immigration issue
-
న్యూజిలాండ్ వీసా నిబంధనలు కఠినతరం
వెల్లింగ్టన్: వలసలను నియంత్రించేందుకు వీసా నిబంధనలను న్యూజిలాండ్ కఠినతరం చేసింది. ఇకపై తక్కువ నైపుణ్యమున్న పనివారు కూడా ఇంగ్లిష్‌పై పట్టు సాధించాల్సి ఉంటుంది. వారికి ఐదేళ్ల నివాస పరిమితిని మూడేళ్లకు తగ్గించింది. వీసాదారులకు నైపుణ్యం, అనుభవాలకు సంబంధించి పలు నిబంధనలు విధించింది. వెల్డర్లు, ఫిట్టర్లు, టర్నర్లు తదితర 11 కేటగిరీల వారిని ఫాస్ట్ ట్రాక్ విధానంలో తీసుకోవాలనే ప్రతిపాదనను సైతం ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కనబెట్టింది. అవసరమైతే వీసా నిబంధనలను మరింత కఠినం చేయెచ్చని కూడా సంకేతాలిచ్చింది. -
అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఊరట
వాషింగ్టన్: అమెరికాలో ఎఫ్–1, ఎం–1 వీసాలపై చదువుకుంటున్న భారతీయులు సహా విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లిపోవాలన్న నిర్ణయాన్ని ట్రంప్ సర్కార్ వెనక్కి తీసుకుంది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం మసాచూసెట్స్‌లోని అమెరికా జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. అంతకు ముందే ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ట్రంప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని న్యాయమూర్తి అలిసన్ బరో న్యాయస్థానంలో వెల్లడించారు. విద్యాసంస్థల్లో ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులు దేశం విడిచి వెనక్కి వెళ్లిపోవాలంటూ ఈ నెల 6న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలతో లక్షలాది మంది విద్యార్థులు గందరగోళంలో పడిపోయారు. కోవిడ్–19 అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ యూనివర్సిటీలు ఆన్లైన్ క్లాసులే నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో స్వదేశాలకు వెళితే వీసా స్టేటస్ కాపాడుకోవడం, రుణాల చెల్లింపు, వేర్వేరు టైమ్ జోన్లతో తరగతులకు ఎలా హాజరుకావాలని విద్యార్థులు సతమతమయ్యారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఉన్న 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. వెనకడుగు ఎందుకంటే.. ► హార్వర్డ్, ఎంఐటీలకు మద్దతుగా కాలిఫోర్నియా పబ్లిక్ కాలేజీలు, మరో 17 రాష్ట్రాలు ట్రంప్ సర్కార్‌ని కోర్టుకీ డ్చాయి. వారికి టెక్ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్‌లు మద్దతు పలికాయి. వృత్తివిద్యా కోర్సుల్లో ఇచ్చే శిక్షణా కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో అవసరమని, అంతిమంగా దేశంలో వాణిజ్య రంగాన్ని బలోపేతం చేస్తాయని టెక్కీ సంస్థలు తేల్చి చెప్పాయి. ► విద్యాసంస్థల్ని తెరవడం కోసం యూనివర్సిటీలపై ఒత్తిడి పెంచడానికే ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందంటూ రాజకీయంగానూ ఎదురుదాడి ప్రారంభమైంది. విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న చెడ్డ పేరు కూడా వచ్చింది. ► ఆన్లైన్ తరగతులపై పరిమితుల్ని ఎత్తివేస్తూనే, మరోవైపు దానికి పూర్తి విరుద్ధంగా ఇలాంటి ఉత్తర్వులు ఐసీఈ ఎలా ఇస్తుందని హార్వర్డ్, ఎంఐటీలు వాదించాయి. ► అమెరికాలో విదేశీ విద్యార్థులు 10 లక్షలకు పైగా ఉన్నారు. 2018–19లో విదేశీ విద్యార్థుల ద్వారా అగ్రరాజ్యానికి వచ్చిన ఆదాయం 447 కోట్ల డాలర్లుగా ఉంది. విద్యార్థుల్ని వెనక్కి పంపితే అగ్రరాజ్యానికి ఆర్థికంగా కూడా నష్టం కలుగుతుంది. ► విద్యార్థుల్లో ఎక్కువ మంది చైనా, భారత్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా దేశానికి చెందినవారు. దీంతో అంతర్జాతీయంగాను ట్రంప్ సర్కార్ ప్రతిష్ట దిగజారింది. -
అమెరికాలో చొరబడుతున్న భారతీయులు...!
అమెరికాలో భారతీయులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన విదేశీయుల్లో ప్రథమస్థానంలో నిలవడం ద్వారా... అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినపుడు అదుపులోకి తీసుకున్న భారతీయుల సంఖ్య ఈ ఏడాది దాదాపు మూడు రెట్లు పెరిగిందని యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) విభాగం తాజాగా ప్రకటించింది. యూఎస్–మెక్సికో సరిహద్దును అక్రమంగా దాటేందుకు ఒక్కొక్కరికీ 25–50 వేల డాలర్ల మధ్యలో ‘మనుషుల స్మగ్లింగ్ బందాల’కు చెల్లిస్తున్నట్టు వెల్లడైంది. ఇలా దొంగతనంగా అమెరికాలోకి ప్రవేశించేవారు స్వదేశాల్లో తాము హింసను, పీడనను ఎదుర్కొంటున్న కారణంగా అక్కడ ఆశ్రయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సెప్టెంబర్ 30తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 9 వేల మంది (గతేడాది 3,162 మంది) భారతీయులను సరిహద్దుల్లో అరెస్ట్ చేసినట్టు సీబీపీ అధికారి సాల్వడార్ జమోరా వెల్లడించారు. వీరిలో 4వేల మంది దాకా అమెరికాలోకి అక్రమ ప్రవేశానికి అనుకూలంగా ఉందని భావిస్తున్న మెక్సికాలి సరిహద్దు కంచెను దాటి వచ్చినట్టు చెప్పారు. రకరకాల కారణాలు చెప్పి... ఆశ్రయం పొందేందుకు భారతీయులు అనేక కారణాలు చెబుతున్నారు. కులాంతర వివాహాలు చేసుకున్నందున తమను చంపుతారనే భయంతో అమెరికాకు పారిపోయి వచ్చినట్టు కొందరు చెబుతుండగా, సిక్కులు మాత్రం భారత్‌లో రాజకీయ పీడన కారణంగానే తాము ఇక్కడకు రావాల్సి వచ్చిందని చెబుతున్నారని ఇమిగ్రేషన్ లాయర్లు తెలిపారు. ఇతర వలసదారులు చెప్పే కారణాలనే కొందరు వెల్లడిస్తూ ఆశ్రయం కోసం ప్రభుత్వాన్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారని జమోరా పేర్కొన్నారు. 2012–17 మధ్యకాలంలో ఆశ్రయం కోసం అర్జీలు పెట్టుకున్న 42.2 శాతం భారతీయుల విజ్ఞప్తులను తోసిపుచ్చినట్టు సైకాక్యూస్ యూనివర్శిటీ ట్రాన్సాక్షనల్ రికార్డ్స్ యాక్సెస్ క్లియరింగ్ హౌజ్ తెలియజేసింది. ఈ విషయంలో 79 శాతంతో ఎల్‌సాల్వడార్ వాసులు మొదటిస్థానంలో, 78 శాతంతో హ్యుండరస్కు చెందినవారు రెండోస్థానంలో నిలిచారు. అమెరికాలో పట్టుబడ్డాక భారతీయులకు బాండ్లు కట్టి మానవ అక్రమరవాణా బందాలు విడిపిస్తున్నట్టు జమోరా తెలిపారు. బాండ్లపై విడుదలయ్యాక హోటళ్లు, ఇతర స్టోర్లలో ఇండియన్లు పనిచేసి డబ్బు సంపాదిస్తున్నారు. ఆ విధంగా వచ్చిన ఆదాయంతో ఆ బందాలకు బాండ్ ఫీజు రుసుమును తిరిగి చెల్లించడంతో పాటు, అక్రమంగా ప్రవేశించేందుకు చేసిన అప్పులను తీర్చేందుకు ఉపయోగిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. -
దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు
-
దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు
పటియాలా: 2003లో జరిగిన ‘ఇమిగ్రేషన్ స్కాండల్’ కేసులో పంజాబ్ పాప్ సింగర్ దలేర్ మెహందీని కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. శుక్రవారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ జడ్జి దలేర్‌కు రూ.1,000 జరిమానా విధించారు. తర్వాత వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిలుపై విడుదలయ్యారు. అమెరికాకు అక్రమంగా వెళ్లేందుకు సహాయం చేస్తామని చెప్పి దలేర్, షమ్షేర్ మెహందీ తమ వద్ద డబ్బు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ బక్షీశ్ సింగ్ అనే వ్యక్తితోపాటు మరో 35 మంది ఫిర్యాదు చేశారు. 1998, 1999ల్లో రెండు బృందాలను అమెరికాకు తీసుకెళ్లిన మెహందీ సోదరులు అందులో 10 మందిని అక్కడే అక్రమంగా వదిలి వచ్చినట్లు ఆరోపణలున్నాయి. మరోసారి శాన్ఫ్రాన్సిస్కోలో ముగ్గురు అమ్మాయిలను వదిలి వచ్చినట్లు ఆరోపణలున్నాయి. 1999 అక్టోబర్‌లో సోదరులిద్దరూ కొందరు నటులతో వెళ్లి న్యూజెర్సీలో ముగ్గురిని అక్కడ వదిలి వచ్చారు. -
పౌరసత్వం లేకుంటే అమెరికా నుంచి పంపేస్తా: ట్రంప్
తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వాళ్లను దేశం నుంచి పంపేస్తానని రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పారు. అరిజోనాలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ ఆయనీ విషయం తెలిపారు. ఇప్పటికి దాదాపు కోటి మందికి పైగా అక్రమంగా అమెరికాలో ప్రవేశించారని, వాళ్లంతా తమ తమ దేశాలకు వెళ్లిపోయి, మళ్లీ వీసాకు దరఖాస్తు చేసుకుని రావాల్సిందేనని అన్నారు. అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించి ఆ తర్వాత పౌరసత్వం పొందాలనుకుంటే కుదరదని స్పష్టం చేశారు. ఎలాగోలా అమెరికా వచ్చేసి, ఇక్కడ సెటిలైపోయి, తర్వాత చట్టబద్ధత పొందాలనుకుంటున్నారని విమర్శించారు. మెక్సికో - అమెరికాల మధ్య సరిహద్దు గోడకు తాము నయాపైస కూడా చెల్లించబోమని మెక్సికన్ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో స్పష్టంగా చెప్పినా.. ట్రంప్ మాత్రం ఈ సభలో ఆ సరిహద్దు గోడకు మెక్సికోయే డబ్బు చెల్లిస్తుందని అన్నారు. దక్షిణ సరిహద్దులో తాము ఓ పెద్ద గోడ నిర్మిస్తామని, దానికి మెక్సికో నూరుశాతం చెల్లిస్తుందని చెప్పారు. సరైన పత్రాలు లేని వాళ్లను అమెరికా నుంచి పంపేయడమే తన తొలి ప్రాధాన్యమని మరీ మరీ నొక్కిచెప్పారు. -
అమెరికా వెళ్లే భారత విద్యార్థుల్లో అయోమయం!
పారిస్ ఉగ్రవాదదాడి అనంతరం అమెరికా కస్టమ్స్, సరిహద్దు రక్షణ దళం భద్రత నిబంధనలను కఠినతరం చేసింది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండు యూనివర్సిటీలను బ్లాక్‌లిస్టులో పెట్టారని, అందువల్ల వాళ్లకు అమెరికా ప్రవేశం దుర్లభం అవుతోందని గత రెండు రోజులుగా దుమారం రేగుతోంది. కానీ, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ రెండూ మాత్రం.. తమ వర్సిటీలు బ్లాక్‌లిస్టులో లేవని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని రెండు యూనివర్సిటీలు విడివిడిగా విడుదల చేసిన ప్రకటనలలో తెలిపాయి. అవసరమైతే తమను నేరుగా ఈ మెయిల్ ద్వారా సంప్రదించాలని యూనివర్సిటీలలో చేరేందుకు ఇప్పటికే బయల్దేరిన, బయల్దేరుతున్న విద్యార్థులకు తెలిపాయి. కొత్తగా వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా ఈ కింది జాబితాలోని పత్రాల అసలు కాపీలను వెంట ఉంచుకోవాలని, అలా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెబుతున్నాయి. బ్లాక్ లిస్ట్ లో తమ యూనివర్సిటీలు లేవని వాటి యజమాన్యాలు పేర్కొంటుండగా, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తరాదనే భావనతోనే ఎయిర్ ఇండియా వారి ప్రయాణాన్ని రద్దు చేసినట్లు వెల్లడించింది. ఏది ఏమైతేనేం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలని కలలుకన్న భారత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అవసరమైన పత్రాలు పాస్‌పోర్టు, వీసా విద్యాసంస్థ జారీచేసిన ఐ-20 విద్యాసంస్థ ఇచ్చిన అడ్మిషన్ ప్యాకేజి ఆర్థిక వెసులుబాటుకు సంబంధించిన ఆధారాలు విద్యాసంస్థకు దరఖాస్తు చేసేటప్పుడు ఉపయోగించిన అధికారిక ట్రాన్స్‌స్క్రిప్ట్, సర్టిఫికెట్లు ఇప్పటికే చదువుతున్న విద్యార్థులైతే.. అమెరికాలో చదువుతున్నట్లుగా రుజువుచేసే అధికారిక ట్రాన్స్‌స్క్రిప్ట్ లేదా డిగ్రీ సర్టిఫికెట్ విద్యాసంస్థ జారీచేసిన ట్రావెల్ డాక్యుమెంటు ఆరోగ్య కారణాలతో సెలవు తీసుకుంటే.. దాన్ని రుజువు చేసే పత్రాలు గత రెండు మూడు రోజులుగా అమెరికాలో చదివేందుకు వెళ్తున్న విద్యార్థులకు ఎయిరిండియా వర్గాల నుంచి కొంత చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన 19 మంది విద్యార్ధులు అక్కడికి చేరుకోవడానికి ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అయితే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఈ రెండు యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్‌లో ఉంచారనే సాకుతో ఎయిర్ ఇండియా అధికారులు వీరికి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులకు వారి ప్రయాణ ఛార్జీలు తిరిగి చెల్లించినట్లు అధికారులు చెప్పారు. తమకు అన్ని రకాల అనుమతులు సక్రమంగానే ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. తమకు అమెరికా కాన్సులేట్ వీసా జారీచేసిన తర్వాత ఎయిర్ పోర్టు అధికారులు ఇలాంటి సాకులు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎంట్రీ వీసాలు ఉన్నందున మరో విమానయాన సంస్థ ద్వారానైనా అక్కడకు చేరుకుంటామంటున్నారు. తాము అడ్మిషన్ పొందిన యూనివర్సిటీలకు అక్రిడిటేషన్ ఉండని, గతంలో కూడా ఎంతో మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీలకు ఉన్నత చదువులకు వెళ్లారని అంటున్నారు. సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీలో చేరేందుకు వెళ్లే విద్యార్థులైతే admissions@svuca.edu అనే ఈ మెయిల్‌కు, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలో చేరేందుకు వెళ్లే విద్యార్థులైతే admissions@npu.edu అనే ఈ మెయిల్‌కు నేరుగా సంప్రదించాలని తెలిపారు. అమెరికా క్లియరెన్స్ ఇవ్వగానే విద్యార్థులను అనుమతిస్తాం హైదరాబాద్: విద్యార్థుల డబ్బు వృథా కాకూడదనే వాళ్లు అమెరికా వెళ్లకుండా ఆపినట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన 19 మందిని ఎయిర్ ఇండియా వర్గాలు శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ఆపేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. రెండు కాలిఫోర్నియా వర్సిటీలను పరిశీలనలో ఉంచినట్లు తమకు డిసెంబర్ 19న అమెరికా అధికారుల నుంచి సమాచారం వచ్చిందని తెలిపింది. అప్పటికే శాన్ఫ్రాన్సిస్కో చేరిన 14 మంది విద్యార్థులను కూడా వెనక్కి పంపేస్తున్నట్టు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. విద్యార్థుల డబ్బు వృథా కాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు ఎయిర్ ఇండియా పేర్కొంది. టిక్కెట్లు రద్దు చేసుకుంటే వారికి పూర్తిస్థాయిలో నగదు చెల్లింపులు ఉంటాయంది. ఒకవైపే టిక్కెట్ బుక్ చేసుకుని వెళ్లే.. తిరిగి రావడానికి ఎక్కువ డబ్బు పెట్టాల్సి ఉంటుందని చెప్పింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యానే తాము వారికి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ఈ రెండు యూనివర్సిటీల గురించి అమెరికా క్లియరెన్స్ ఇవ్వగానే విద్యార్థులను అనుమతిస్తామని పేర్కొంది. అదనంగా వారి నుంచి డబ్బులు వసూలు చేయకుండా అక్కడకు తీసుకెళ్తామని ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. విదేశాంగ మంత్రితో చర్చిస్తా... ‘‘అమెరికాలో యూనివర్సిటీలకు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులను వారి శ్రేయస్సు మేరకే ఆపుతాం. కొన్ని వర్సిటీలకు గుర్తింపు సమస్యలు ఉన్నాయని ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను అనుమతించడం లేదు. ఎయిర్ ఇండియా విమాన సంస్థ మాత్రమే. యూఎస్ వెళ్లి.. అక్కడ అనుమతి లభించని విద్యార్థులు సొంత ఖర్చులతో తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై విదేశాంగ మంత్రితో చర్చిస్తాం.’’ - కేంద్ర పౌర విమాన యాన మంత్రి అశోక్‌గజపతి రాజు