
దలేర్ మెహందీ
పటియాలా: 2003లో జరిగిన ‘ఇమిగ్రేషన్ స్కాండల్’ కేసులో పంజాబ్ పాప్ సింగర్ దలేర్ మెహందీని కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. శుక్రవారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ జడ్జి దలేర్‌కు రూ.1,000 జరిమానా విధించారు. తర్వాత వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిలుపై విడుదలయ్యారు. అమెరికాకు అక్రమంగా వెళ్లేందుకు సహాయం చేస్తామని చెప్పి దలేర్, షమ్షేర్ మెహందీ తమ వద్ద డబ్బు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ బక్షీశ్ సింగ్ అనే వ్యక్తితోపాటు మరో 35 మంది ఫిర్యాదు చేశారు. 1998, 1999ల్లో రెండు బృందాలను అమెరికాకు తీసుకెళ్లిన మెహందీ సోదరులు అందులో 10 మందిని అక్కడే అక్రమంగా వదిలి వచ్చినట్లు ఆరోపణలున్నాయి. మరోసారి శాన్‌ఫ్రాన్సిస్కోలో ముగ్గురు అమ్మాయిలను వదిలి వచ్చినట్లు ఆరోపణలున్నాయి. 1999 అక్టోబర్‌లో సోదరులిద్దరూ కొందరు నటులతో వెళ్లి న్యూజెర్సీలో ముగ్గురిని అక్కడ వదిలి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment