ఆరు వారాల్లో అనర్గళంగా ఇంగ్లిష్ | sakshi EDGE and panache teach english | Sakshi
Sakshi News home page

ఆరు వారాల్లో అనర్గళంగా ఇంగ్లిష్

Published Fri, Jan 29 2016 8:05 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఆరు వారాల్లో అనర్గళంగా ఇంగ్లిష్ - Sakshi

ఆరు వారాల్లో అనర్గళంగా ఇంగ్లిష్

సాక్షి, హైదరాబాద్: కేవలం ఆరు వారాల్లో అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడగలిగే సామర్థ్యం సొంతం చేసుకునేందుకు సాక్షి ‘ఎడ్జ్’,  ‘పనాచె’ సంస్థలు సంయుక్తంగా స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును అందిస్తున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో సాక్షి ఎడ్జ్ భాగస్వామి అయిన ‘పనాచె’ ప్రభావవంతమైన, విలక్షణమైన శిక్షణా పద్ధతుల ద్వారా ఈ కోర్సును అందజేస్తోంది. ప్రపంచ భాష ఇంగ్లిష్‌తో పరిచయం.. ఇంగ్లిష్‌లో సాధారణంగా దొర్లే తప్పులు.. ఫ్లూయన్సీ-లింకింగ్.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, అనవసర భయాలను అధిగమించడం.. వాయిస్, యాక్సెంట్.. ముఖ్యమైన గ్రామర్ వంటి ఆరు అంశాలతో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును రూపొందించారు.
 
ఈ కోర్సు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుంది. క్లాసులు సాయంత్రం 7.30 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఉంటాయి. కోర్సు ఫీజు రూ. 4 వేలు (ట్యాక్సు అదనం). ఆరు వారాల వ్యవధి గల ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం 9603533300 నంబర్‌లో కానీ sakshiedge@ gmail.com మెయిల్‌లో కానీ సాక్షి ఎడ్జ్, 8-2-696, కార్మెల్ పాయింట్, రోడ్ నంబర్ 12, హైదరాబాద్-34లో కానీ సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement