పేజీలు: 200 వెల: 125
ప్రతులకు: ప్రజాశక్తి, విశాలాంధ్ర
బుక్ హౌస్‌లు
ఊతం కోల్పోతున్న జీవితాలు
పుస్తకం : ఊతకర్రలు (కథలు)
రచన : శిరంశెట్టి కాంతారావు
విషయం : కుదేలవుతున్న కులవృత్తులు, అంగలారుస్తున్న వ్యవసాయం, పగుళ్లిస్తున్న పల్లె సంస్కృతి... ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న జీవన నేపథ్యాలను గుదిగుచ్చిన 18 కథల సంపుటిది. కుమ్మరి అయోధ్య నుంచి ఆ వృత్తిని వారసత్వంగా స్వీకరించేందుకు నిరాకరిస్తాడు కొడుకు వీరన్న. పొలం కౌలుకు తీసుకుని, డక్కాముక్కీలు తిని, ఉత్తమ రైతు అవార్డు అందుకోగలుగుతాడు. ఈ పురోగతిని భూస్వామ్యవర్గం ఆమోదించని తీరును ‘ప్రయాస’లో చిత్రించారు. ఫార్మా కంపెనీలు జంతువులపై చేయాల్సిన ప్రయోగాలను గిరిజనులపై చేస్తున్న వైనాన్ని ‘గంధపు చెక్కలు’లో చిత్రీకరించారు. మైదాన ప్రాంతపు సంపన్నులు, విప్లవకారులు, పోలీసుల నడుమ ఖమ్మం సరిహద్దుల్లోని గిరిజనుల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో ‘సమిధలు’, ‘మూగజీవాలు’ కథల్లో బొమ్మ కట్టించారు. కాంతారావు మాత్రమే రాయగలిగిన కథ ‘పూసుగూడెం రాజులు’. గట్టు తెగిన ఊరు, నాన్న పోయిన తర్వాత, అంతులేని పయనం ఆకట్టుకుంటాయి. గూనపెంకుల ఇల్లు, రాతెండి సర్వ, వర్రగాలి, పారుటాకుల విస్తళ్లు, తాటితోపులు, బ్రహ్మంగారి తత్వాలు, మెట్ట తాబేళ్లు, ఆరగట్టిన నాటుపొగాకు, చల్లకవ్వాలు... ఈ తరం విస్మరిస్తున్న ఎన్నో పల్లెపదాల సౌకుమార్యం ఈ కథలకు అదనపు సొగసు.
- భాస్వంత్
సస్పెన్స్ కథలు
పేజీలు: 48 వెల: 50
ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలూ.
పుస్తకం : థ్రిల్లర్స్ (కథలు);
రచన : రేణిగుంట ఉత్తమ్
విషయం : పది థ్రిల్లింగ్ కథల చిన్న సంపుటమిది. తెలుగులో ఈ రకమైన కథలు రాసినవాళ్లు తక్కువ. ప్రతి కథా ఉత్కంఠతో నడుస్తుంది. సంపుటిలో ఒకటి రెండు దెయ్యాల కథలున్నాయి, భయపెట్టడానికి. ‘ద్రోహం’, ‘ఖలుడు’ కథల్లో ఎక్కడా బిగి సడలదు. ‘కుట్ర’ కథావస్తువు కృష్ణదేవరాయల కాలం నాటిది. రాజమందిరాల్లో జరిగే కుట్రలను తెలియజేస్తుంది. ఇలాంటి కథలను రాయాలంటే క్రిమినల్ సైకాలజీతో పాటు, సైన్స్‌కి సంబంధించిన విషయాలు కూడా తెలియాలి. రచయితకి ఆ పరిజ్ఞానం పుష్కలంగా ఉంది.
- రామాంజనేయులు
విలువలకు ఊపిరిలూదే కథలు
పేజీలు: 112
వెల: 60
పుస్తకం : నేనున్నాగా (కథలు)
రచన : రంగనాథ రామచంద్రరావు
విషయం : కథకుడు, నవలా రచయిత, అనువాదకుడు, టీవీ నటుడు రంగనాథ రామచంద్రరావు కలం నుండి జాలువారిన మూడో కథాసంపుటిది. మొత్తం పది కథలున్నాయి. వాస్తవికతకు ప్రాధాన్యతనిస్తూ, సన్నివేశాలను దృశ్యమానం చేస్తూ కాల్పనిక శక్తితో కథల్లో రీడబిలిటీని పెంచుకుంటూ పాఠకుణ్ని తీయని అనుభూతిలోకి లాక్కుపోయే తత్వమున్నవి వీరి కథలు. ఉత్పత్తి సంబంధాల్లో తీవ్రమైన మార్పులు కలుగుతున్నాయి. కథాశిల్పంలో తగిన విధంగా మార్పులు చోటు చేసుకోవడం లేదనే చెప్పొచ్చు. రామచంద్రరావు కథలు ఆత్మీయ సంబంధాలకు అద్దం పట్టే విధంగా నడిచాయి. ‘థామస్ మన్రో మళ్లీ చచ్చిపోయాడు’ కథ తెల్లవాండ్ల పాలన దగ్గర నుంచి నల్లవాళ్ల పాలనలో జరుగుతున్న దోపిడీ దౌర్జన్యాలనూ చర్చించింది. వృద్ధులు ఇంట్లో నిరాదరణకు గురవుతున్న రోజుల్లో కోడలు మామ మంచం దగ్గరకు వెళ్లి ‘నేనున్నాగా’ అంటూ తల్లిలా ఒడిలోకి తీసుకోవడం హృదయాల్ని కదిలిస్తుంది.
- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
కొత్త పుస్తకాలు
క్రికెట్ అండ్ లవ్ (నవల)
రచన: బి.ఎస్.జగదీశ్
పేజీలు: 136; వెల: 100
ప్రతులకు: రచయిత, 2-2-18/17, డిడి కాలనీ, బాగ్ అంబర్‌పేట్, హైదరాబాద్-13. ఫోన్: 040-27426521
నందికొటుకూరి సిద్ధ యోగి ప్రణీత యోగీశ్వర విలాసము (ద్విపద)
పరిష్కర్త: వైద్యం వేంకటేశ్వరాచార్యులు
పేజీలు: 260; వెల: 120
ప్రతులకు: పరిష్కర్త, ప్లాట్ 167, ఇం.నం. 87/1246, శ్రీకృష్ణ నిలయం, మేడపైన, రెవెన్యూ కాలనీ, కర్నూలు-2; ఫోన్: 9989679681
నా తిరుపతి యాత్ర
రచన: తెల్లమేకల శ్రీనివాసరావు
పేజీలు: 108; వెల: 70
ప్రతులకు: రచయిత, ఎన్‌ఎస్‌పి కాలనీ మెయిన్ రోడ్, 29-829/2, వినుకొండ, గుంటూరు.
ఫోన్: 9030637270
తెలంగాణ ఆత్మఘోష (వ్యాసాలు)
రచన: గడ్డం కేశవమూర్తి
పేజీలు: 204; వెల: అమూల్యం
ప్రతులకు: 4-7-138/1, కుమార్‌పల్లి, హన్మకొండ-1.
ఫోన్: 8008794162
సత్యాన్వేషణ
రచన: మల్లవరపు విజయ
పేజీలు: 142; వెల: 250
ప్రతులకు: రచయిత్రి, కేరాఫ్ డి.భీమన్న, ఏపీఎస్‌ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్, షాప్ నం.24, నిజామాబాద్ బస్‌స్టేషన్, నిజామాబాద్; ఫోన్: 9989326248
ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ,
సలీంనగర్, మలక్‌పేట్, హైదరాబాద్-36; ఫోన్: 040-27678430
పుస్తక సమీక్షణం
Published Sun, Sep 22 2013 2:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement
Advertisement