మనం రెగ్యులర్‌గా మాట్లాడే ఇంగ్లీష్‌కు, నేటివ్ ఇంగ్లీష్‌కు ఎంతో కొంత తేడా ఉంటుంది. నేటివ్ స్పీకర్స్ రకరకాల స్లాంగ్స్‌ను ఉపయోగిస్తుంటారు. వాటన్నింటినీ పట్టుకోవడం కష్టం కావచ్చుగానీ బాగా ఉపయోగించే కొన్ని పదాలు, వాక్యాలు అనుసరించడం వల్ల కాస్త వెరైటీగా ఉంటుంది. ఉదా: వొనా (వాంట్ టు), గోనా (గోయింగ్ టు) హ్యాంగ్ ఔట్ (స్పెండ్ టైమ్ టు గెదర్) ‘డూ యూ వాంట్ టు స్పెండ్ సమ్‌టైమ్ టుగెదర్’ అనే మాటను నేటివ్ ఇంగ్లీష్‌లో ఇలా అంటారు... ‘డూ యూ వొనా హ్యాంగవుట్?’
బొమ్మ అదుర్స్
బొమ్మలు వేయడం అంటే మీకు ఇష్టమా? మీరు ఇప్పుడిప్పుడే బొమ్మలు వేయడాన్ని ప్రాక్టిస్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు మీకు కావాలి linea sketch ఇదొక డ్రాయింగ్ యాప్. స్కెచ్చింగ్‌ను దృష్టిలో పెట్టుకొని సింపుల్‌గా ఈ యాప్‌ను రూపొందించారు. బ్లెండ్ టూల్, వైబ్రెంట్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఆపిల్ పెన్సిల్ లేదా మీ చేతి వేలును ఉపయోగించి స్కెచ్చింగ్ చేయవచ్చు. డ్రాయింగ్ ప్రాసెస్‌ను రికార్డ్ చేసే సౌకర్యం ఉంది. ఆ తరువాత దీన్ని తీరిగ్గా చూసుకోవచ్చు.
చదవండి: రెండే రెండు నిమిషాల్లో బాద్‌షా సాంగ్, స్పందించిన ర్యాపర్
Comments
Please login to add a commentAdd a comment