
ముషీరాబాద్: ప్రైవేటు రంగ పరిశ్రమలు, కంపెనీలు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగాల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ భవన్‌లో బీసీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు ఉండేలా పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment