
ఆంగ్లంలో బాగా సుపరిచితమైన రైమ్ ఏదంటే ఎవ్వరైన ఠక్కున్న చెప్పే రైమ్ అది. దీనికి పేరడీగా తెలుగులో ఎన్నో రైమ్‌లు వచ్చాయి కూడా. అయితే ఈ రైమ్‌ని క్లాసికల్ మ్యూజిక్‌లో పాడితే..అస్సలు ఎవ్వరూ అలా ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ శాస్త్రీయ సంగీతంలో పాడితే ఎలాం ఉంటుందో పాడి చూపించాడు ఓ వ్యక్తి. ఈ పాట నిమిషాల్లో వైరల్ కావడమే గాక అశేష ప్రజాధరణ పొందింది. నెటిజన్లు కూడా వావ్ అని కితాబిచ్చేస్తున్నారు.
వివరాల్లోకెళ్తే..ఈ వీడియోని భారతీయ రైల్వే అకౌంట్స్ సర్వీస్(ఐఆర్‌ఏఎస్) అధికారి అనంత్ రూపనగుడి నెట్టింట షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి హార్మోనియం వాయిస్తుండగా మరొక వ్యక్తి తబల వాయిస్తూ కనిపించారు. మధ్యలో కూర్చొన్న వ్యక్తి హిందూస్తానీ సంగీతంలో ఆంగ్ల రైమ్ 'జానీ జానీ యస్ పాపా'ను ఆలపించారు. శాస్త్రీయ సంగీతంలో ఆంగ్ల సాహిత్యాన్ని చాలా శ్రావ్యంగా ఆలపించడం ఆశ్చర్యాన్ని కలిగించడమే గాక అత్యద్భుతంగా ఉంది.
రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. అంతేగాదు ఇలా వందేళ్ల క్రితమే ఆలపించి ఉంటే.. దెబ్బకు బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయేవారు కదా! అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా క్లాసికల్ టచ్‌తో కూడిన ఆ రైమ్‌ని వినేయండి.!
यह अगर 100 साल पहले आता, तो अंग्रेज़ अपना देश खुद छोडकर चले जाते! 😀😛😂 #English #rhymes #Music pic.twitter.com/uolJqbEwde
— Ananth Rupanagudi (@Ananth_IRAS) January 20, 2024
(చదవండి: అతడి ఐదుగురు భార్యలు ఒకేసారి ప్రెగ్నెంట్..వాళ్లందరికీ..: మండిపడుతున్న నెటిజన్లు)