![Maharashtra's Amravati Auto Driver Fluent English Viral On Social Media](/styles/webp/s3/article_images/2024/07/10/maha_autrowala_english.jpg.webp?itok=-iQodB5a)
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తూ కాదు ఇదే విషయాన్ని ఒక ఆటో ఆటోడ్రైవర్ మరోసారి నిరూపించాడు. అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తున్న సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఒక ఆటోడ్రైవర్ తన అత్యద్భుతమైన ఇంగ్లిష్ స్కిల్స్‌తో అటు ప్రయాణీకులను, ఇటు ఇంటర్నెట్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. విదేశాల్లో చదువుకుని వచ్చినట్టుగా ఈ ఆటోవాలా ఇంగ్లీష్ భాషను దంచి పడేస్తున్నాడు. ఇది గమనించిన ఆయన ప్యాసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఒకరు ఈ వీడియోను షేర్ చేశారు. ‘‘ఆయన ఇంగ్లిష్‌లో అంత సులువుగా మాట్లాడుతుండటం చూసి నేనే ఆశ్చర్యపోయాను.కొద్దిసేపు అలా ఉండిపోయాను’’వ్యాఖ్యానించాడు. ఇది చూసిన నెటిజన్లు ఆటోవాలా ఇంగ్లిష్‌కు ఫిదా అవుతున్నారు. వావ్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు.
అంతేకాదు ఇది ఇంటర్నేషన లాంగ్వేజ్.. ఇంగ్లీష్ వస్తే లండన్, అమెరికా, ప్యారిస్ లాంటి ప్రాంతాలకు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని కూడా ఆయన సిఫార్సు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment