గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయులు ఆంగ్లంలోనే మాట్లాడాలని, దీనివల్ల విద్యార్థుల్లో ఈ భాషపై అవగాహన పెరుగుతుందని ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి డా. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు.
ఉపాధ్యాయులకు ప్రవీణ్‌కుమార్ సూచన
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయులు ఆంగ్లంలోనే మాట్లాడాలని, దీనివల్ల విద్యార్థుల్లో ఈ భాషపై అవగాహన పెరుగుతుందని ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి డా. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. రాజేంద్రనగర్‌లోని టీఎస్ ఐపార్డులో ప్రిన్సిపాళ్లకు ఇన్‌సర్వీస్ ట్రైనింగ్‌లో భాగంగా ‘అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లిష్’’పై నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి, ప్రసంగించారు.
ఆంగ్లంలో మాట్లాడటం వల్ల తమ మాతృభాషలకు ఏ విధమైన నష్టం జరగదన్నారు. విద్యార్థులకు ఈ భాషలో నైపుణ్యం పెరిగితే వారిలో ఆత్మవిశ్వా సం పెరుగుతుందని, దాని ద్వారా విద్యలో ఉన్నతస్థానానికి చేరుకునేం దుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొ.కనకదుర్గ, ఎస్టీ గురుకులాల డెరైక్టర్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.