
న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో నాలుగు సంవత్సరాలు విధులు నిర్వర్తించాక త్రివిధ బలగాల్లో ఉద్యోగం నుంచి బయటికొచ్చిన అగ్నివీర్‌లకు తమ ఉద్యోగ భర్తీల్లో వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పిస్తామని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ వివరాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వేర్వేరు రైల్వే విభాగాల్లో నేరుగా రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి నాన్–గెజిటెడ్ పోస్టుల్లో వారికి 15 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.
ఆయా ఉద్యోగాలకు అర్హత వయసులో సడలింపు అవకాశం ఇవ్వనున్నారు. దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కల్పిస్తారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్)లో అగ్నివీర్‌లకు రిజర్వేషన్ విధానాన్ని తెచ్చే యోచనలో ఉన్నారు. నాన్–గెజిటెడ్ పోస్టుల్లో లెవల్ 1లో 10 శాతం , లెవల్ 2లో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. దివ్యాంగులు, మాజీ సైనికులు, అప్రైంటీస్‌ల రెగ్యులరైజేషన్ విధానాలకు అనుగుణంగా వీరి నియామకం ఉంటుంది. తొలి బ్యాచ్ అగ్నివీర్‌లకు ఐదేళ్ల వయసు సడలింపు, రెండో బ్యాచ్ వారికైతే మూడేళ్ల వయోపరిమితి సడలింపు వర్తింపజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment