శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సన్నద్ధమవుతున్నారు. వీరితో పాటు లంకతో వన్డేలకు ఎంపికైన కుల్దీప్, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్‌లు ఇప్పటికే కొలంబో చేరుకొని సోమవారం నుంచి నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. గత నెల వెస్టిండీస్ గడ్డపై భారత్ రెండో టీ20 ప్రపంచకప్ గెలిచిన రోజే భారత స్టార్లు రోహిత్, కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు.
ఇప్పుడు మళ్లీ.. దాదాపు నెలరోజుల తర్వాత అంతర్జాతీయ వన్డేలు ఆడేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కొలంబోలో అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ట్రెయినింగ్‌లో వీళ్లంతా ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. తాజాగా.. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి.
కోహ్లితో చర్చ
రోహిత్- కోహ్లి కలిసి నెట్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. గంభీర్ దగ్గరుండి వీక్షించాడు. ఈ క్రమంలో కోహ్లితో చాలా సేపు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్ ముగిసిన నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్ వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ దిగ్గజాలతో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సహా మిగిలిన ఆటగాళ్ల సన్నద్ధతపై కూడా ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
కాగా జూలై 27, 28, 30 తేదీల్లో పల్లెకెలె వేదికగా టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సేన 3-0తో ఆతిథ్య శ్రీలంక జట్టును క్లీన్‌స్వీప్ చేసింది. ఇక ఆగష్టు 2 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. మూడు వన్డేలు(ఆగస్టు 2, 4, 7) కొలంబోలని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతాయి.
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
Great to see two old Delhi teammates connecting over a long chat after a batting session in Colombo. pic.twitter.com/VfjdjANkxa
— Vimal कुमार (@Vimalwa) July 31, 2024
Comments
Please login to add a commentAdd a comment