daler mehndi
-
ప్రముఖ సింగర్ అరెస్ట్.. రెండేళ్ల జైలు శిక్ష
ప్రముఖ సింగర్ దలెర్ మెహందీకి న్యాయస్థానం మరోసారి జైలు శిక్ష విధించింది. 2003 నాటి మానవ అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దలెర్ మెహందీతో పాటు అతడి సోదరుడిని దోషిగా నిర్ధారించిన పటియాలా జిల్లా కోర్టు వీరికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా దలెర్ మెహందీ, అతడి సోదరుడు షంషేర్ సింగ్ 'మ్యూజికల్ ట్రూప్' పేరుతో కొంతమందిని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారంటూ 19 ఏళ్ల కిందట ఎఫ్ఐఆర్ నమోదైంది. 1998, 1999 సంవత్సరాలలో వీరు దాదాపు పది మందిని అక్రమంగా అమెరికాలో వదిలేశారని, ఇందుకోసం వారు భారీగా డబ్బులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దలెర్కు వ్యతిరేకంగా 35 కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై విచారణ జరిపిన న్యాయస్థానం వారికి రెండేళ్లపాటు జైలు శిక్ష ఖరారు చేసింది. దీంతో కొన్నాళ్లపాటు జైలులో గడిపిన ఆ అన్నదమ్ములు తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా అతడి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో వారిద్దరినీ అరెస్ట్ చేసి పటియాలా జైలుకు తీసుకెళ్లనున్నారు. చదవండి: గ్లామర్ తప్ప యాక్టింగ్ రాదంటూ టార్చర్ పెట్టారు నెలకు రూ. 25 లక్షలు ఇస్తాను, భార్యగా ఉండమన్నాడు -
మొన్న మైఖేల్ జాక్సన్ ఇవాళ దలేర్ మెహందీ..
ముంబై: ఇటీవలే క్వారంటైన్‌ను పూర్తి చేసుకొని జట్టుతో చేరిన పంజాబ్ కింగ్స్ ఆటగాడు క్రిస్ గేల్.. ఓ పక్క ప్రాక్టీస్ చేస్తూనే రోజుకో కొత్త తరహాలో అభిమానులను అలరిస్తున్నాడు. మొన్న మైఖేల్ జాక్సన్ మూన్‌వాక్‌కు స్టెప్పులేసి ఇరగదీసిన యూనివర్సల్ బాస్.. తాజాగా పంజాబీ స్టార్ సింగర్ దలేర్ మెహందీ పాటకు డోల్ వాయిస్తూ అదరగొట్టాడు. 90 దశకంలో పాపులర్ అయిన తునుక్ తునుక్ సాంగ్‌కు తగట్టుగా డోల్ వాయిస్తూ, స్టెప్పులేస్తూ అభిమానులను హుషారెత్తించాడు. గేల్ పర్ఫామెన్స్‌కు సంబంధించిన వీడియోను పంజాబ్ యాజమాన్యం తమ ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Punjab Kings (@punjabkingsipl) గేల్ పంజాబీ ధమాకాకు ముగ్దులైన అభిమానులు ఈ పోస్ట్‌కు తెగ లైకులు కొడుతున్నారు. ఎంతగా అంటే పోస్ట్ చేసిన గంటలోనే 18000 లైక్‌లు కొట్టి గేల్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. గేల్ ఆన్ ఫీల్డ్ ఎంత హుషారుగా ఉంటాడో ఆఫ్ ఫీల్డ్ కూడా అంతే హుషారుగా ఉంటూ అభిమానులను సంతృప్తి పరుస్తుంటాడంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు విండీస్ దలేర్ మెహందీ అంటూ, గేల్ బనాయేగా బౌలర్స్‌కి రైల్ అంటూ సందేశాలు పంపారు. ఇదిలా ఉండగా, గేల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మరోసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఏప్రిల్ 12న ముంబై వేదికగా జరిగే తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాడు. చదవండి: కొడితే సిక్సే.. సింగిల్స్ అసలు తీయరేమో -
బీజేపీలోకి ప్రముఖ సింగర్ దలేర్ మెహందీ
న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహందీ శుక్రవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి విజయ్ గోయల్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వాయవ్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న హన్స్‌రాజ్ హన్స్తదితరులు పాల్గొన్నారు. హన్స్‌రాజ్ కుమారుడితో మెహందీ కుమార్తె వివాహం జరిగిన విషయం తెలిసిందే. -
బీజేపీలో చేరిన ప్రముఖ గాయకుడు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు పలువురు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ బీజేపీలో చేరగా తాజాగా ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ దలేర్ మెహందీ శుక్రవారం కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి విజయ్ గోయల్, సింగర్ హన్స్ రాజ్ ఆధ్వర్యంలో దలేర్ మెహందీ ఇవాళ బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ బీజేపీ చీప్ మనోజ్ తివారీ, గౌతమ్ గంభీర్ హాజరు అయ్యారు. -
దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు
-
దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు
పటియాలా: 2003లో జరిగిన ‘ఇమిగ్రేషన్ స్కాండల్’ కేసులో పంజాబ్ పాప్ సింగర్ దలేర్ మెహందీని కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. శుక్రవారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ జడ్జి దలేర్‌కు రూ.1,000 జరిమానా విధించారు. తర్వాత వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిలుపై విడుదలయ్యారు. అమెరికాకు అక్రమంగా వెళ్లేందుకు సహాయం చేస్తామని చెప్పి దలేర్, షమ్షేర్ మెహందీ తమ వద్ద డబ్బు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ బక్షీశ్ సింగ్ అనే వ్యక్తితోపాటు మరో 35 మంది ఫిర్యాదు చేశారు. 1998, 1999ల్లో రెండు బృందాలను అమెరికాకు తీసుకెళ్లిన మెహందీ సోదరులు అందులో 10 మందిని అక్కడే అక్రమంగా వదిలి వచ్చినట్లు ఆరోపణలున్నాయి. మరోసారి శాన్ఫ్రాన్సిస్కోలో ముగ్గురు అమ్మాయిలను వదిలి వచ్చినట్లు ఆరోపణలున్నాయి. 1999 అక్టోబర్‌లో సోదరులిద్దరూ కొందరు నటులతో వెళ్లి న్యూజెర్సీలో ముగ్గురిని అక్కడ వదిలి వచ్చారు. -
కాంగ్రెస్ లో చేరిన పాప్ సింగర్ దలేర్ మెహందీ!
న్యూఢిల్లీ: పంజాబీ పాప్ సింగర్ దలేర్ మెహందీ తోపాటు మరో నలుగురు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బీఎస్పీకి చెందిన బదార్పూర్ ఎమ్మెల్యే రాంగోపాల్ సింగ్ నేతాజీ, ఆర్ జేడీ ఎమ్మెల్యే ఆసీఫ్ మహ్మద్ ఖాన్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామ్ సింగ్ బిధురీ, బీజేపీకి చెందిన మరో నేత ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరికొంత మంది నేతలు ఉత్సాహం చూపుతున్నారని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు జై ప్రకాశ్ అగర్వాల్ తెలిపారు. ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు కూడా తమతో చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు. వచ్చే నవంబర్ లో ఢిల్లీలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండటంతో రాజకీయపార్టీల నేతల ఫిరాయింపులు ఊపందుకున్నాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 27 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్-నీల్సన్ మూడ్ చేసిన సర్వేలో వెల్లడైంది. -
కాంగ్రెస్‌లో చేరనున్న దలేర్ మెహందీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పాప్ గాయకుడు దలేర్ మెహందీతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆర్జేడీ తరపున ఢిల్లీ విధానసభకు ఎన్నికైన మహ్మద్ ఆసిఫ్‌ఖాన్, బదర్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న బీఎస్పీ ఎమ్మెల్యే రామ్‌సింగ్ నేతాజీ, మాజీ కౌన్సిలర్, ఎన్పీపీ నాయకుడు రామ్‌వీర్ సింగ్ బిదూరీతోపాటు బీజేపీ మాజీ కౌన్సిలర్ డాక్టర్ వీకే మోంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. దలేర్ మెహందీతోపాటు ఈ నేతలు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోవడాన్ని అభినందిస్తూ కాంగ్రెస్ శాసనసభా పక్షం మంగళవారం అభినందన తీర్మానాన్ని ఆమోదించింది. దలేర్ మెహందీతోపాటు కాంగ్రెస్‌లో చేరిన నే తలకు విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగేందుకు అవకాశం లభిస్తుందని అంటున్నారు. దలేర్ మెహందీని తిలక్‌నగర్ లేదా హరినగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించవచ్చని భావిస్తున్నారు.