హైదరాబాద్: రిజర్వేషన్ మూలసూత్రాలను దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సేన తెలంగాణ ఆధ్వర్యం లో మోదీ సర్కార్ అక్రమ రిజర్వేషన్ల కల్పనపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. సామాజిక వెనుకబాటు, అంటరానితనం తదిత ర అంశాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి కానీ, పేదరికం ఆధారంగా కాదని చెప్పారు. అగ్రకులాల్లో పేదలుంటే వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి తప్ప రిజర్వేషన్లు కల్పించడమేంటని ఆయన ప్రశ్నించారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అగ్రకులాల వారి కి రిజర్వేషన్ కల్పించారని బీసీ సంఘర్షణ సమి తి అధ్యక్షుడు వీజీఆర్ నారగోని ఎద్దేవా చేశారు. అణగారిన వర్గాలను తొక్కిపెట్టేందుకే రిజర్వేషన్ కల్పించారన్నారు. బహుజన సేన తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కదిరే కృష్ణ అధ్యక్షతన నిర్వ హించిన ఈ సభలో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, సమాజ్‌వాది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి, టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సొగరా బేగం తదితరులు పాల్గొన్నార
రిజర్వేషన్లపై కుట్ర: కృష్ణయ్య
Published Mon, Feb 4 2019 1:57 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment