సూపర్ స్టార్లతో ఏలేటి సాహసం | Chandrashekar Yeleti ropes in mohanlal, shivarajkumar for next film | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్లతో ఏలేటి సాహసం

Published Thu, Oct 29 2015 9:56 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

Chandrashekar Yeleti ropes in mohanlal, shivarajkumar for next film

రెగ్యులర్ కమర్షియల్ జానర్కు భిన్నంగా కొత్త తరహా సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలను తీస్తూ వస్తున్న ఈ డైరెక్టర్, ఇంతవరకు ఒక్క భారీ కమర్షియల్ సక్సెస్ కూడా అందుకోలేకపోయినా, దర్శకుడిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. సాహసం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న చంద్రశేఖర్ ఏలేటి ప్రస్తుతం ఓ మల్టీ లింగ్యువల్ సినిమాకు రెడీ అవుతున్నాడు.

వారాహి చలనచిత్ర బ్యానర్పై సాయి కొరపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్రోల్లో నటిస్తుండగా చాలాకాలం తరువాత గౌతమి హీరోయిన్గా నటిస్తుంది. తెలుగు, తమిళ్తో పాటు ఈ సినిమాను కన్నడలో కూడా తెరకెక్కించాలని భావిస్తున్న ఏలేటి, కన్నడ వర్షన్లో హీరోగా సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ను ఒప్పించాలని ట్రై చేస్తున్నాడు. బాలీవుడ్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్ ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement