visalandhra books
-
కొత్త పుస్తకాలు
హృదయరశ్మి (కవిత్వం) రచన: డా. ఎన్.గోపి పేజీలు: 154; వెల: 150 ప్రతులకు: ‘విశాలాంధ్ర’తోపాటు, ఎన్.అరుణ, 13-1/5బి, శ్రీనివాసపురం, రామంతాపూర్, హైదరాబాద్-13. ఫోన్: 040 27037585 కట్టెపల్క (కవిత్వం) రచన: కందుకూరి అంజయ్య పేజీలు: 98; వెల: 60 ప్రతులకు: కవి, 10-4-311, సుభాష్‌నగర్, కరీంనగర్, 505001. ఫోన్: 9490222201 యాల్లైంది (కవిత్వం) రచన: డా. ఉదారి నారాయణ పేజీలు: 104; వెల: 50 ప్రతులకు: కవి, 4-9-34, సంజయ్‌నగర్, ఆదిలాబాద్-504001. ఫోన్: 08732-230489 చరిత్ర మరచిన రోజు (తెలంగాణ విమోచన దినం) రచన: కపిలవాయి రవీందర్ పేజీలు: 90; వెల: 60 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతోపాటు, శ్రీవిజయ ఎంటర్ప్రైజెస్, 2-12-395, విద్యారణ్యపురి, హన్మకొండ, వరంగల్-506009. ఫోన్: 7386775678 మైనపు బొమ్మలు (కవిత్వం) రచన: లోసారి సుధాకర్ పేజీలు: 116; వెల: 60 ప్రతులకు: కవి, 1/72-1, చెమ్ముమియాపేట, రవీంద్రనగర్ పోస్ట్, కడప-516003. ఫోన్: 9949946991 చింతయామి (కవిత్వం) రచన: డా. ధేనువకొండ శ్రీరామమూర్తి పేజీలు: 72; వెల: 50 ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్-36. ఫోన్: 9885297983 సముద్రమంత... చెమట చుక్క (కవిత్వం) రచన: మొయిద శ్రీనివాసరావు పేజీలు: 96; వెల: 50;ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ పుస్తకకేంద్రాలు; కవి ఫోన్: 9908256267 ఆవరణం (డా.దేవరాజు మహారాజు సాహితీ స్వర్ణోత్సవం సందర్భంగా ప్రముఖుల వ్యాసాలు) సంపాదకత్వం: డి.కృష్ణకుమారి పేజీలు: 310; వెల: 200 ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు; ఫోన్: 8106819844 అంబేద్కర్ ది ట్రూ పేట్రియాట్- అంబేద్కరిజం ది ట్రూ పేట్రియాటిజం రచన: శేఖర్-యాదగిరి పేజీలు: 140; వెల: 80 ప్రతులకు: నవోదయా బుక్ స్టాల్, ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా, కాచిగూడ క్రాస్‌రోడ్స్, హైదరాబాద్. ఫోన్: 9000324260 నవీన సుమతి శతకము రచన: డా. కాసల నాగభూషణం పేజీలు: 32; వెల: 30 ప్రతులకు: రచయిత, 23/13, కెనరా బ్యాంక్ కాలనీ, గాంధీనగర్, సాలిగ్రామం, చెన్నై-600093. ఫోన్: 044 23620572 అనుపల్లవి (కవిత్వం) రచన: అభిలాష పేజీలు: 184; వెల: 120; ప్రతులకు: రచయిత్రి, వేమూరు, గుంటూరు-522261. ఫోన్: 9666222737 -
కొత్త పుస్తకాలు
బోయకొట్టములు పండ్రెండు క్రీ.శ.848నాటి అద్దంకి శాసనం ఆధారంగా కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్లె రాసిన చారిత్రక నవల ఇది. పండరంగడనే చాళుక్య సేనాధిపతి పన్నెండు బోయకొట్టముల మీద దాడి చేసి, నేలమట్టము చేసి కందుకూరును బెజవాడ వలె పటిష్టము గావించెను అని ఆ శాసనం అర్థం. ఇక్కడ కొట్టము అంటే పూరికొట్టం కాదు ఒక పరిపాలనా ప్రాంతం. ఇలా ఎందుకు జరిగింది అని పరిశోధించుకుంటూ వెళ్లి రచయిత చేసిన విశేష నవలా విన్యాసం ఇది. చరిత్రతో పాటు సాహితీ సౌరభాన్ని తెలుసుకొని ఆస్వాదించే రీతిలో ఉంది. వెల: రూ.180 ప్రతులకు:9502304027 రిజర్వేషన్లు- ప్రజాస్వామిక దృక్పథం బాలగోపాల్‌తో విభేదించడం అంటే ప్రజాస్వామిక విలువలతో విభేదించడమే అని ఎక్కువమంది అభిప్రాయం. ఆయన ఆలోచనలు, ఆచరణ కూడా ప్రజాస్వామికవాదుల గౌరవానికి నోచుకున్నాయి. బాలగోపాల్ తాను జీవించి ఉండగా పీడిత వర్గాలు డిమాండ్ చేసే అనేక రిజర్వేషన్ల తరుఫున వకాల్తా పుచ్చుకొని వాదనలు చేస్తూ వ్యాసాలు రాశారు. రిజర్వేషన్లు ఇవ్వరాదు అని మూసవాదనలు చేసే వారందరికీ జవాబు చెప్తూ నోరు లేనివారికి గొంతయ్యాడాయన. ముఖ్యంగా ఆదివాసుల గురించి ఆయన పడ్డ తపన అంతా ఇంతా కాదు. అలాగే ముస్లింల రిజర్వేషన్ల గురించి కూడా. రిజర్వేషన్ల గురించి అవగాహన ఆశించే ప్రతి ఒక్కరి కరదీపిక ఈ పుస్తకం. వెల: రూ.120 పర్స్పెక్టివ్స్ ప్రచురణ ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు -
చెట్టూ చేమా.... రచన...
పుస్తకం నుంచి... తుపాను హెచ్చరికలు వినిపిస్తే తప్ప ఆకాశం వైపు చూడని రోజులొచ్చాయి. గ్రహణం రోజు తప్ప చంద్రుణ్ణి పరికించే తీరిక లేని దురదృష్టం. పాఠకులు సరే. రచయితలన్నా చూస్తున్నారా? పాఠకులను అటు చూడమని చెప్తున్నారా. అలాంటి పాత్రలు సృష్టిస్తున్నారా? ఊరటనిచ్చే జీవితాన్ని ప్రేరేపించే ప్రకృతి ప్రేమని బుచ్చిబాబు పలుమార్లు రాశారు. ఆయన ఆత్మకథ ‘నా అంతరంగ కథనం’ నుంచి ఈ వ్యాసఖండం. ‘‘మేం బాపట్లలో ఉన్న రోజులు. స్కూల్లో భూగోళ శాస్త్ర పాఠాలు తప్ప, స్కూలు పాఠాలు నాకెక్కలేదు. పొపకాటు పటల్, సవానా, సస్కాచివాన్, నయగారా, అమెజాన్ అడవులు, జాంబెసి... ఈ పేర్లు మధురంగా ఉండేవి. తరచూ పేలే వెసూవియస్ అగ్నిపర్వతం, దోవ తప్పి ప్రవహించే చైనాలో నదులు, భూకంపాలకు గురి అయ్యే జపాన్, తెల్లవారు చూడని టిబెట్ ప్రాంతం, ట్రాన్స్ సైబీరియన్ రైల్వే- ఇవన్నీ అద్భుతంగా తోచేవి. అగ్నిపర్వతాలు, భూకంపాలు, టార్పెడొలు, ఉత్తర ధ్రువంలో మంచుకొండలు, హిమాలయ శిఖరాల మీద నుండి జారే మంచు నదులు ఇవన్నీ ప్రత్యక్షంగా చూడాలనిపించేది. బాపట్లలోనే కొన్ని రోజులు మా అమ్మమ్మ ఉండేది మాతో. ఆ ఊళ్లో ఆలయంలో ఒక నెలరోజుల పురాణ కాలక్షేపమూ, హరికథలూ జరిగేవి. వాటిని వినేటందుకు బండి మీద అమ్మమ్మను తీసుకు వెళ్లేవాడిని. ఏసూ బేగ్ అనే మా నౌకర్ కూడా మాకు తోడుగా వచ్చేవాడు. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ వచ్చేవారు. స్త్రీలలో చాలామంది వితంతువులే. ఈ హరికథలు, పురాణ కాలక్షేపాలు కేవలం వితంతువుల కోసమే అనుకొనేవాడిని. మొదటి రోజుల్లో నిద్రపోయినా రాను రాను హరిదాసు ఛలోక్తులతో, పిట్టకథలతో ఆకర్షించి, లేచి కూర్చునేటట్టు చేసేవారు. రామాయణ కథలో సీత, ఊర్మిళ, మండోదరి మొదలైన స్త్రీలకి ప్రాముఖ్యం ఉండేది. సీత ఒక గొప్ప వ్యక్తిగా, మహా ఇల్లాలుగా నాలో ఒక అభిప్రాయం ఏర్పడింది. అమెలో హుందాతనం, నమ్రత, అమాయకత్వంతో కూడుకున్న వ్యక్తిత్వం- నాకెంతో గొప్పలక్షణంగా కనబడ్డాయి. ఎందుకా అని అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాను. రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆమె నిరాడంబర జీవి. ఆభరణాలు విడిచేసి మేడలు, మిద్దెలు వదిలేసి నార చీరతో భర్తతో అడవులకు సిద్ధమైంది. రెండు- నాకు మల్లే సీతకి పూరి గుడిసెలు, చెట్లు, మొక్కలు, సెలయేళ్లు, పక్షులు, జంతువులు ఇష్టం. అరటి చెట్లు, లేళ్లు, సెలయేర్లు, పూలు, పిట్టలు- ప్రకృతి కావాలి. ఆమెకి నాగరికత అక్కర్లేదు. అందుకే సీతంటే గౌరవం. ఇలా నాగరికత నుండి ప్రకృతిలోకి పారిపోయే వ్యక్తులన్నా, అట్టివారిని గూర్చిన కథలన్నా నాకెంతో ఇష్టం. అలా నాకు ఇష్టుడైన రచయిత రాబర్టు లూయీ స్టెవెన్సన్. ఈయన గాడిద మీద అడవుల్లో సంచరించాడు. ఒక్కడూ నట్టడివిలో, కొండలోయల్లో, నక్షత్రాలకేసి చూస్తూ, గడ్డిలో పడుకుని, మిణుగురు పురుగుల మైత్రి చేశాడు. సోమర్సెట్ మామ్ రచనలంటే నాకిష్టం ఏర్పడ్డానికి ఆయన ఇల్లాంటి వ్యక్తులని గురించి ఎక్కువగా రాయడమే కారణమనుకుంటాను. ‘మూన్ అండ్ సిక్స్ పెన్’ అనే నవలలో నాయకుడు, పెళ్లాం పిల్లలు- సంసారం త్యజించి నాగరికతకే దూరమైన, నిర్జనమైన స్థలంలోకి పారిపోతాడు. ‘రేజర్స్ ఎడ్జి’ అనే నవలలో నాయకుడు పెద్ద హోదాగల ఉద్యోగం, విద్యాధికురాలై తన్ను ప్రేమించిన స్త్రీని విడిచేసి దేశదిమ్మరై దేన్నో అన్వేషిస్తూ తిరుగుతాడు. అయితే అందరు ఇల్లాగ ప్రకృతిలోకి పారిపోవాలి అనను. కొందరం బస్తీలలో ఉండి నాగరికతను పెంపొందించే సామాజిక విలువల్ని సాధించి, పాటుపడి నిత్య జీవితపు రథచక్రాల్ని నెట్టాల్సిందే. కాని కొందరు ఇల్లా ఉండలేరు. వారికి ప్రశాంత వాతావరణం కావాలి. పోటీ పడలేరు. దానితో వచ్చే పలుకుబడి, హోదా వారికి అక్కరలేదు. విశ్వాన్ని తిలకించడంలో ఆనందం ఉంది. ఆ ఆనందం వారికి కావాలి. సీత ఈ మహదానందాన్ని అనుక్షణమూ అనుభవించగలిగిన మహా ఇల్లాలు. నాగరికత పరాకాష్ఠనందుకున్న ఉన్నత దశలో ద్రౌపది లాంటి స్త్రీ ఆ నాగరికతకి ప్రతినిధిగా బైలుదేరొచ్చుగాని సీత వంటి స్త్రీలు అప్పుడవతరించరు. దీన్నొక ప్రాచీనతత్వం (ప్రిమిటివిజమ్) అనుకున్నా తప్పులేదు. మట్టిలోంచి పుట్టింది. మళ్లా మట్టిలోకే చేరుకుంటుంది సీత. భూగర్భంలో ఉద్భవించి మళ్లా భూదేవిలో ఐక్యం అయినట్లు చూపడం మహా ప్రతిభాశాలికే సాధ్యమౌతుంది. ఆమె జీవితం అంతా ఉద్యానవనాలలోనూ, అడవుల్లోనూ గడిపింది. లంక నుండి తిరిగి వచ్చాక ఎన్నో రోజులు రాజభవనంలో ఉండలేదు. నీ కోర్కె ఏమిటంటే- రుష్యాశ్రమంలోకి వెళ్లాలని ఉందని చెప్పుకుంది. అట్లా కోరిందని ఊహిస్తేనే నా కళ్లంట నీళ్లు తిరుగుతాయి. రేడియోలు, సినిమాలు, కార్లు, విమానాలు, నగలు, చీరలు, పుట్టింటివారికి కానుకలు- ఇవేవీ అడగలేదు. తోటలో, పాకలో ఉండాలని ఉందిట. కంచర్ల గోపన్న (రామదాసు) వెర్రివాడు. సీతమ్మకి చేయిస్తి చింతాకు పతకాము అని రాముడితో మొరెట్టుకున్నాడు. ఆయన రామభక్తుడు. సీతను ఎరగడు. ఎరిగి ఉంటే సీతమ్మకు వేయిస్తి మామిడి తోపు అని పాడి ఉండును. నాగరికతను విడిచేసి ప్రకృతిలోకి పారిపోవాలన్నది పాశ్చాత్య దేశాలలో ఉద్యమంగా లేవ దీసింది ‘రూసో’. టాల్‌స్టాయ్ ఆస్తినంతా వప్పగించేసి, వేరే ఆశ్రమం ఏర్పరుచుకున్నాడు. గాంధీగారు ఆఫ్రికాలో ఫీనిక్స్ ఆశ్రమం ఏర్పరుచుకున్నారు. మనవారిలో వేమన్న ప్రకృతిలోకి పారిపోయి నగ్నంగా జీవించాడు. జవహర్లాల్ నెహ్రూ తన చివరి రోజుల్లో ‘నాలోన కొండల నడుమ తిరుగాడే ఆటవికుడు వొక్కడున్నాడు’ అని ఎక్కడో చెప్పుకున్నాడు. ఆయన కుమార్తె ఇందిరాగాంధీకి ఆటవికుల మధ్య గడపాలన్న కోరిక ఉండేది. అది సాధ్యం కాక ఆటవికులని గురించిన పుస్తకాలు చదవడంలో తృప్తి పడింది. ఈ ప్రాచీనతత్వం ఛాయలు నన్ను కూడా ప్రేరేపించాయి. అందుకే యెంకి, నాయుడుబావల ప్రేమ కథనంగా ‘ఉత్తమ ఇల్లాలు’ నాటకం రాశాను.’’ (ఈ పుస్తకం విశాలాంధ్రలో లభ్యం. వెల: రూ. 55) -
పుస్తక సమీక్షణం
పేజీలు: 200 వెల: 125 ప్రతులకు: ప్రజాశక్తి, విశాలాంధ్ర బుక్ హౌస్‌లు ఊతం కోల్పోతున్న జీవితాలు పుస్తకం : ఊతకర్రలు (కథలు) రచన : శిరంశెట్టి కాంతారావు విషయం : కుదేలవుతున్న కులవృత్తులు, అంగలారుస్తున్న వ్యవసాయం, పగుళ్లిస్తున్న పల్లె సంస్కృతి... ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న జీవన నేపథ్యాలను గుదిగుచ్చిన 18 కథల సంపుటిది. కుమ్మరి అయోధ్య నుంచి ఆ వృత్తిని వారసత్వంగా స్వీకరించేందుకు నిరాకరిస్తాడు కొడుకు వీరన్న. పొలం కౌలుకు తీసుకుని, డక్కాముక్కీలు తిని, ఉత్తమ రైతు అవార్డు అందుకోగలుగుతాడు. ఈ పురోగతిని భూస్వామ్యవర్గం ఆమోదించని తీరును ‘ప్రయాస’లో చిత్రించారు. ఫార్మా కంపెనీలు జంతువులపై చేయాల్సిన ప్రయోగాలను గిరిజనులపై చేస్తున్న వైనాన్ని ‘గంధపు చెక్కలు’లో చిత్రీకరించారు. మైదాన ప్రాంతపు సంపన్నులు, విప్లవకారులు, పోలీసుల నడుమ ఖమ్మం సరిహద్దుల్లోని గిరిజనుల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో ‘సమిధలు’, ‘మూగజీవాలు’ కథల్లో బొమ్మ కట్టించారు. కాంతారావు మాత్రమే రాయగలిగిన కథ ‘పూసుగూడెం రాజులు’. గట్టు తెగిన ఊరు, నాన్న పోయిన తర్వాత, అంతులేని పయనం ఆకట్టుకుంటాయి. గూనపెంకుల ఇల్లు, రాతెండి సర్వ, వర్రగాలి, పారుటాకుల విస్తళ్లు, తాటితోపులు, బ్రహ్మంగారి తత్వాలు, మెట్ట తాబేళ్లు, ఆరగట్టిన నాటుపొగాకు, చల్లకవ్వాలు... ఈ తరం విస్మరిస్తున్న ఎన్నో పల్లెపదాల సౌకుమార్యం ఈ కథలకు అదనపు సొగసు. - భాస్వంత్ సస్పెన్స్ కథలు పేజీలు: 48 వెల: 50 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలూ. పుస్తకం : థ్రిల్లర్స్ (కథలు); రచన : రేణిగుంట ఉత్తమ్ విషయం : పది థ్రిల్లింగ్ కథల చిన్న సంపుటమిది. తెలుగులో ఈ రకమైన కథలు రాసినవాళ్లు తక్కువ. ప్రతి కథా ఉత్కంఠతో నడుస్తుంది. సంపుటిలో ఒకటి రెండు దెయ్యాల కథలున్నాయి, భయపెట్టడానికి. ‘ద్రోహం’, ‘ఖలుడు’ కథల్లో ఎక్కడా బిగి సడలదు. ‘కుట్ర’ కథావస్తువు కృష్ణదేవరాయల కాలం నాటిది. రాజమందిరాల్లో జరిగే కుట్రలను తెలియజేస్తుంది. ఇలాంటి కథలను రాయాలంటే క్రిమినల్ సైకాలజీతో పాటు, సైన్స్‌కి సంబంధించిన విషయాలు కూడా తెలియాలి. రచయితకి ఆ పరిజ్ఞానం పుష్కలంగా ఉంది. - రామాంజనేయులు విలువలకు ఊపిరిలూదే కథలు పేజీలు: 112 వెల: 60 పుస్తకం : నేనున్నాగా (కథలు) రచన : రంగనాథ రామచంద్రరావు విషయం : కథకుడు, నవలా రచయిత, అనువాదకుడు, టీవీ నటుడు రంగనాథ రామచంద్రరావు కలం నుండి జాలువారిన మూడో కథాసంపుటిది. మొత్తం పది కథలున్నాయి. వాస్తవికతకు ప్రాధాన్యతనిస్తూ, సన్నివేశాలను దృశ్యమానం చేస్తూ కాల్పనిక శక్తితో కథల్లో రీడబిలిటీని పెంచుకుంటూ పాఠకుణ్ని తీయని అనుభూతిలోకి లాక్కుపోయే తత్వమున్నవి వీరి కథలు. ఉత్పత్తి సంబంధాల్లో తీవ్రమైన మార్పులు కలుగుతున్నాయి. కథాశిల్పంలో తగిన విధంగా మార్పులు చోటు చేసుకోవడం లేదనే చెప్పొచ్చు. రామచంద్రరావు కథలు ఆత్మీయ సంబంధాలకు అద్దం పట్టే విధంగా నడిచాయి. ‘థామస్ మన్రో మళ్లీ చచ్చిపోయాడు’ కథ తెల్లవాండ్ల పాలన దగ్గర నుంచి నల్లవాళ్ల పాలనలో జరుగుతున్న దోపిడీ దౌర్జన్యాలనూ చర్చించింది. వృద్ధులు ఇంట్లో నిరాదరణకు గురవుతున్న రోజుల్లో కోడలు మామ మంచం దగ్గరకు వెళ్లి ‘నేనున్నాగా’ అంటూ తల్లిలా ఒడిలోకి తీసుకోవడం హృదయాల్ని కదిలిస్తుంది. - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి కొత్త పుస్తకాలు క్రికెట్ అండ్ లవ్ (నవల) రచన: బి.ఎస్.జగదీశ్ పేజీలు: 136; వెల: 100 ప్రతులకు: రచయిత, 2-2-18/17, డిడి కాలనీ, బాగ్ అంబర్పేట్, హైదరాబాద్-13. ఫోన్: 040-27426521 నందికొటుకూరి సిద్ధ యోగి ప్రణీత యోగీశ్వర విలాసము (ద్విపద) పరిష్కర్త: వైద్యం వేంకటేశ్వరాచార్యులు పేజీలు: 260; వెల: 120 ప్రతులకు: పరిష్కర్త, ప్లాట్ 167, ఇం.నం. 87/1246, శ్రీకృష్ణ నిలయం, మేడపైన, రెవెన్యూ కాలనీ, కర్నూలు-2; ఫోన్: 9989679681 నా తిరుపతి యాత్ర రచన: తెల్లమేకల శ్రీనివాసరావు పేజీలు: 108; వెల: 70 ప్రతులకు: రచయిత, ఎన్ఎస్పి కాలనీ మెయిన్ రోడ్, 29-829/2, వినుకొండ, గుంటూరు. ఫోన్: 9030637270 తెలంగాణ ఆత్మఘోష (వ్యాసాలు) రచన: గడ్డం కేశవమూర్తి పేజీలు: 204; వెల: అమూల్యం ప్రతులకు: 4-7-138/1, కుమార్‌పల్లి, హన్మకొండ-1. ఫోన్: 8008794162 సత్యాన్వేషణ రచన: మల్లవరపు విజయ పేజీలు: 142; వెల: 250 ప్రతులకు: రచయిత్రి, కేరాఫ్ డి.భీమన్న, ఏపీఎస్ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్, షాప్ నం.24, నిజామాబాద్ బస్‌స్టేషన్, నిజామాబాద్; ఫోన్: 9989326248 ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట్, హైదరాబాద్-36; ఫోన్: 040-27678430