ఇంగ్లిష్... ఆరి దేవుడా!
సాహితీ వ్యాఖ్య
ఇంగ్లిష్‌లో రాస్తున్న ప్రతి భారతీయ రచయితనూ పాశ్చాత్య ప్రపంచం గమనిస్తూ ఇతనేనేమో సరైన ప్రతినిధి ఇతనేనేమో భారతీయ సాహిత్యానికి కచ్చితమైన ప్రతినిధి అని బేరీజు వేస్తోంది. దురదృష్టం ఏమిటంటే అలాంటి ఒక్క రచయితా లేకపోవడం. ఆఖరుకు మనం నాసిరకం విషయాలను రాసే చేతన్ భగత్ లాంటివాళ్లను సృష్టించుకున్నాం. ఇంగ్లిష్‌లో రాసే నాలాంటి వాళ్లతో సహా ఏమి రాస్తాం అనేది కాకుండా ‘ఏది వారికి పనికొస్తుంది’ అనే రంధిలో పడ్డాం.
ఫలితంగా మేము ఏమి రాసినా అందులో నిజాయితీ, నిజమైన భారతీయ ప్రాతినిధ్యం ఉండే అవకాశం లేదు. భారతీయ సాహితీ సమాజం ఇంగ్లిష్ అనే ఒక చక్రబంధంలో ఇరుక్కుని ఉంది. గతంలో రవీంద్రనాథ్ టాగోర్, ప్రేమ్‌చంద్, ఇక్బాల్ వంటి వారు ఒకటి కంటే ఎక్కువ భాషల్లో రాసేవారు. ఇప్పుడు అది ఒక భాషకు పడిపోయింది. ఆ ఒక భాష ఇంగ్లిష్ కావడం విషాదం....
- ఆతిష్ తాసిన్
‘నూన్’ నవలా రచయిత;
జర్నలిస్ట్ తవ్లీన్ సింగ్ కుమారుడు