
అ అంటే అమరావతి..ఆ అంటే ఆంగ్లం..!!
'ఇక పై అ అంటే అమరావతి.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని స్థిరపడిపోవాలి..' అని తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అయితే రాధాని అమరావతికి గతేడాది అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంతో పాటు, తాత్కాలిక సచివాలయానికి సీఎం చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకం కూడా ఆంగ్లంలోనే ఉండడం గమనార్హం. తెలుగువారి రాజధానిలో తెలుగుకు పట్టిన గతికి ఇదే నిదర్శనం. దీన్ని బట్టి అ అంటే అమరావతి.. ఆ అంటే ఆంగ్లం అనుకోవాలేమో..!!