బోయకొట్టములు పండ్రెండు
క్రీ.శ.848నాటి అద్దంకి శాసనం ఆధారంగా కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్లె రాసిన చారిత్రక నవల ఇది. పండరంగడనే చాళుక్య సేనాధిపతి పన్నెండు బోయకొట్టముల మీద దాడి చేసి, నేలమట్టము చేసి కందుకూరును బెజవాడ వలె పటిష్టము గావించెను అని ఆ శాసనం అర్థం. ఇక్కడ కొట్టము అంటే పూరికొట్టం కాదు ఒక పరిపాలనా ప్రాంతం. ఇలా ఎందుకు జరిగింది అని పరిశోధించుకుంటూ వెళ్లి రచయిత చేసిన విశేష నవలా విన్యాసం ఇది. చరిత్రతో పాటు సాహితీ సౌరభాన్ని తెలుసుకొని ఆస్వాదించే రీతిలో ఉంది.
వెల: రూ.180 ప్రతులకు:9502304027
రిజర్వేషన్లు-
ప్రజాస్వామిక దృక్పథం
బాలగోపాల్‌తో విభేదించడం అంటే ప్రజాస్వామిక విలువలతో విభేదించడమే అని ఎక్కువమంది అభిప్రాయం. ఆయన ఆలోచనలు, ఆచరణ కూడా ప్రజాస్వామికవాదుల గౌరవానికి నోచుకున్నాయి. బాలగోపాల్ తాను జీవించి ఉండగా పీడిత వర్గాలు డిమాండ్ చేసే అనేక రిజర్వేషన్ల తరుఫున వకాల్తా పుచ్చుకొని వాదనలు చేస్తూ వ్యాసాలు రాశారు. రిజర్వేషన్లు ఇవ్వరాదు అని మూసవాదనలు చేసే వారందరికీ జవాబు చెప్తూ నోరు లేనివారికి గొంతయ్యాడాయన. ముఖ్యంగా ఆదివాసుల గురించి ఆయన పడ్డ తపన అంతా ఇంతా కాదు. అలాగే ముస్లింల రిజర్వేషన్ల గురించి కూడా. రిజర్వేషన్ల గురించి అవగాహన ఆశించే ప్రతి ఒక్కరి కరదీపిక ఈ పుస్తకం.
వెల: రూ.120 పర్‌స్పెక్టివ్స్ ప్రచురణ ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు