తమ తల్లిదండ్రుల పెళ్లిళ్ల గురించి రాసిన ఇద్దరు రచయితల గురించి మాత్రమే నాకు ఇటీవలి వరకూ తెలుసు. ఒకరు నిగెల్ నికల్సన్. ఈయన రాసిన ‘పోర్‌ట్రెయిట్ ఆఫ్ ఎ మ్యారేజ్’ పుస్తకం తన తండ్రి, రచయిత అయిన వీటా శాక్ విల్లే–వెస్ట్, హెరాల్డ్ నికల్సన్ మధ్య అస్థిరమైన, విశిష్టమైన సంబంధం గురించి చెబుతుంది.
మరొకటి జరీర్ మసానీ రాసిన ‘అండ్ ఆల్ ఈజ్ సెడ్: మెమోయిర్ ఆఫ్ ఎ హోమ్ డివైడెడ్’ అనే పుస్తకం. శత్రుత్వం, పిచ్చితనం, అవిశ్వాసం వంటి కారణాల వల్ల మినూ మసానీ తన భార్య శకుంతల నుంచి విడిపోయిన ఉదంతాన్ని ఇది తెలుపుతుంది. ఆ రోజుల్లో ఆమె ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ)లో చేరాలని భావించారు. కాగా మినూ మసానీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉండేవారు. వీరి ఉదంతం అప్పట్లో చాలా ఆసక్తి గొలిపింది.
నేను ఇప్పుడే మూడో పుస్తకం కూడా చదివాను. దానిపేరు ‘సుమిత్ర అండ్ ఎనీస్ టేల్స్: అండ్ రెసిపీస్ ఫ్రమ్ ఎ కిచిడీ ఫ్యామిలీ’. ఇది సీమా చిస్తీ తల్లిదండ్రులు, అసాధారణమైందే అయినప్పటికీ వారి ప్రగాఢమైన ప్రేమ వివాహం గురించిన కథ. ఇది చాలా కొత్తగా, వైవిధ్యపూరితంగా ఉంది.
నేను సీమా చిస్తీ వల్లే ఈ మూడో పుస్తకం చదివాను. ఆమె అప్పుడే కాలేజీ విద్య పూర్తి చేసి తన తొలి ఉద్యోగాన్ని నాతోనే ప్రారంభించింది. అందుకు ఈ పుస్తకం నా టేబుల్ వద్దకు వచ్చేసరికి దాన్ని తీసుకోకుండా ఉండలేకపోయాను. సుమిత్ర, ఎనీస్ వివాహం అసాధారణమైందని చెప్పాలి. ఆమె కన్నడిగ, హిందూ వ్యక్తి. అతడు ఉత్తరప్రదేశ్‌లోని దేవిరయా నుంచి వచ్చాడు. ముస్లిం. ఆమె అతడికంటే ఏడేళ్లు పెద్దది. ఇరు కుటుంబాల్లో ఎవరికీ చెప్పకుండానే పెళ్లాడారు. అదృష్టవశాత్తూ తర్వాత వారిని రెండు కుటుం బాలు సాదరంగా ఆహ్వానించాయనుకోండి!
తమ కథను చెప్పడంలో, సీమ ఒక మార్మిక శైలిని స్వీకరించింది. కొన్నిసార్లు తన తల్లితండ్రులను మా అమ్మ అనీ, మా నాన్న అనీ రాసిందామె. కానీ చాలాసార్లు మాత్రం వారిని సుమిత్ర, ఎనీస్ అంటూ థర్డ్ పర్సన్ సింగ్యులర్ (ప్రథమ పురుష)లో రాసింది. నిజాయితీగా చెప్పాలంటే, ఇలాంటి హైబ్రిడ్ శైలిని మొదటిసారి చూశాను. ఇది చాలా ప్రభావశీలంగా ఉంది.
న్యూఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో మెయిన్ స్ట్రీమ్ పత్రికా కార్యాలయం బేస్‌మెంట్‌లో సుమిత్ర, ఎనీస్ కలిశారు. దట్ ఓల్డ్ స్టేపుల్, ద హౌస్‌హోల్డర్, దిస్, ఇన్ 1964 వంటి సినిమాలు చూస్తూ వారి మధ్య ప్రేమ వికసించిందని సీమ రాసింది. మరింత ఎక్కువగా తన గురించి తెలుసు కోవడానికి ఆమె ఎన్నటికీ విముఖత చూపదని ఎనీస్‌కి అది సంకేతంలా కనిపించిది. కేవలం స్నేహితులుగా మాత్రమే తాము ఉండాల్సిన అవసరం లేదని ఆ సంకేతం ఎనీస్‌కి సూచించింది. ఇది కాల పరీక్షకు నిలిచిన సందర్భం. అది ఫలించింది కూడా!
తన తల్లితండ్రుల నేపథ్యం, జీవితం, వారి ప్రేమ గాథ గురించి సీమ చెబుతున్నప్పుడు అన్నీ వివరించి చెప్పలేని నిరాకరణ కనిపించింది. అలాంటి పరిస్థితి మీలో మరింత ఆకాంక్షను రేపుతుంది. సుమిత్ర, ఎనీస్ ఇద్దరూ ఎగువ తరగతి వారే. అత్యంత వేడిగా ఉంటూ మిత్రపూరితంగా లేని నగరంలో తమకంటూ ఒక గూడుకోసం, కనీస వనరుల కోసం ప్రయత్నిస్తూ తొలి తరం వలసవచ్చినవారి గురించిన కథ వీరిది.
జీవించడానికి 1960లలో ఒక నివాసం కోసం వెతకటం అనేది ఇప్పుడు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న దంపతులు ఎదుర్కొంటున్న సమస్యలాగే ఉంటుంది. ఒక సందర్భంలో లీజుపై సంతకం పెట్టిన తర్వాత ఎనీస్ అంటే అనీష్ (హిందువు) కాదని ఇంటి యజమానురాలికి అర్థమైపోయి ఆ లీజును వెనక్కు తీసుకుంది.
పెళ్లయిన సంవత్సరానికి సీమ పుట్టింది. తన పేరును అలా పెట్టడం తనకు గమ్మత్తుగా ఉండిందని సీమ ఒప్పు కుంది. ఎనీస్ తల్లి నీలిరంగు ఉత్తరంలో బోలెడన్ని సూచనలు రాసి పంపింది. సుమిత్ర ఆ సూచనలను పాటిం చింది. తన భర్త ఇంటిపేరు పెట్టుకోవడానికి ఆమె స్వచ్ఛందంగా సిద్ధపడిపోయింది. నిఖా పట్ల సంతృప్తి చెందింది. కానీ ఆమె కూతురు విషయానికి వచ్చేసరికి సీమ అనే పేరు పెట్టడంలో కాస్త సందిగ్ధత ఏర్పడింది. సీమ అనే పేరు హిందూ, ముస్లిం రెండు మతాల పేరును స్ఫురించడంతో సరిగ్గా సరిపోయింది.
అయితే తన పేరు గురించి సీమ పెద్దగా పట్టించు కోలేదు కానీ, సుమిత్ర–ఎనీస్ కథలో పేర్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ రెండు పేర్లకూ ఒకే అర్థం ఉంది. ఎనీస్ అంటే అరబిక్‌లో మంచి మిత్రులు అని అర్థం. సుమిత్ర అనే సంస్కృత పదానికీ అదే అర్థముంది. ఈ ఇద్దరికీ సంబంధించిన ఉమ్మడి లక్షణాల్లో పేర్లు కూడా కలిసిపోయాయి.
ఈ పుస్తకంలో సగంపైగా తల్లి తన కుమార్తెకు ఎంపిక చేసే వంటకాల గురించే ఉంటుంది. అయితే ఆ కుమార్తెకు వాటిని చేసేంత సమయం ఉండదు. పైగా వాటిని ఆమె ఒప్పుకోదు. అవి సబ్‌టైటిల్‌ని మాత్రమే వివరిస్తాయి. కానీ అవి దేన్నో సూచిస్తాయి. ఆమె తల్లిదండ్రుల వివాహం ఇరుమతాల సంగమం, కలిపిన కిచిడీ లాంటిది.
దీనికి మించి మెరుగ్గా నేను ఈ పుస్తకం గురించి వర్ణించలేను. తొలి నామవాచకం ఇరువురూ ఒక చెంతకు వచ్చి, ఒకే అస్తిత్వంగా మారిపోవడాన్ని సూచిస్తుంది. ఇక రెండోది ఒక కొత్త ఆనందకరమైన దాన్ని రూపొందిం చేందుకు వివిధ భాగాలను తెలివిగా, ఉద్దేశపూర్వకంగా కలపడాన్ని సూచిస్తుంది. (క్లిక్: సంఘీభావమే పరాయీకరణకు మందు)
మినూ, శకుంతల దంపతుల లాగా సుమిత్ర, ఎనీస్ పోరాడారా లేక వీటా, హెరాల్డ్ లాగా విభిన్న మార్గాలను అనుసరించారా అనేది నాకు తెలీదు. సీమ కథ అంతవరకూ తీసుకుపోలేదు. కానీ అది మంచిదే. తల్లితండ్రుల అసమ్మ తిని పిల్లలు ఏ మేరకు వెల్లడించవచ్చు అనే అంశంలో ఒక పరిమితి ఉంటుంది. సామరస్యపూర్వకమైన స్నేహం ఆహ్లాదకరమైన పఠనానికి తావిస్తుంది కదా! (క్లిక్: మతాలు కాదు... మనిషే ప్రధానం)
- కరణ్ థాపర్
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment