బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ భౌతికంగా దూరమైనా, ఆయన పోషించిన పాత్రలు ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నాయి. ఇర్ఫాన్ నటించిన అపురూపమైన చిత్రం పీకూ. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ లతో కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. పీకూ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా ఐదేళ్లవుతుంది. ఈ సందర్భంగా ఇర్ఫాన్‌తో ఉన్న మధుర స్మృతులను దీపిక సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇర్ఫాన్.. అద్భుతమైన వ్యక్తి. నాకెంతో ఇష్టమైన వ్యక్తి అంటూ పోస్ట్ చేశారు. దీపికా పదుకొణె నటించిన మొదటి హాలీవుడ్ చిత్రానికి సంబంధించి ఓ వేడుకలో ఇర్ఫాన్, దీపిక హాజరైన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వి మిస్ యూ ఇర్ఫాన్ అంటూ పలువురు ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు. క్యాన్సర్‌తో ఏప్రిల్ 29న ఇర్ఫాన్‌ఖాన్ తుది శ్వాస విడిచారు. (మనిషిగా పుట్టడం వరం.. శాశ్వతం కాదు! )
నాకెంతో ఇష్టమైన వ్యక్తి ఆయన: దీపికా పదుకొణె
Published Fri, May 8 2020 10:33 AM | Last Updated on Fri, May 8 2020 11:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment