
వెల్లింగ్టన్: వలసలను నియంత్రించేందుకు వీసా నిబంధనలను న్యూజిలాండ్ కఠినతరం చేసింది. ఇకపై తక్కువ నైపుణ్యమున్న పనివారు కూడా ఇంగ్లిష్‌పై పట్టు సాధించాల్సి ఉంటుంది. వారికి ఐదేళ్ల నివాస పరిమితిని మూడేళ్లకు తగ్గించింది. వీసాదారులకు నైపుణ్యం, అనుభవాలకు సంబంధించి పలు నిబంధనలు విధించింది.
వెల్డర్లు, ఫిట్టర్లు, టర్నర్లు తదితర 11 కేటగిరీల వారిని ఫాస్ట్ ట్రాక్ విధానంలో తీసుకోవాలనే ప్రతిపాదనను సైతం ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కనబెట్టింది. అవసరమైతే వీసా నిబంధనలను మరింత కఠినం చేయెచ్చని కూడా సంకేతాలిచ్చింది.