ఇర్ఫాన్ ఖాన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, ముంబయి : ముందు చెప్పినట్లుగానే ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తన వ్యాధి గురించి బయటపెట్టారు. తనకు నాడీ సంబంధమైన అంత:స్రావి గ్రంధిలో ట్యూమర్ (న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్) ఉందని, ఇది అత్యంత అరుదైనదని పేర్కొన్నారు. దీనికోసం తాను విదేశాల్లో వైద్యానికి వెళుతున్నట్లు కూడా చెప్పారు. ఇర్ఫాన్ ఖాన్ తన అధికారిక ట్విటర్ పేజీలో ఈ మేరకు పోస్ట్ చేశారు. అత్యంత అరుదైన వ్యాధితో ఇర్ఫాన్ బాధపడుతున్నారని, అదొక క్యాన్సర్ అంటూ విపరీతమైన ఊహాగానాలతో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో న్యూరో అంటే బ్రెయిన్‌కు సంబంధించినది మాత్రమే ఉండబోదని తెలిపారు. అంతకుముందు ఇదే నెల (మార్చి) 5న సోషల్ మీడియా ద్వారానే ఇర్ఫాన్ తనకు అరుదైన వ్యాధి ఉందని, దీనిపై అందరూ వేరే ప్రచారం చేయొద్దని, ఆ వ్యాధి ఏమిటనే వివరాలు పది రోజుల్లో వెల్లడిస్తానని చెప్పారు. అన్న ప్రకారమే ఆయన నేడు తన ట్విటర్ ఖాతా ద్వారా తనకు న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ అనే వ్యాధి ఉందని తెలిపారు.
‘మనం ఊహించినదేది జీవితం మనకు ఇవ్వదు’ అంటూ మార్గరెట్ మిచెల్ చెప్పిన కొటేషన్‌ను చెబుతూ..
‘ఒక్కోసారి మనం ఊహించనిది మనల్ని పెద్ద వాళ్లను చేస్తుంది. నాకు న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ ఉందని తెలుసుకున్నప్పుడు అంగీకరించేందుకు కష్టంగా అనిపించింది. భరించలేకపోయాను. కానీ, నా చుట్టూ ఉన్న వారి ప్రేమ, బలం నన్ను కొత్త ఆశలోకి తీసుకొచ్చాయి. ఈ ప్రయాణం నన్ను దేశం వెలుపలికి తీసుకెళుతోంది. మీ అందరి దీవెనలు నాకు పంపిస్తునే ఉండండి. నా మాటలకోసం ఎదురుచూసేవారందరికి మరిన్ని విషయాలు చెప్పేందుకు తిరిగొస్తానని ఆశిస్తున్నాను’
-- ఇర్ఫాన్
న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ అంటే ఏమిటీ?
ఈ నాడీకి సంబంధమైన కణితి (ట్యూమర్) వేగంగా లేదా నెమ్మదిగా లేదా ఊహించని విధంగా పెరగొచ్చు. శరీరంలోని ఇతర భాగాలకు కూడా పాకొచ్చు. చాలామందికి దీని లక్షణాలు అంత త్వరగా తెలియవు గుర్తించలేరు. ఏదైన సంఘటన జరిగి దాని ద్వారా పరీక్షలు చేస్తే బయటపడుతుంది. చర్మం కందిపోయినట్లుగా కనిపించడం, లేదా రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోవడం జరుగుతాయి. ఇక వైద్యం అనేది కణితి తీవ్రతను బట్టి ఉంటుంది. రేడియేషన్ లేదా కీమోథెరపీ ద్వారా మాత్రమే చికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది.
— Irrfan (@irrfank) March 16, 2018
Comments
Please login to add a commentAdd a comment