ఇండోర్: ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం అత్యంత ముఖ్యమని తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి జోయిత్ మోండల్ నొక్కి చెప్పారు. అంతేగాదు ట్రాన్స్ జెండర్లు పోలీస్ ఫోర్స్, రైల్వే వంటి విభాగాల్లో పనిచేయడం వల్ల వారిపట్ల సమాజ దృక్పథం కూడా మారుతుందని మోండల్ అన్నారు. ఈమేరకు లిట్ చౌక్ అనే సాంస్కృతి సాహిత్య ఫెస్టివల్‌లో పాల్గొన్న అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జోయితా మోండల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే తన కమ్యూనిటీ సభ్యులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అధికారులు చాలా సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. ట్రాన్స్ జెండర్ల కమ్యునిటీలకు సరైన వసతి లేదని, అందుకోసం ఒక పథకాన్ని ప్రవేశ పెట్టాలని అన్నారు. ఇదిలా ఉండగా జోయితా మోండల్ 2017లో పశ్చిమ బెంగాల్ ఇస్లాంపూర్ లోక్ అదాలత్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశంలో అలాంటి పదవిని అలంకరించిన తొలి ట్రాన్స్ జెండర్‌గా జోయితా మోండల్ నిలిచారు.
ఆమె తర్వాత 2018లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోక్ అదాలత్‌లో న్యాయమూర్తిగా విద్యాకాంబ్లే, ఆమె తర్వాత గౌహతి నుంచిస్వాతి బిధాన్ బారుహ్ ఇలాంటి అత్యున్నత పదవిని అలకరించిన ట్రాన్స్ జెండర్లుగా నిలిచారు. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లు కూడా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫిబ్రవరి 2023 కల్లా ఫిజికల్ టెస్టులకు ప్రమాణాలు నిర్దేశిస్తామని బొంబే హైకోర్టుకు తెలపడం గమనార్హం.
(చదవండి: ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయండి )
Comments
Please login to add a commentAdd a comment