గలగల స్పష్టమైన ఇంగ్లీష్ మాట్లాడాలని అందరికీ ఆశ ఉంటుంది. అమెరికా వాళ్లనే తలదన్నేలా మంచి అమెరికన్ యాసలో ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండని కూడా కొందరు తాపత్రయ పడుతుంటారు. అలాగే ప్రయత్నం చేస్తూ.. ఓ యువకుడు అమెరికన్ యాసలో ఇంగ్లీష్‌ను స్టైలీష్‌గా మాట్లాడి ఇన్‌స్టాగ్రామ్ సంచలనంగా మారాడు. అతను అమెరికా యాసతో ఇంగ్లీష్ మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.
ఒడిశాకు చెందిన 21 ఏళ్ల ధీరజ్ ఠాక్రీ ఇంగ్లీష్ మాట్లాడిన వీడయోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. ముందు అతను మాట్లాడే ఇంగ్లీష్, అమెరికన్ యాసపై నెటిజనన్లు విమర్శిస్తూ కామెంట్లు చేసేవారు. కానీ, ఇప్పుడు అతని అమెరికన్ ఇంగ్లీష్ యాస.. ప్రొఫెషనల్ ఇంగ్లీష్ టీచర్ల కంటే అద్భుతంగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ధీరజ్ ‘ఇంగ్లీష్ టీచర్’గా మారిపోయాడు.
12వ తరగతి ఫెయిల్ అయిన ధీరాజ్.. ఇంగ్లీష్ కోసం ఎటువంటి కోచింగ్‌కు వెళ్లలేదు. 2019 నుంచి అతను ఇంగ్లీష్ నేర్చుకోవటం ప్రారంభించాడు. దాదాపు రెండు ఏళ్లు.. 2021 వరకు ఇంగ్లీష్ నేర్చుకోవటం కోసం తరచూ చర్చ్ పాటలు పాడేవాడినని ధీరజ్ తెలిపాడు. స్థానిక యాసతో ఇంగ్లీష్ మాట్లాడేవారి మాటలు శ్రద్ధగా వినేవాడినని చెప్పాడు. అలా తాను ఇంగ్లీష్ నేర్చుకున్నానని తెలిపాడు.
అక్కడితో ఆగకుండా తనకు వచ్చిన ఇంగ్లీష్‌ను ఇతరులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మీమ్స్, ఫన్నీ వీడియోల రూపంలో దేశీయ స్టైల్‌లో నేర్పిస్తూ ఇన్‌స్టా టీచర్ అవతారం ఎత్తాడు. మొదట్లో తాను అప్‌లోడ్ చేసిన విడియోలపై చాలా కామెంట్లు వచ్చేవి.. తన ఇంగ్లీష్ స్పష్టత (అమెరికన్ యాస) మెరుగుపడటంతో కామెంట్లు కూడా తగ్గిపోయినట్లు చెప్పుకొచ్చాడీ ఇన్‌స్టా ‘ఇంగ్లీష్ టీచర్’.
తనది చాలా పేద కుంటుంబమని తల్లి గాజులు అమ్ముతుందని తెలిపాడు. తన సోదరుడు ఇంగ్లీష్ వీడియోల విషయంలో తనకు అండగా నిలిచాడని చెప్పాడు. ఇంగ్లీష్ భాషపై మరింత నైపుణ్యం మెరుగుపరుకుంటానని అన్నాడు. ప్రస్తుతం ఇండియన్, బ్రిటన్, అమెరికన్ మూడు యాసలను కలిపి మాట్లాడుతున్నాని చెప్పాడు. భవిష్యత్తులో వేరువేరుగా ఇంగ్లీష్‌ను మాట్లాడతానని అన్నారు.
ఇక.. ఇన్‌స్టాగ్రామ్‌లో ధీరజ్ ఇప్పటివరకు 94 వీడియోలు పోస్ట్ చేశారు. అతనికి ఇప్పటివరకు సుమారు 9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే అలస్యం ఎందుకు మీరు కూడా ధీరజ్‌లా అమెరికన్ ఇంగ్లీష్ యాసతో ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రయత్నం చేయండి.
చదవండి: Ram Janmabhoomi: ‘చావు తాకుతూ వెళ్లింది’.. కరసేవకుని నాటి అనుభవం!
Comments
Please login to add a commentAdd a comment