* రవాణా శాఖా మంత్రి రామలింగారెడ్డి
బనశంకరి: ఆంగ్లభాషను నేర్చుకోవడం తప్పుకాదని, అయితే కన్నడభాష ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, లేకుంటే కన్నడసాహిత్యం, సంస్కృతి ఉని కికిపెనుప్రమాదమని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి రామలింగారెడ్డి అభిప్రాయపడ్డారు. ఫ్రీడం పార్కులో సోమవారం ఏర్పాటు చేసిన కువెంపుజయంతి, కన్నడ జాగృతి రోజును ప్రారంభించిన ఆయన మాట్లాడారు. నగరంలో ఉ న్న వారందరూ కన్నడ భాషను ప్రేమించి, నేర్చుకోవాలన్నారు.
కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు అశ్వర్థ నారాయణ, మాజీ మేయర్ ఏ ఉత్తప్ప, మేయర్ శాంతకుమారి, కన్నడ అభివృద్ధి ప్రాధికార కార్యదర్శి కే మురళీధర, రంగక ర్మ నాగరాజమూర్తి, అనికేతన కన్నడ బలగద అధ్యక్షుడు మాయామాయణ్ణ, కర్ణాటక విచారవేదిక అధ్యక్షుడు పాలనేత్ర తదితరులు పాల్గొన్నారు.
ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పుకాదు
Published Tue, Dec 30 2014 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM
Advertisement
Advertisement