piku film
-
పీకు రీమేక్‌లో టాప్ హీరోయిన్?
దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, ఇర్ఫాన్ ఖాన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘పీకు’. సూజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామాకు విశేషమైన ఆదరణ లభించింది. 2015లో ఈ సినిమా విడుదలైంది. విడుదలైన ఐదేళ్లకు ఈ సినిమా సౌత్‌లో రీమేక్ కాబోతోందని సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రం రీమేక్ హక్కులను తీసుకుందట. హిందీలో దీపికా చేసిన పాత్రను ఈ రీమేక్‌లో త్రిష చేస్తారని టాక్. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. చర్చల దశలోనే ఉన్న ఈ రీమేక్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మలయాళంలో మోహన్‌లాల్‌తో ‘రామ్’, మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వమ్’ సినిమాల్లో నటిస్తున్నారు త్రిష. -
నాకెంతో ఇష్టమైన వ్యక్తి ఆయన: దీపిక
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ భౌతికంగా దూరమైనా, ఆయన పోషించిన పాత్రలు ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నాయి. ఇర్ఫాన్ నటించిన అపురూపమైన చిత్రం పీకూ. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ లతో కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. పీకూ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా ఐదేళ్లవుతుంది. ఈ సందర్భంగా ఇర్ఫాన్‌తో ఉన్న మధుర స్మృతులను దీపిక సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇర్ఫాన్.. అద్భుతమైన వ్యక్తి. నాకెంతో ఇష్టమైన వ్యక్తి అంటూ పోస్ట్ చేశారు. దీపికా పదుకొణె నటించిన మొదటి హాలీవుడ్ చిత్రానికి సంబంధించి ఓ వేడుకలో ఇర్ఫాన్, దీపిక హాజరైన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వి మిస్ యూ ఇర్ఫాన్ అంటూ పలువురు ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు. క్యాన్సర్‌తో ఏప్రిల్ 29న ఇర్ఫాన్‌ఖాన్ తుది శ్వాస విడిచారు. (మనిషిగా పుట్టడం వరం.. శాశ్వతం కాదు! ) View this post on Instagram Those special moments ❤ #irrfankhan with #deepikapadukone 🎼 @hrithikroshan . . . #viralbhayani @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on May 7, 2020 at 1:14am PDT -
ఎందుకో ఏమో?!
గాసిప్ ఇగో వార్ అనేది బాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. చిన్న చిన్న కారణాలే నటుల మధ్య అగాథాన్ని పెంచిన సందర్భాలూ ఉన్నాయి. వేడి తగ్గాక మళ్లీ ఆప్యాయంగా ఒక్కటైన సందర్భాలూ బాలీవుడ్ చరిత్రలో కనిపిస్తాయి. దీపికా పదుకొనే గురించి బిగ్ బి ప్రశంసాపూర్వకంగా మాట్లాడడం, అమితాబ్ గురించి కదిలిస్తే చాలు...‘ఎంత గొప్ప లెజెండ్ అంటే..’ అని దీపిక నాన్‌స్టాప్‌గా మాట్లాడడం అందరికీ తెలిసిన విషయమే. ‘పీకు’ సినిమా వీరిని మరింత దగ్గర చేసింది. అయితే ఈ సినిమాయే దూరాన్ని కూడా పెంచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపిక, బిగ్ బిలు మాటవరుసకు కూడా పలకరించుకోవడం లేదట. ఇటీవల తన సన్నిహితులకు దీపిక ‘పీకు’ విజయోత్సవ విందు ఇచ్చింది. దీనికి బిగ్ బికి ఆహ్వానం అందకపోవడం ‘ఇద్దరి మధ్య విభేదాలు’ పుకారుకు బలాన్ని ఇస్తున్నాయి. తనకు విందుకు ఆహ్వానం అందలేదని బిగ్ బి స్వయంగా ప్రకటించడం గమనార్హం!