Afraid
-
కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు.. వణుకుతున్న కూలీలు!
సాధారణంగా రైతులు చేతికొచ్చిన పంటను వీలైనంత త్వరగా కోసి, కొత్త పంటకు నేలను సిద్ధం చేస్తారు. అయితే దీనికి విరుద్దంగా ఆ ప్రాంతంలో కోతకు సిద్ధంగా ఉన్న చెరకు, వరి పంటలను కోసేందుకు రైతులు వెనుకాడుతున్నారు. అది ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లా.. అక్కడి రైతులు చేతికందిన చెరకును కోయాలంటే గజగజా వణికిపోతున్నారు. దీని వెనుక కారణం తెలిస్తే ఎవరైనా కూడా భయపడాల్సిందే. యూపీలోని పిలిభిత్ జిల్లా రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తులకు కీలకమైన ప్రాంతంగా గుర్తింపుపొందింది. జిల్లాలోని రైతులు ప్రధానంగా వరి, చెరకు పండిస్తుంటారు. అయితే జిల్లాలో ప్రతి ఏటా పంట కోతకు వచ్చినప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని వెనుక ప్రకృతి వైపరీత్యమేదో కారణమనుకుంటే పప్పులో కాలేసినట్లే. దీనికి వన్యప్రాణులు ప్రధాన కారణమని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పిలిభిత్ జిల్లాలోని టైగర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉన్న అనేక ప్రాంతాలకు పులులు వస్తుంటాయి. ఇవి చెరకు, వరి పొలాలలో దాక్కుంటాయి. అటువంటి పరిస్థితిలో పంటల కోత సమయంలో కూలీలు వన్యప్రాణుల బారిన పడుతున్నారు. తాజాగా మాథొటాండా పరిధిలోని పిపరియా సంతోష్ గ్రామ రైతులు.. మిల్లు నుంచి స్లిప్ తీసుకున్నా చెరుకు పంటను కోసేందుకు వెనుకాడుతున్నారు. పలువురు రైతులు రెట్టింపు వేతనాలు ఇస్తామంటున్నా కూలీలు ఈ పొలాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. అక్టోబర్ 19 నుండి ఈ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పంట కోస్తున్న సమయంలో కూలీలపై పులులు దాడి చేస్తున్నాయి. ఇటువంటి భయానక పరిస్థితుల్లో కోతకు సిద్ధంగా ఉన్న చెరకు, వరి పంటలు అలానే ఉండిపోతున్నాయి. కాగా పిలిభిత్ సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్ఓ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితులపై ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. వారి అనుమతి లభించాక రెస్క్యూ ఆపరేషన్ చేపడతామన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో లక్షల్లో తులసి మాలల విక్రయాలు! -
పారిశ్రామికవేత్తలతో ఉంటే భయమేంటి?
లక్నో: పారిశ్రామికవేత్తలతో కలిసి ఉంటారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. వారితో కలిసుంటే తప్పేమీలేదని.. అందుకు తాను భయపడబోనన్నారు. దేశాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కీలకపాత్ర పోషిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. దేశం 70 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు విపక్షాలే కారణమని.. వీటికి ఆ పార్టీలే జవాబుదారీ అని విమర్శించారు. ఆదివారం లక్నోలో రూ.60వేల కోట్ల విలువైన 81 పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. వారు దొంగలు కారు! పారిశ్రామికవేత్తలను దొంగలు, దోపిడీ దారులంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు సరికావని మోదీ అన్నారు. తన ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నందున.. వ్యాపార, పారిశ్రామిక వర్గంతో కలిసి నడవడాన్ని తప్పనుకోవడం లేదన్నారు. జాతిపిత మహాత్మాగాంధీకి కూడా బిర్లా కుటుంబంతో సన్నిహిత సంబంధాలుండేవని.. అంతమాత్రాన గాంధీ ఉద్దేశాలను తప్పుబట్టలేమన్నారు. ‘రైతులు, బ్యాంకర్లు, ప్రభుత్వోద్యోగులు, కార్మికుల్లాగే.. పారిశ్రామికవేత్తలు కూడా దేశాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యారు. నన్ను విమర్శించేందుకు కారణాలు వెదుకుతున్న వారు.. 70 ఏళ్లుగా వారు చేసిన తప్పుల వివరాలు వెతుక్కోవాలి’ అని మోదీ విమర్శించారు. ‘ప్రజలతో కలవలేని వారు, తెరవెనుక పనులు చేసేవారు భయపడుతూనే ఉంటారు. కావాలంటే దీనిపై ఇక్కడున్న మాజీ ఎస్పీ నేత అమర్‌సింగ్ పూర్తి వివరాలిస్తారు’ అని మోదీ నవ్వుతూ చెప్పారు. ‘తప్పుడు పనులు చేసేవారు దేశాన్ని వదిలిపెట్టి పోవాలి. లేదంటే జైలు జీవితం గడపాలి. గతంలో అంతా తెరచాటున జరిగేది కాబట్టే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేదు. ఇకపై ఇలాంటివి నడవవు’ అని ప్రధాని స్పష్టం చేశారు. లక్నోలో జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలంతా హాజరయ్యారు. -
టామ్ హ్యాంక్స్ భయపడ్డాడు!!
టామ్ హ్యాంక్స్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్. లెజెండ్. లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చెయ్యలేని పాత్రంటూ లేదనిపిస్తాడు. ఎలాంటి పాత్రనిచ్చినా అలవోకగా నటించేస్తాడు. అలాంటి నటుడు భయపడ్డాడు!! అదీ.. ఏ కొత్త పాత్ర చేయడానికో, ఏ దర్శకుడో చెప్పిన సన్నివేశాన్ని అర్థం చేసుకోలేకో, మరింకోటో కాదు. తనతో పాటు కలిసి నటించే నటిని చూసి భయపడ్డాడు. ఆ భయానికి కారణం ఏంటంటే అక్కడున్నది మెరిల్ స్ట్రీప్. ఆమె కొన్ని జనరేషన్స్ స్టార్స్‌కి ఇన్స్పిరేషన్. అవార్డ్ విన్నింగ్ యాక్టర్. అలాంటి స్టార్ టామ్ హ్యాంక్స్తో కలిస్తే? అభిమానులకు ఎలాంటి పండగో చెప్పక్కర్లేదు. తాజాగా విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోన్న ‘ది పోస్ట్’లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఇద్దరూ పోటీ పడి నటించారీ సినిమాలో. ఇక వీరికి తోడు దర్శకుడు స్పీల్బర్గ్ మ్యాజిక్ కూడా తోడవ్వడంతో ‘ది పోస్ట్’ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో మాస్టర్ అనిపించుకుంటోంది. ఇంతటి సక్సెస్ఫుల్ సినిమాలో నటించడం అదృష్టం అంటాడు టామ్ హ్యాంక్స్. మెరిల్ స్ట్రీప్‌తో కలిసి నటించడం కూడా సూపర్ ఎక్స్పీరియన్స్ అంటాడు. నిజానికి సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ముందు మెరిల్ స్ట్రీప్‌తో నటించడానికి భయపడ్డాడట హ్యాంక్స్. ‘ఎందుకూ?’ అనడిగితే, ‘ఏమో! మెరిల్ స్ట్రీప్‌తో నటించడం అంటే భయమేసింది’ అంటున్నాడు. ఆస్కార్స్‌లో ఈ సినిమా మెయిన్ అవార్డులన్నీ పట్టుకెళుతుందని హాలీవుడ్ అంచనా వేసుకుంటోంది. పోటీ పడి నటించిన ఈ స్టార్స్‌లో ఎవరో ఒకరు అవార్డు దక్కించుకునేలాగే ఉన్నారు కూడా!! -
కేసులకు భయపడను: మాజీ సీఎం
శివాజీనగర్: 150 కోట్ల రూపాయల ముడుపుల ఆరోపణలు కానీ, జంతకల్ మైనింగ్ కేసులో తాను ఏ తప్పు చేయలేదని కాబట్టి భయపడేది లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్.డీ. కుమారస్వామి స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే రానున్న రోజుల్లో వారు తవ్వుకున్న గోతిలో వారే పడిపోతారని పరోక్షంగా సీఎం సిద్ధరామయ్యను హెచ్చరించారు. ఆదివారం బెంగళూర్ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్ట్ గిల్డ్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో కుమారస్వామి మాట్లాడుతూ.. తనను అపరాధి స్థానంలో నిలపాలనుకునే వారికి ఇది తాత్కలిక ఆనందం మాత్రమే అన్నారు. సీఎం సిద్ధరామయ్య నడుపుతున్న ద్వేష రాజకీయాలను ఒంటరిగానే ఎదుర్కొని పోరాడుతామని చెప్పారు. ‘ జంతకల్ మైనింగ్ కేసుకు సంబంధించి నాకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పే కోర్టు మెట్లు ఎక్కేటట్లు చేశారు. ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసిన దానిపై స్పందించను, ప్రజలే తుది తీర్పు చెబుతారు. అవినీతి రహిత పాలననున అందిస్తానని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పిన మాట ప్రకారం నడుచుకోవటం లేదని ఆయన అన్నారు. లోకాయుక్త సంస్థను మూసివేసి ఏసీబీ సంస్థను సృష్టించారు’ అని కుమరస్వామి విమర్శించారు. పధకాల గురించి సీఎం గొప్పలు చెప్పుకొంటున్నారని, అయితే రాష్ట్రంలో ఎంత మంది వీటి వల్ల లబ్ధిపోందారనేది ప్రకటించాలని కోరారు. అవినీతిలో కూరుకుపోయిన వికాస్ బనసోడను న్యాయ సలహాదారుగా సీఎం సిద్ధరామయ్య నియమించుకున్నారని కుమార స్వామి దుయ్యబట్టారు. బీబీఎంపీలో మిత్రదోహం బీబీఎంలో కాంగ్రెస్‌పార్టీ మిత్ర ద్రోహానికి పాల్పడిందని కుమారస్వామి ధ్వజమెత్తారు. అందుచేత ముందు జరిగే మేయర్, ఉప మేయర్ ఎన్నికల సమయంలో తమ పార్టీ మద్దతును కొనసాగించాలా, లేదా అనే విషయమై త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. తమ పార్టీ మహిళా కార్పొరేటర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతుదారులు దాడికి పాల్పడినందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. -
ఆ ఏడు దేశాల్లో ట్రంప్ గుబులు!
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపడుతుండటం.. నిన్నటివరకూ ప్రత్యర్థిగా ఉన్న రష్యా వంటి కొన్ని దేశాలకు సంతోషాన్నిస్తోంటే.. అమెరికాతో కలిసి నాటో రక్షణ కూటమిలో ఉన్న పలు బాల్టిక్ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. పొరుగు దేశమైన మెక్సికో, ఆర్థిక భాగస్వామి జపాన్‌వంటి దేశాలూ ఆందోళన చెందుతున్నాయి. మెక్సికో: ఎన్నికల ప్రచారం నుంచే మెక్సికో మీద ట్రంప్గురిపెట్టారు. వలసలను నిరోధించేందుకు మెక్సికో సరిహద్దులో గోడ కట్టేస్తానని, దానికయ్యే ఖర్చునూ ఆ దేశం నుంచి వసూలు చేస్తానని, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న కొన్ని లక్షల మంది మెక్సికన్లను తిప్పి పంపించేస్తానని ట్రంప్ పదే పదే ఉద్ఘాటించడం ఇందుకు ప్రధాన కారణం. అంతేకాదు.. మెక్సికో చేసే ఎగుమతుల్లో 80 శాతం వాటా అమెరికాదే. దీంతో ట్రంప్ ప్రభావం దేశంపై ఎలా ఉంటుందన్నఆందోళన మెక్సికోలో నెలకొంది. జపాన్: చైనాపై ట్రంప్ ప్రకటిస్తున్న వ్యతిరేక వైఖరి.. చైనాకు సమీపంలో ఉన్న తనను ఇరుకున పెడుతుందన్న ఆందోళన జపాన్‌లో నెలకొంది. అమెరికా, చైనా రెండు దేశాలతోనూ జపాన్‌కు కీలకమైన ఆర్థిక సంబంధాలున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడును ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించే పక్షంలో.. ఈ రెండు ఆర్థిక శక్తుల పోరులో తాను చిక్కుకుపోయే పరిస్థితి వస్తుందని కలవరపడుతోంది. జర్మనీ: యూరప్‌లో అతి ముఖ్యమైన దేశమైన జర్మనీని కూడా ట్రంప్ కలవరపాటుకు గురిచేస్తున్నారు. వాస్తవానికి ఉక్రెయిన్‌లో జోక్యం చేసుకున్నందుకు రష్యా మీద యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించేలా యూరప్ దేశాలను ప్రభావితం చేసింది జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్. ఇప్పుడు రష్యాతో ట్రంప్ సహితం.. యూరప్ జర్మనీ ప్రాబల్యాన్ని తగ్గించడంతో పాటు, మెర్కెల్ వ్యతిరేకులను బలోపేతం చేస్తుందన్న ఆందోళన ఆ దేశంలో కనిపిస్తోంది. ఫ్రాన్స్: అమెరికాలో ట్రంప్ గెలుపు ఫ్రాన్స్‌లో రాజకీయ ఆందోళనకు దారితీసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ కూడా మితవాద నేషనల్ ప్రంట్ గెలిచే అవకాశం ఉందన్నది ఆ ఆందోళన. ఆ పార్టీ నేత మరైన్లె పెన్కు ట్రంప్ బాహాటంగా మద్దతు ప్రకటిస్తే.. ఆమె గెలుపు అవకాశాలు ఊపందుకుంటాయని ప్రత్యర్థులు కలవరపడుతున్నారు. లాత్వియా, ఎస్టోనియా, లిథువేనియా: బాల్టిక్ దేశాలైన ఈ మూడు దేశాలకూ ఇప్పుడు ఆందోళన తీవ్రమైంది. రష్యా జాతీయుల ప్రయోజనం పేరుతో ఉక్రెయిన్ సంక్షోభంలో జోక్యం చేసుకున్న రష్యా.. రష్యా జాతీయులు గణనీయంగా ఉన్న తమ దేశాల్లో కూడా రేపు వేలు పెడుతుందన్న కలవరం లాత్వియా, ఎస్టోనియా, లిథువేనియాలది. సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా అమెరికా సారథ్యంలో గల నాటో సైనిక కూటమిలో ఉన్నందున ఇంతకాలం కాస్త ధైర్యంగా ఉన్నాయి. ఇప్పుడు రష్యాతో స్నేహం పెంపొందించుకోవాలని ఒకవైపు, నాటో కూటమికి కాలం చెల్లిందని మరొకవైపు వ్యాఖ్యానిస్తున్న ట్రంప్ తీరు ఈ దేశాల్లో గుబులు రేకెత్తిస్తోంది. దీంతో రష్యా సరిహద్దు వెంట గోడలు కట్టేయాలని లాత్వియా, ఎస్టోనియాలు, కనీసం కంచె అన్నా వేయాలని లిథువేనియా యోచిస్తున్నాయి. ఇండియాలో అయోమయం! భారత్ అమెరికాల మధ్య సంబంధాలు గత రెండు దశాబ్దాలుగా బలపడుతూ వచ్చాయి. ఇప్పుడు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్వల్ల ఈ సంబంధాలు ఇంకా బలపడతాయా? భారత్‌కు లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అన్న డైలమా భారత్ నెలకొంది. ముఖ్యంగా.. హెచ్1బి వీసా నిబంధనలు కఠినతరం చేసే ప్రయత్నాలు భారత ఐటీ నిపుణులు, సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్న ఆందోళన చాలా కాలంగా పెరుగుతోంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో చూస్తే.. చైనా విషయంలో కఠినంగా మాట్లాడుతున్న ట్రంప్, తొలుత పాకిస్తాన్ విషయంలోనూ అదే స్వరం వినిపించారు. ఆ దేశానికి అందిస్తున్న సాయాన్ని పనితీరు ఆధారంగా సమీక్షించి కోత వేయాలని ఉద్ఘాటించారు. దీంతో.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు ట్రంప్ సాయపడగలరన్న ఆశలు భారత్‌లో కలిగాయి. కానీ.. ట్రంప్ ఇటీవల పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీష్‌తో మాట్లాడటం అందుకు విరుద్ధమైన సంకేతాలనిచ్చింది. పాక్ విషయంలో ట్రంప్ కూడా పాత బాటనే పయనిస్తారా లేదా తాను అన్నట్లుగా సమీక్షిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. అలాగే.. ఐక్యరాజ్యసమితిలో, భద్రతామండలిలో సమూల సంస్కరణల అమలును డిమాండ్ చేస్తున్న భారతదేశానికి.. అమెరికా రాష్ట్రం దక్షిణ కరొలినా గవర్నర్, భారత సంతతి మహిళ నిక్కీ హేలీని ఐరాసలో అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించడం కాస్త ఊరటనిస్తున్న అంశం. సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అతడు బయటే ఉంటే.. నా కూతురు బతకదు
పాట్నా: మైనర్ బాలిక రేప్ కేసులో నిందితుడిగా ఉండి ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లబ్ యాదవ్ బయటే ఉంటే తన కూతురు పనైపోయినట్లే అని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. అతడు బయటే ఉంటే నేను పోరాడలేను. ఇక నా కూతురు పనైపోయినట్లే అని చిన్న పాన్‌షాప్ నిర్వహిస్తున్న బాలిక తండ్రి జాతీయ మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం ఆందోళన వ్యక్తంచేశాడు. ఇటీవల బాధిత బాలిక 'నాపై అత్యాచారానికి పాల్పడిన యాదవ్ జైలు నుంచి బయటకొచ్చాడు. నాకు జరిగిన సంఘటనతో ఇప్పటికే నేను చచ్చిపోయిన దాన్ని. నేను కోల్పోయేందుకు ఇంకేం లేదు. నేను ఇప్పుడు నా కుటుంబం గురించి భయపడుతున్నాను అంటూ వాట్సప్‌లో మీడియాకు తెలపడం బీహార్‌లో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో పాట్నా హైకోర్టు రాజ్ బల్లాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ బీహార్ ప్రభుత్వం సుప్రింకోర్టును ఆశ్రయించింది. దీని విచారణ శనివారం జరగనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఆర్జేడీలోని శక్తిమంతమైన నాయకుల్లో ఒకరైన రాజ్ బల్లబ్ యాదవ్ పదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ మహిళ ద్వారా ఆ అమ్మాయిని అటకాయించి ఈ దారుణానికి దిగాడు. కాగా ఆర్జేడీ ఇప్పటికే రాజ్ బల్లబ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే.. శుక్రవారం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో రాజ్ బల్లబ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
సమీక‘ రణం’
పోర్టు, కారిడార్ నోటిఫికేషన్‌పై బందరు రైతుల ఆందోళన ఇప్పటికే భూముల క్రయ విక్రయాలు లేక ఇక్కట్లు మూడేళ్లలో లక్ష ఎకరాలు సమీకరిస్తారనే అనుమానాలు సర్కారు వైఖరిపై ప్రత్యక్ష పోరాటానికి సన్నాహాలు టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన భూ సమీకరణ నోటిఫికేషన్‌పై బందరు మండల రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకులు రోడ్డున పడవేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆందోళన చెందుతున్నారు. ఎంఏడీఏ కింద లక్ష ఎకరాలకు పైగా సమీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం తొలివిడతలో భాగంగా 33 వేల ఎకరాలను లాక్కునే కుట్రకు తెరతీసిందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పన్నాగాన్ని ప్రత్యక్ష, న్యాయ పోరాటాల ద్వారానే ఎదుర్కొంటామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు వదులుకొనేది లేదని తేల్చి చెబుతున్నారు. మచిలీపట్నం : తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ ప్రక్రియ రైతులను నట్టేట ముంచేలా ఉంది. ఈ ఏడాది జూలైలో జరిగిన కేబినెట్ సమావేశంలో మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (ఎంఏడీఏ)కి 1.05 లక్షల ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించారు. దీనిపై రైతులకు ఇచ్చే ప్యాకేజీ వివరాలను జీవో నెంబరు 185లో పొందుపరిచారు. మచిలీపట్నం మండలంలో 27 , పెడన మండలంలో ఒకటి కలిపి మొత్తం 28 రెవెన్యూ గ్రామాల్లో 1.05 లక్షల ఎకరాల భూమి ఉందని, బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ ఇతర పరిశ్రమలు నిర్మించనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. 1.05 లక్షల ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆ తరువాత 1.05 లక్షలు కాదు, 14 వేల ఎకరాలు మాత్రమే సమీకరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు పొంతన లేని ప్రకటనలు చేశారు. ఇది తొలివిడతలో భాగమా.. తాజాగా ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి 33,327 ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ మేరకు 28 గ్రామాల పరిధిలో 14,600 ఎకరాల పట్టాభూమి, 8,900 ఎకరాల అసైన్డ్భూమి, 9,700 ఎకరాలకు పైగా ప్రభుత్వభూమి ఉంది. అయితే జూలైలో జరిగిన కేబినెట్ సమావేశంలో 1.05 లక్షల ఎకరాల భూమిని సమీకరిస్తామని ప్రకటించడంతో ఈ 33 వేల ఎకరాలు తొలివిడతలో భాగంగా సమీకరిస్తున్నారా అనే భయం రైతుల్లో నెలకొంది. టీడీపీ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల కాలపరిమితి ఉండడంతో ఏడాదికి 33 వేల ఎకరాల చొప్పున భూమిని సమీకరిస్తారనే అనుమానాలు రైతులను వెంటాడుతున్నాయి. బందరు మండలంలోని మొత్తం భూమిని ప్రభుత్వం కాజేసి రైతులను ఇక్కడి నుంచి సాగనంపే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక భూసమీకరణ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఏడాదిగా ఇబ్బందులే : 2015 ఆగస్టు 29న 30వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి నుంచి బందరు మండలంలోని భూములకు బ్యాంకులు పంట రుణాలను నిలిపివేశాయి. రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీని వెనుక పాలకుల కుట్ర దాగివుందనే అనుమానాలు లేకపోలేదు. తిరిగి భూసేకరణ నోటిఫికేషన్ గడువు ఏడాది పాటు పెంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఎంఏడీఏను ఏర్పాటు చేశారు. జూలై 23న రైతులకు ఇచ్చే ప్యాకేజీ వివరాలను జీవో నెంబరు 185 ప్రభుత్వం వెల్లడించింది. అనంతరం టీడీపీ నాయకుల అనుచరులు 400 ఎకరాలకు పైగా భూములను ఎకరం రూ. 25 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్లు సమాచారం. తాజాగా భూసమీకరణ నోటిఫికేషన్ జారీ కావడంతో టీడీపీ నాయకులు కొనుగోలు చేసిన భూములను ఎంఏడీఏకు ఇస్తామని లేఖలు ఇప్పించే పనిలో అధికార పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష పోరాటమే : ప్రభుత్వం భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేసినా రైతుల అంగీకారం లేకుండా సెంటు భూమి కూడా తీసుకోవడానికి వీలు లేని పరిస్థితి. రాజధాని అమరావతిలో భూమిని సమీకరించి నోటిఫికేషన్ జారీ చేయగా, మచిలీపట్నంలో భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత భూమిని సమీకరించనున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది సర్వే నెంబర్ల ఆధారంగా రైతుల అభిప్రాయ సేకరించాలి. అంగీకార పత్రాలు తీసుకోవాలి.అయితే భూములు వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమని, ఓ వైపు ప్రత్యక్ష పోరాటం చేస్తూనే, మరో వైపు న్యాయపరంగా పోరాటం చేస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు. -
ఐసిస్ హెచ్చరికలకు నేను భయపడను
-
భయం వీడితేనే జయం
ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి విద్యార్థులు పరీక్షలకున్న సమయాన్ని బట్టి ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఎక్కువ మార్కులు సాధించాలనే తపనతో అదే పనిగా చదవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత చది వామని కాకుండా చదివింది ఎంత గుర్తుంచుకున్నామన్నది ముఖ్యం. చదివిన అంశాలు కనీసం ఒక్కసారైనా చూడకుండా రాయడం మంచిది. చదివిన అంశాలను పునశ్చరణ చేయడం కూడా ఎంతో ప్రధానం. ముఖ్యంగా రాత్రి వేళల్లో 10.30 కల్లా చదవడం ముగించి వేకువ జామున ఎక్కువ సమయం చదువుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది. విద్యార్థులకు కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఎక్కు సమయం కేటాయించాలి. వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రోజూ ప్రతి సబ్జెక్టుకు కనీసం గంట తక్కువ కాకుండా టైమ్ టేబుల్ తయారు చేసుకొని తదనుగుణంగా సాధన చేయాలి. - హరిశ్చంద్ర, జిల్లా ఉప విద్యాధికారి టీవీలు, సినిమాలకు దూరంగా ఉంచాలి పరీక్షల సమయంలో పిల్లలను సాధ్యమైనంత వరకు టీవీలు, సినిమాలకు దూరంగా ఉంచాలి. వీటి వ్యాపకంతో విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించే వీలుండదు. తల్లిదండ్రులు ఇంటి వద్ద విద్యార్థులకు సరైన గెడైన్స్ ఇచ్చి కష్టపడి చదివేలా ప్రోత్సహించాలి. పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగులైతే ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని చదివించాలి. పరీక్షల సమయంలో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయడం ఏ మాత్రం మంచిది కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఒత్తిడికి గురి చేస్తే విద్యార్థుల మానసిక సంఘర్షణకు గురయ్యే ప్రమాదముంది. - ఝాన్సీరాణి, ప్రధానోపాధ్యాయురాలు, బాలికల ఉన్నత పాఠశాల, ఆహార నియమాలు, నిద్ర, వ్యాయామం తప్పనిసరి పరీక్షల సమయంలో ఆరోగ్య పరిరక్షణకు ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. పాలు తాగడం, సీజనల్ పండ్లు తినడం, జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి. అల్పాహారంగా ప్రొటీన్, కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినడం మంచిది. ఇడ్లి, దోశ, ఉప్మా వంటివి తీసుకోవచ్చు. చాక్లెట్లు, బిస్కెట్ల వంటివి తినడం మానేసి వాటి స్థానంలో ఎండిన పండ్లు, ఖర్జూర, బాదం, వాల్న ట్స్ వంటివి తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల మానసిక ఉపశమనం కలుగుతుంది. ఆరెంజ్, దానిమ్మ, ఆపిల్ లాంటి పండ్లను ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. పరీక్షలకు సిద్ధమయ్యే, రాయబోయే విద్యార్థులందరికీ చదువెంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాబట్టి రోజుకు కనీసం ఐదారు గంటలైనా తప్పనిసరిగా నిద్ర అవసరం. - ప్రసాద్‌కుమార్, వైద్యాధికారి, దోమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్యం ప్రధానం చాలామంది విద్యార్థులు ఆరంభం నుంచి చదువును అశ్రద్ధ చేసి ఆటపాటలతో గడిపి తీరా పరీక్షలు దగ్గరకొచ్చాక నానా హడావుడీ పడుతుంటారు. రాత్రంతా గంటల తరబడి మేల్కొని చదివేస్తుంటారు. దీంతో వారిపై ఒత్తిడి అధికమవుతుంది. ఈ కారణంగా అనారోగ్యానికి గురయ్యే వీలుంది. ఇది మొదటికే మోసం తెస్తుంది. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. నీటిని ఎక్కువగా తాగడం, తగిన మోతాదులో ఆహారం తీసుకోవడం, చదువు మధ్యలో విరామం తీసుకొని సంగీతం వినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తే శరీరంపై ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. - ప్రకాష్‌రావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈ జాగ్రత్తలు ఎంతో అవసరం పరీక్షల సమయంలో రోజుల తరబడి నిల్వ ఉంచిన పదార్థాలు, నూనె పదార్థాలు, జీర్ణ సంబంధ సమస్యలు కలిగించే ఆహార పదార్థాలు తీసుకోరాదు. టీవీలు, సినిమాలు చూడడం కన్నా చదువు మధ్యలో స్నేహితులతో కాసేపు సరదాగా గడపడం, కబుర్లు చెప్పుకోవడం మంచిది. అనవసరమైన, చదువుకు నష్టం కలిగించే వ్యాపకాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. {పస్తుతం గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా అన్ని చోట్లా విద్యుత్ కోతలు విపరీతంగా ఉండే అవకాశం ఉండడంతో విద్యార్థులు చదువుకు ఆటంకం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.