లుగా బాధపడుతూనే ఉందా? నేను కూడా ఒక బుక్‌ రాసి..అందులో ఆమె గురించి అసత్యాలను, అసభ్యకరమైన విషయాలను చెప్పాలా ఏంటి? అంటూ షరాన్‌ చేసిన ఆరోపణలు అన్ని అబద్దాలనే పరోక్షంగా చెప్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement