
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలక రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తైంది. ఆయా వర్గాలవారీగా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు పుర్తి అయ్యాయి. రిజర్వేషన్ల వివరాలను శనివారం తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పంపించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు మున్సిపల్ వార్డుల పదవుల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. ఎస్టీల జనాభా ఒక్కశాతం తక్కువగా ఉన్నా కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లోనూ ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లను కల్పించారు. రేపు( ఆదివారం) వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment