ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషగా రాజ్యమేలుతున్న సంగతి తెలుసిందే. ఈ తరుణంలో ఒక దేశం మాత్రం ఆ భాషను ఉపయోగించడానికి వీలు లేదంటూ హుకూం జారీ చేసింది. అందుకోసం ఓ ముసాయిదా బిల్లును కూడా తీసుకొచ్చింది. పొరపాటున కూడా కమ్యూనికేట్ చేసేటప్పుడూ ఇంగ్లీష్ పదాలు దొర్లినా పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తానని కూడా పేర్కొంది. ఆంగ్ల భాషను పూర్తిగా బ్యాన్ చేసిన తొలిదేశం కూడా అదే కాబోలు!.
వివరాల్లో కెళ్తే.. ఇటాలీ ప్రధాన మంత్రి, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని ఈ కొత్త ప్రతిపాదిత చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఏఇటాలియన్ అయినా కమ్యూనికేట్ చేసేటప్పుడూ .. విదేశీ పదాలను ఉపయోగిస్తే దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. ఈ బిల్లును ఛాంబర్ ఆఫ్ డిప్యూటీ సభ్యుడు ఫాభియో రాంపెల్లి ప్రవేశ పెట్టారు. దీనికి ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మద్దతు ఇచ్చారు. ఆంగ్ల పదాలు లేదా ఆంగోమానియాను లక్ష్యంగా చేసకుని మరీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం.. ఈ ఆంగ్ల భాష ఇటాలియన్ భాషను కించపరుస్తున్నట్లు పేర్కొంది.
బ్రిటన్ నిష్రమణతో బ్రెగ్జిట్‌గా పేరుగాంచిన యూరోపియన్ యూనిన్ కారణంగా ఆ పరిస్థితి దారుణంగా దిగజారిందని పేర్కొంది. అంతేగాదు ఆ బిల్లు..పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పదవిని కలిగి ఉన్నవారెవరైనా వ్రాతపూర్వకంనూ, కమ్యూనికేషన్ పరంగానూ ఇటాలియన్ భాషపై నైపుణ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఉద్యోగా స్థానాల్లో, వ్యాపార సంబంధ డాక్యుమెంట్‌లలోనూ, అధికారిక పత్రాలలోనూ కూడా ఆంగ్లంలో పేర్లను వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించింది.
ఆఖరికి ఇటాలియన్ భాష రాని విదేశీయులతో కమ్యూనికేట్ చేసే కార్యాలయ్యాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పింది. ఆర్టికల్ 2 ప్రకారం.. జాతీయ భూభాగంలో ప్రజా వస్తువుల, సేవలు వినియోగం కోసం ఇటాలియన్‌ని ప్రాథమిక భాషగా ఉపయోగించాలిని ఆ ముసాయిదా బిల్లులో స్పష్టం చేసింది. అంతేగాదు దీన్ని అతిక్రమిస్తే రూ. 4 లక్షల నుంచి దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధిస్తాని బిల్లులో పేర్కొంది. అయితే ఈ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చలు జరిపిన తదనంతరం పూర్తి స్తాయిలో అమలు చేయనుంది ఇటలీ.
Comments
Please login to add a commentAdd a comment