ఐఫా అవార్డులు-2018 | IIFA 2018 Bollywood Full Winners List | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 25 2018 8:35 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

IIFA 2018 Bollywood Full Winners List - Sakshi

ప్రతిష్టాత్మక ఐఫా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. గత రాత్రి(ఆదివారం) బ్యాంకాక్‌లో జరిగిన 19వ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డుల(ఐఫా) కార్యక్రమంలో బాలీవుడ్‌ సెలబ్రిటీలు సందడి చేశారు.  తుమ్హారి సులు చిత్రం అత్యధికంగా ఆరు కేటగిరీల్లో నామినేట్‌ కాగా, ఐదు అవార్డులతో తర్వాతి స్థానంలో రాజ్‌కుమార్‌ రావ్‌ నటించిన న్యూటన్‌ నామినేట్‌ అయ్యింది. పెద్ద చిత్రాలేవీ అవార్డులను కొల్లగొట్టకపోగా.. చిన్న చిత్రాలు సత్తా చాటాయి. అవార్డుల విషయానికొస్తే... ఉత్తమ చిత్రంగా తుమ్హారి సులు, ఉత్తమ దర్శకుడిగా సాకేత్‌ చౌదరి(హిందీ మీడియం), ఉత్తమ నటిగా మామ్‌ చిత్రానికి గానూ దివంగత నటి శ్రీదేవి(భర్త బోనీకపూర్‌ అందుకున్నారు), ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్‌ ఖాన్‌(హిందీ మీడియం) అవార్డులు దక్కించుకున్నారు. 

అవార్డుల పూర్తి జాబితా...
ఉత్తమ చిత్రం- తుమ్హారి సులు
ఉత్తమ దర్శకుడు- సాకేత్‌ చౌదరి(హిందీ మీడియం)
ఉత్తమ నటుడు- ఇర్ఫాన్‌ ఖాన్‌ (హిందీ మీడియం)
ఉత్తమ నటి-శ్రీదేవి(మామ్)
ఉత్తమ సహయ నటుడు-నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (మామ్‌)
ఉత్తమ సహయ నటి-మెహర్‌ వీఐజే (సీక్రెట్‌ సూపర్‌స్టార్‌)
ఉత్తమ కథ- న్యూటన్‌ చిత్రం(అమిత్‌ వీ మసూర్‌కర్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు -అమాల్‌ మాలిక్‌, తనిష్క్‌ బాగ్చి, అఖిల్‌ సచ్‌దేవ-బద్రీనాథ్‌ కీ దుల్హానియా
బెస్ట్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ -ప్రీతమ్‌ (జగ్గా జసూస్‌ చిత్రానికి)
బెస్ట్‌ స్క్రీన్‌ ప్లే -నితీశ్‌ తివారీ, శ్రేయస్‌ జైన్‌ (బరేలీ కీ బర్ఫీ)
ఉత్తమ కొరియోగ్రఫీ-విజయ్‌ గంగూలీ, రూలె దౌసన్‌ వరిందని (జగ్గా జసూస్‌ చిత్రంలోని గల్తీ సే మిస్టేక్‌ పాటకు)
ఉత్తమ డైలాగులు-హితేష్‌ కేవల్య(సుభ మంగళ్‌ సావధాన్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ-మార్కిన్‌ లస్కవైక్‌, యూఎస్‌సీ(టైగర్‌ జిందా హై చిత్రానికి గానూ...)
ఉత్తమ ఎడిటింగ్‌- శ్వేత వెంకట్‌ మాథ్యూ (న్యూటన్‌)
ఉత్తమ సింగర్‌(మహిళా)- మేఘనా మిశ్రా(సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ చిత్రంలోని మైన్‌ కౌన్‌ హూ పాటకు)
ఉత్తమ సాహిత్యం - మనోజ్‌ ముంటషిర్‌ (బాద్‌షావో చిత్రంలోని మెరే రష్కే ఖమర్‌ పాటకు...)
ఉత్తమ సింగర్‌ (మేల్‌)- అర్జిత్‌ సింగ్‌( జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌ చిత్రంలోని హవాయెన్‌ పాటకు)
ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌ - కోంకణ్‌ సేన్‌ శర్మ
అవుట్‌స్టాండింగ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు- సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌

ఉత్తమ స్టైల్‌ ఐకాన్‌- నటి కృతి సనన్‌
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డు - ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలా (ప్రసాద్‌ వసంత్‌ సుటార్‌ -జగ్గా జసూస్‌ చిత్రం)
ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ - దిలీప్‌ సుబ్రమణియమ్‌-గణేశ్‌ గంగాధరన్‌(వైఆర్‌ఎఫ్‌ స్టూడియోస్‌).. టైగర్‌ జిందా హై చిత్రం


ఇక ఈవెంట్‌ మధ్యలో రణ్‌బీర్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, శ్రద్ధా కపూర్‌, లూలియా వంటూర్‌, కృతి సనన్‌, బాబీ డియోల్‌, అర్జున్‌ కపూర్‌ తమ ఫెర్‌ఫార్మెన్స్‌తో ఆహతులను ఆకట్టుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సీనియర్‌ నటి రేఖ  స్టేజీపై నృత్య ప్రదర్శన ఇవ్వటం కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement