పీకు రీమేక్‌లో టాప్‌ హీరోయిన్‌? | Trisha in the movie remake of Piku | Sakshi
Sakshi News home page

పీకు రీమేక్‌లో టాప్‌ హీరోయిన్‌?

Nov 28 2020 12:04 AM | Updated on Nov 28 2020 5:24 AM

Trisha in the movie remake of Piku - Sakshi

దీపికా పదుకోన్, అమితాబ్‌ బచ్చన్, ఇర్ఫాన్‌ ఖాన్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘పీకు’. సూజిత్‌ సర్కార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామాకు విశేషమైన ఆదరణ లభించింది. 2015లో ఈ సినిమా విడుదలైంది. విడుదలైన ఐదేళ్లకు ఈ సినిమా సౌత్‌లో రీమేక్‌ కాబోతోందని సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రం రీమేక్‌ హక్కులను తీసుకుందట. హిందీలో దీపికా చేసిన పాత్రను ఈ రీమేక్‌లో త్రిష చేస్తారని టాక్‌. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. చర్చల దశలోనే ఉన్న ఈ రీమేక్‌ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మలయాళంలో మోహన్‌లాల్‌తో ‘రామ్‌’, మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వమ్‌’ సినిమాల్లో నటిస్తున్నారు త్రిష.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement