ఎందుకో ఏమో?! | Deepika Padukone has no courage to apologise to Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

ఎందుకో ఏమో?!

Published Fri, Jun 5 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

ఎందుకో ఏమో?!

ఎందుకో ఏమో?!

గాసిప్
ఇగో వార్ అనేది బాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. చిన్న చిన్న కారణాలే నటుల మధ్య అగాథాన్ని పెంచిన సందర్భాలూ ఉన్నాయి. వేడి తగ్గాక మళ్లీ ఆప్యాయంగా ఒక్కటైన సందర్భాలూ బాలీవుడ్ చరిత్రలో కనిపిస్తాయి. దీపికా పదుకొనే గురించి బిగ్ బి ప్రశంసాపూర్వకంగా మాట్లాడడం, అమితాబ్ గురించి కదిలిస్తే చాలు...‘ఎంత గొప్ప లెజెండ్ అంటే..’ అని దీపిక నాన్‌స్టాప్‌గా మాట్లాడడం అందరికీ తెలిసిన విషయమే. ‘పీకు’ సినిమా వీరిని మరింత దగ్గర చేసింది.

అయితే ఈ సినిమాయే దూరాన్ని కూడా పెంచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపిక, బిగ్ బిలు  మాటవరుసకు కూడా పలకరించుకోవడం లేదట. ఇటీవల తన సన్నిహితులకు దీపిక ‘పీకు’ విజయోత్సవ విందు ఇచ్చింది. దీనికి బిగ్ బికి ఆహ్వానం అందకపోవడం ‘ఇద్దరి మధ్య విభేదాలు’ పుకారుకు బలాన్ని ఇస్తున్నాయి. తనకు విందుకు ఆహ్వానం అందలేదని బిగ్ బి స్వయంగా ప్రకటించడం గమనార్హం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement