ఏ మంచి పని చేసినా దానిని వక్రీకరించి మాట్లాడటం ఇటీవల చాలా మందికి అలవాటైపో యింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టనున్నట్లు ఆం్ర«ధ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటిం చగానే ఏదో అన్యాయం జరిగిపోయినట్లు శోకాలు పెట్టడం వక్ర బుద్ధి అనిపి స్తుంది తప్ప, భాషాభిమానం అనిపించుకోదు. వ్యవహార భాష తెలుగుకు, మాధ్యమంగా తెలు గుకు, రెండవ భాషగా చదివే తెలుగుకు, ఇతర సబ్జెక్టుల మాదిరిగా చదివే ఆప్షనల్ తెలుగుకు తేడా తెలియని అజ్ఞానులను... తెలిసీ తెలియనట్లు మాట్లాడుతూ, తెలుగు భాషకు వీరాభిమానులుగా చెప్పుకుని ఇంగ్లిష్ మీడియం అనగానే వీరంగం వేసే వెర్రివాళ్లను చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది.
భాషాభిమానం ఉన్న వాళ్లు భాష కోసం తాము చేసిన ఘనకార్యం ఏమిటో చెప్పి, ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఈ భాషాభిమానులంతా తెలుగు యూనివర్సిటీ విభజన గురించి, ప్రాచీన భాషా తెలుగు హోదా అమలు గురించి ఏ ప్రయత్నం చేశారో? ఈ వీరాభిమానం అప్పుడు ఎందుకు పొంగి ప్రవహించలేదో అర్థం కావట్లేదు. మాతృభాష తెలుగుకు విద్యావ్యవస్థలోని తెలుగుకు సంబంధం లేదు. మాతృభాషను ఉద్ధ రించే మార్గాలెన్నో ఉన్నాయి. అందుకు తెలుగు... మీడియంగా ఉండి తీరాల్సిన అవసరం లేదు. ఇంగ్లిష్ మీడియం వల్ల తెలుగు భాషకు కలిగే అపకారం ఏమీ లేదు. ప్రస్తుతం జ్ఞాన వాహిని ప్రపంచీకరణ దిశగా సాగుతోంది.
ఆ ప్రవాహాన్ని తట్టుకోవాలంటే ఆ వాహినికి వాహకమైన భాషనే వాడుకోవాలి. అప్పుడు విద్యావంతులంతా ప్రపం చవ్యాప్తంగా ఉన్న జ్ఞానాన్ని పొందినవారవుతారు. అందుకే ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ప్రశంసించదగినది. ధనవంతులు లక్షల కొలది ఫీజులు కట్టి ఇంగ్లిష్ మీడియంలో చదువు తున్నారు. వాళ్లకు భాషాభిమానం లేకపోయినా ఫర్వాలేదా? వాళ్లు విదేశాలకెళ్లి ఉన్నతంగా జీవిస్తున్నారని గొప్పగా తెలుగు తేజాలని చెప్పుకుంటే సరిపో తుందా? అలాంటి ఉన్నత స్థితిని పేద పిల్లలు కూడా సాధించాలనుకోవడం పాలకుల ఉన్నతాశయం కాదా? దీనికి భాషాభిమానం పేరుతో గగ్గోలు పెట్టాలా? తమ పిల్లలను గొప్ప వాళ్లుగా చేయా లనుకున్న పేద తల్లిదండ్రుల ఆశలు ఫీజులు కట్టలేని కారణంగా అడియాసలుగానే మిగిలిపోవాలా?
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ఆశయంతో పేద పిల్లలు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో, పట్టణాలలో కోచింగ్‌లు పెట్టించుకో లేని, గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల కోసం ఆర్‌జియూకేటీ యూనివర్సిటీని స్థాపించారు. అందులో ఇంటర్మీడియట్ వరకు తెలు గును తప్పనిసరిగా చదవవలసిన సబ్జెక్టుగా పెట్టిం చారు. ఇంజనీరింగులో కూడా తెలుగును ఒక సబ్జె క్టుగా చదివించారు. సాంకేతిక నిపుణులకు భాషా నైపుణ్యం, అందులోనూ విద్యార్థులకు మాతృ భాషలో నైపుణ్యం ఉంటే మంచిదని భావించి తెలుగును ఇంజనీరింగులోనూ చేర్చి భాషాపరంగా పరిశోధనలు, సాంకేతికంగా తెలుగును ఉపయోగిం చడం, మన సాహిత్యం– సంస్కృతి పట్ల మంచిపట్టు కల్పించారు.
వైఎస్సార్ తెలుగుకు ప్రాచీన భాషా హోదాను సాధించారు. మాతృభాషలో అందరినీ ‘అక్క, అన్న, అమ్మ, అవ్వ, తాత’ అని ఆత్మీయంగా పలకరించే వైఎస్ జగన్‌కి మాతృభాష మీద మమకారంతోపాటు పట్టు కూడా ఉంది. అలాగే ఆంగ్లంలోనూ చక్కటి వాగ్ధాటి ఉంది. ఆంగ్ల మాధ్యమం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్న వ్యక్తి ఆయన. పేదపిల్లలు ఉన్నత విద్యావంతులై ప్రపంచవ్యాప్తంగా గొప్ప స్థితిలో ఉండాలనే సదుద్దేశంతో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవే శపెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనిని ప్రతి ఒక్కరూ హర్షించాలి.
ఈ నిర్ణయం తీసుకున్న నాయకుడిని అభినందించాలి, అంతేగాని ఆంగ్ల మాధ్యమం అనగానే తెలుగుకు ఏదో అన్యాయం జరిగినట్లు గగ్గోలు పెట్టడం విజ్ఞత కాదు. తెలుగును ఇంటర్మీడియట్ వరకు తప్పని సరి చేశారు కాబట్టి ముఖ్యమంత్రి తెలుగు భాషకు ప్రాధాన్యం ఇచ్చినట్లే కదా! తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నంలో ప్రాచీన భాషా హోదా ఉపయోగ పడుతుంది. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగు తున్నాయి. అదే జరిగితే వైఎస్ జగన్ పాలనలో పాడిపంటలతోపాటు, భాషాసాహితీ సంస్కృతీ వికాసాలతో శ్రీకృష్ణదేవరాయల స్వర్ణయుగాన్ని తలపింపచేస్తుందనడంలో సందేహం లేదు.
కె. కుసుమారెడ్డి
వ్యాసకర్త, తెలుగు ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment