బాలీవుడ్‌ నటుడిపై కేసు నమోదు | FIR Filed Against Actor Kamal R Khan | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ నటుడిపై కేసు నమోదు

Published Fri, May 22 2020 11:41 AM | Last Updated on Fri, May 22 2020 11:46 AM

FIR Filed Against Actor Kamal R Khan - Sakshi

ముంబై : బాలీవుడు నటుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మృతిచెందిన బాలీవుడ్‌ దిగ్గజ నటులు రిషీ కపూర్‌, ఇర్ఫాన్‌ ఖాన్లను అవమానించే రీతిలో సోషల్‌ మీడియాలో కామెంట్లు చేశారనే ఫిర్యాదుతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రిషీ కపూర్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌లపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌పై చర్యలు తీసుకోవాలని యువసేన కోర్‌ కమిటీ మెంబర్‌ రాహుల్‌ కనాల్‌ బాంద్రా సబ్‌అర్బన్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. 

రిషీ కపూర్‌ హాస్పిటల్‌ చేరిన రోజున.. ‘త్వరలోనే వైన్‌ షాప్‌లు తెరుచుకోనున్నాయి.. అప్పటివరకు ఆయన మరణించకూడదు’ అని కమల్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు ఇర్ఫాన్‌ ఖాన్‌ను కూడా అవమానపరిచేలా కమల్‌ వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఓ సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ..‘ ఇటీవ మరణించిన ఇద్దరు బాలీవుడ్‌ నటులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కమల్‌ ఆర్‌ ఖాన్‌పై సెక్షన్‌ 294 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది’ అని తెలిపారు.(చదవండి : నా భర్త ఎంత హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడో కదా??)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement