రాజకీయ లబ్ధికోసం యూటర్న్‌లు తీసుకోవడంలో సిద్ధ్దహస్తుడు
ముస్లిం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే.. మోదీ అమిత్ షాతో చెప్పించగలడా?
మళ్లీ జగన్ అధికారంలో వస్తేనే అవి కొనసాగింపు
రాజ్యాంగంలో మార్పు.. రిజర్వేషన్ల రద్దే మోదీ గ్యారంటీలు
‘సాక్షి’తో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ‘తెలుగుదేశం అధినేత చంద్రబాబు పచ్చి మోసగాడు.. రాజకీయ లబ్ధికోసం యూటర్న్ తీసుకోవడంలో మొనగాడు. 1994లో నేను ఎమ్యెల్యేగా పనిచేసినప్పటి నుంచి చూస్తున్నా.. స్థిరత్వంలేని ఆయన పదవి కోసం ఎంతకైనా బరితెగిస్తాడు. అప్పట్లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఎలా మోసం చేశాడో చూశా. అతనికి పదవులే ముఖ్యం. అభివృద్ధి, ప్రజల సంక్షేమం చంద్రబాబుకు అస్సలు పట్టదు’.. అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. ‘సాక్షి’తో శనివారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
అధికారమే బాబు లక్ష్యం..
చంద్రబాబు కేవలం అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తాడు. రాజకీయ లబ్ధికోసం 1996లో వాజ్‌పేయితో జతకట్టాడు. ఆ తర్వాత బయటకొచ్చాడు. 2014లో మోదీతో కలిసి పనిచేశాడు. మళ్లీ విడిపోయాడు. మోదీని అనరాని మాటలు అన్నాడు. ఇది అందరికీ తెలుసు.. మళ్లీ మోదీతో కలిసి పనిచేస్తున్నాడు. కానీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలా కాదు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తుంటాడు.
దివంగత నేత వైఎస్సార్ ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను జగన్ అమలుచేస్తున్నారు. తిరిగి అధికారంలోకొచ్చి వాటిని కొనసాగించడం ఖాయం. జగన్ అంటే ఒక విశ్వాసం. అదే చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వగలడు? ముస్లిం రిజరేషన్లపై చిత్తశుద్ధి ఉంటే.. మోదీ, అమిత్ షాతో చెప్పించగలడా? అతను మోదీ చేతిలో కీలుబొమ్మ. చంద్రబాబును నమ్మలేం.
కాబట్టి భవిష్యత్తులో ముస్లిం రిజర్వేషన్లకు ముప్పు కలగకుండా చంద్రబాబు, ఆయన కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పాలి. మరోవైపు.. ప్రధాని మోదీ గ్యారంటీలంటే రాజ్యాంగంలో మార్పులు చేయడం, రిజర్వేషన్లను రద్దుచేయడం, మైనారిటీలకు వ్యతిరేకంగా విషం చిమ్మడమే. బీజేపీది హిందూత్వమే ఏకైక ఎజెండా. భారత్‌ను హిందూత్వ దేశంగా మార్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
వెనుకబాటుతనంపైనేముస్లింలకు రిజర్వేషన్లు..
అసలు ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించింది మతప్రాతిపదికన కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ రిజర్వేషన్లను సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు కారణంగా అందిస్తున్నారు. ముస్లింలలో అనేక వెనుకబడిన కులాలున్నాయి. వారికి ప్రభుత్వ మద్దతు అవసరం. కానీ, బీజేపీకి వీరి అభివృద్ధి గిట్టడంలేదు. అందుకే.. ముస్లిం రిజర్వేషన్ల రద్దుచేస్తామంటున్నారు.
అభివృద్ధికి సహకరిస్తాంతెలంగాణలో అభివృద్ధికి సహకారం
అందిస్తామని అసద్ పునరుద్ఘాటించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్దే తమ లక్ష్యమన్నారు. తమ పనితీరే తమకు గుర్తింపని చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో గవర్నర్‌గా రాజ్యాంగబద్ధ్ద బాధ్యతలు నిర్వహించి రాజీనామా చేసిన తమిళిసై తిరిగి ఎన్నికల ప్రచారానికి రావడం రాజకీయంగా అనైతికమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment