తెలుగు బాషను వెలిగిద్దాం | love mother language | Sakshi
Sakshi News home page

తెలుగు బాషను వెలిగిద్దాం

Published Mon, Aug 29 2016 12:57 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

తెలుగు బాషను వెలిగిద్దాం

తెలుగు బాషను వెలిగిద్దాం

– ఆంగ్లభాష మోజులో తెలుగు కనుమరుగయ్యే ప్రమాదం
– భావితరాలకు తెలుగు తీయధనాన్ని చాటిచెప్పాలి
– వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తిపంతులు
– నేడు మాతృభాష దినోత్సవం
 
కర్నూలు : రాజ్యాలను రాజులు పాలించే రోజుల్లో వారి సంస్థానాల్లో తెలుగు అమృత భాషగా వర్ధిల్లింది. ఎంతో మహోన్నత స్థాయిని అధిరోహించింది. ఏ భాషలో లేని నుడికారాలు, జాతీయాలు, సామెతలు, సంధులు, సమాసాలు తెలుగు భాష సొంతం. అయితే నేడు ఆంగ్లభాష ఆధిపత్యంలో తెలుగు భాష మత్యు కోరల్లో చిక్కుకొంది. నేటి తరం పిల్లలకు తెలుగు ఒంటబట్టడంలేదు. చాలా మందికి  రాయడం..చదవడం తెలియదు. పది, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో తెలుగు భాషలో వేలాదిగా విద్యార్థులు తప్పిపోవడం బాధకలిగించే విషయం. తల్లిదండ్రులు పరభాష మోజులో మాతభాషపై మమకారం చూపడం లేదు. ఇదే పద్ధతి కొనసాగితే మరో రెండు, మూడు తరాలకు అంతరించి పోయే భాషల జాబితాలో తెలుగు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కవులు, రచయితలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు భాషకు గిడుగు సేవలు ఆమోఘం..
తెలుగునాట భాషా విప్లవానికి గిడుగు రామ్మూర్తి ఆద్యుడు. ఆయన 1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లా పర్వతాల పేటలో వెంకాయమ్మ, వీర్రాజు దపంతులకు జన్మించారు. 1910లో వ్యహారిక భాషోద్యమ సంస్థను స్థాపించి గ్రాంధిక భాషపై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. తెలుగు పత్రిక  స్థాపన ద్వారా ఆధునిక భాషకు పట్టం కట్టారు. ఆంధ్రదేశం నలుచెరుగులా తిరిగి సభలు, సమావేశాలు నిర్వహించి అనర్గళమైన ఉపన్యాసాలతో అందరినీ ఆలోచింప చేశారు. వీరి కషి ఫలితంగానే మద్రాసు ప్రభుత్వం వ్యవహారిక భాషవాద సంఘాన్ని ఏర్పాటు చేసి శిష్ట వ్యవహారికమునకు అనుకూలంగా తీర్మానం చేసింది. దీంతో గిడుగు వారిని అభినవ వాగనుశాసనుడు, వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అని తెలుగు జాతి కీర్తించింది. ఆయన సేవలకు గుర్తుగా ఆయన జయంతి ఆగస్టు –29వతేదీని తెలుగు భాషాదినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. 

ఆంగ్లభాష మోజు.. తెలుగు బేజారు..
నేటి ప్రపంచంలో ఆంగ్లానికి ఉన్న క్రేజీ ఎనలేనిది. దీనిని ఎవరూ కాదనలేరు. ఈ నేపథ్యంలో విశ్వవ్యాప్తంగా ఆంగ్లంపై ప్రజలు మోజు పెంచుకుంటున్నారు.  పిల్లలకు విద్యాభ్యాసాన్ని మాతభాష కాకుండా ఆంగ్లంతో ప్రారంభిస్తున్నారు. పాఠశాలల్లో ఇంగ్లీషుతోపాటు మాతభాషకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా చాలా ప్రయివేట్‌ స్కూళ్ల ఆ పని చేయడం లేదు. గత మార్చిలో జరిగిన పది పరీక్షల్లో నాలుగు వేల మంది, ఇంటర్‌లో మూడు వేల మంది విద్యార్థులు తెలుగు పరీక్షల్లో తప్పిపోవడం ఇందుకు నిదర్శనం. 

తెలుగు తీయధనాన్ని భావితరాలకు అందించాలి..
ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష గొప్పదనం, సంస్కతి, సంప్రదాయాలు, తెలుగు వారి ప్రాభావాన్ని దశదిశలా చాటాల్సిన అసవరం నేటి తరంపై ఉంది. తెలుగు భాష మాధుర్యాన్ని, సంస్కతిని వారసత్వంగా తర్వాతి తరాల వారికి అందించేందుకు నేటి కవులు, కళాకారులు, రచయితలు, యువత నడుం బిగించాలి. లేదంటే భాష పరిశోధకుల సర్వే ప్రకారం అంతరిస్తున్న భాషల్లో తెలుగు కూడా చేరుతుంది. అదే జరిగితే  ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌గా, దేశ భాషలందు లñ స్సగా పిలువబడిన తెలుగు భాష అన్యాయం చేసినట్టే.

ప్రభుత్వ శాఖల్లో తెలుగును పటిష్టంగా అమలు చేయాలి
తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలి. ప్రతి విభాగంలోనూ, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ తెలుగు భాషను పటిష్టంగా అమలు చేయాలి. ముఖ్యంగా పాఠశాలల్లో ఇంగ్లీషుతోపాటు తెలుగు బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. 
 
భాషను కాపాడుకుందాం: మద్దిలేటి, తెలుగు భాషోపాధ్యాయుడు, వెల్దుర్తి
 ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే లె లుగు భాష భవిష్యత్‌ అంధకారమవుతుంది. ప్రతి ప్రభుత్వ శాఖలోనూ జీఓలు, ఇతర వ్యహారాలను విధిగా తెలుగులో ప్రచురించాలి. ప్రయివేట్, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. 

ఎందరో మహానుభావులు ఆదరించిన భాష: సురేష్‌బాబు, ఆధునిక తెలుగు కవి
పాశ్చాత్యులు సైతం తెలుగును ఆదరించారు. సీపీ బ్రౌన్‌ అనే ఆంగ్లేయుడు తెలుగు కవిత్వానికి ముగ్ధుడై ఆంగ్లంలోకి అనువదించాడు. అలాంటి భాషను మన పాలకులు ఆదరించకపోవడం దురదష్టకరం. తమిళల తరహాలో తెలుగు భాషను మన రాష్ట్రంలో అమలు చేయాలి. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement