
ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేరుస్తోంది ఇండియన్ రైల్వేస్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చవకైన ప్రయాణాన్ని ప్రజలకు అందిస్తు రైల్వే శాఖ ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ప్రభుత్వ సంస్థగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త సేవలతో అందిస్తూ ప్రయాణికులకు పెద్ద పీట వేస్తూ దూసుకోపోతోంది.
ఇక్కడి వరకు బాగానే ఉన్న కొందరు అకస్మాత్తుగా ప్రయాణించవలసి రిజర్వేషన్ టికెట్ దొరకకపోవచ్చు. అటువంటి సమయంలో వారికి రిజర్వేషన్ టికెట్ దొరకపోవచ్చు. అయినా ఏం ఫర్వాలేదు రిజర్వేషన్ టికెట్ లేకున్నా ప్యాసింజర్లు వారి గమ్యస్థానానికి ఇలా ప్రయాణించవచ్చు. ఎలా అంటారా?
ప్లాట్‌ఫాం టికెట్‌తో ప్రయాణం ఎలా..
ప్యాసింజర్ తన వద్ద రిజర్వేషన్ టికెట్ లేదని కంగారుపడాల్సిన పనిలేదు. అటువంటి పరిస్థితుల్లో సదరు ప్రయాణికుడు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌తో రైలులో ప్రయాణించవచ్చు. అయితే మీరు వెంటనే టికెట్ కలెక్టర్ (TTE) సంప్రదించాల్సి ఉంటుంది. ఆపై మీ గమ్యస్థానాన్ని అతనికి చెప్పి అందుకు తగ్గ డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా మీరు టిక్కెట్ తీసుకుని ప్రశాంతంగా ప్రయాణిస్తారు.
ఈ రూల్స్ కూడా తెలుసుకోండి..
రిజర్వేషన్ లేకుండా ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకున్న ప్యాసింజర్ ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. రైలులో ఒక్కోసారి రద్దీ కారణంగా బెర్త్ మాత్రమే కాదు సీటు ఖాళీగా లేని సందర్భాలు బోలెడు ఉంటాయి. అటువంటి సమయంలో టీటీఈ ప్రయాణికుడికి రిజర్వ్ సీటు ఇవ్వలేకపోవచ్చు.
కానీ, ప్యాసింజర్ ప్రయాణాన్ని మాత్రం ఆపలేరు. అటువంటి సమయంలో మీరు నిబంధనల ప్రకారం రిజర్వేషన్ టికెట్ లేకుండా రిజరేషన్ బోగీలో ప్రయాణించాలనుకుంటే .. రూ. 250 అపరాధ రుసుముతో (ఫైన్) పాటు ప్రయాణానికి సంబంధించిన మొత్తం ఛార్జీని చెల్లించాలి. ఆపై టీటీఈ నుంచి సంబంధిత టికెట్ తీసుకోవాలి.
చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment