ముంబై : బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక తెలివైన నటుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నానని మహేశ్ ట్వీట్ చేశారు. కాగా,ఇర్ఫాన్, మహేష్ కలిసి సైనికుడు చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. (చదవండి : ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత)
Deeply saddened by the news of #IrrfanKhan's untimely demise. A brilliant actor gone too soon. He will be truly missed... My heartfelt condolences to his family and loved ones. RIP 🙏🏻
— Mahesh Babu (@urstrulyMahesh) April 29, 2020
‘ఇర్ఫాన్ ఖాన్ మృతి నన్ను షాక్‌కి గురి చేసింది. మా కాలంలోని అసాధారణమైన నటులలో ఆయన ఒకరు. ఆయన సినిమాలు, నటన ఎల్లకాలం గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Shocked to hear of the demise of Irrfan Khan, one of the most exceptional actors of our time. May his work always be remembered and his soul rest in peace
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 29, 2020
‘నేటి తరంలో చెప్పుకోతగ్గ నటుడైన ఇర్ఫాన్ మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది నన్ను షాక్ నకు గురి చేసింది. ఆయన కుటుంబానికి ఈ సమయంలో తట్టుకుని నిలిచే బలాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి" రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు.
‘ఇర్ఫాన్ ఖాన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన మరణవార్త విని చలించిపోయాను. ఆయన కుటుంబీకులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను... ఓమ్ శాంతి’ అని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ ట్వీట్ చేశారు.
నా ప్రియమైన స్నేహితుడు ఇర్ఫాన్. మీరు పోరాడారు, పోరాడారు, పోరాడారు. నేను మీ గురించి ఎప్పుడూ గర్వపడతాను .. మళ్ళీ మనం కలుద్దాం .. సుతాపా మరియు బాబిల్ కు సంతాపం .. మీరు కూడా పోరాడారు, సుతాపా మీరు ఈ పోరాటంలో సాధ్యమైనవన్నీ ఇచ్చారు. శాంతి మరియు ఓం శాంతి. ఇర్ఫాన్ ఖాన్‌కి వందనం’అని ప్రముఖ డైరెక్టర్, నిర్మాత సూజిత్ సర్కార్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment