ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ప్రోత్సాహకాలు.. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే రూ.7 కోట్లు
ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం విజేతలకు రూ. 4 కోట్లు.. నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న కొత్త ‘స్పోర్ట్స్ పాలసీ’ అన్నిరాష్ట్రాల కంటే మిన్నగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎం అధ్యక్షతన నూతన స్పోర్ట్స్ పాలసీపై సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకో సిస్టం, గ్లోబల్ విజిబిలిటీ ప్రాతిపదికగా పాలసీని రూపొందించామన్నారు. గ్రామస్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి ప్రణా ళిక పొందుపరిచినట్టు చెప్పారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. శాప్‌లో గ్రేడ్–3 కోచ్‌ల కోసం ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించారు.
ఒలింపిక్స్ విజేతలకు భారీ ప్రోత్సాహకాలు
ఒలింపిక్స్‌లో బంగారు పతకానికి ప్రస్తుతం రూ.75 లక్షలు ఇస్తుండగా, ఇకపై రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు సీఎం ప్రకటించారు. రజత పతకానికి రూ.50 లక్షలు నుంచి రూ.5 కోట్లు, కాంస్యానికి రూ.30 లక్షల నుంచి రూ.3 కోట్లు, పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని ఆదేశించారు. ఏషియన్ గేమ్స్ బంగారు çపతకానికి రూ.4 కోట్లు, రజత పతకానికి రూ.2 కోట్లు, కాంస్య పతకానికి రూ.కోటి, పాల్గొన్న వారికి రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతానికి రూ.35 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతానికి రూ.5 లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు ఇవ్వాలన్నారు. ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, అధికారులు పాల్గొన్నారు.
సాగు ఖర్చులు తగ్గాలి
సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైనన్ని నూతన విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. సాంకేతికతను వినియోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవచ్చని చెప్పా రు. ఆయన సోమవారం వ్యవసాయశాఖపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రాను న్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయం గేం చేంజర్ అవుతుందని చెప్పారు. ప్రకృతి సేద్యంలో ఏపీ పయనీర్‌గా నిలవాలన్నారు. పంట ల సాగులో డ్రోన్ల వాడకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. కేబినెట్ సబ్ కమి టీ సూచనల ప్రకారం ఈ రబీ నుంచి పాత పద్ధతిలో పంటల బీమాను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. జూలైలో జరిగిన పంట నష్టానికి రూ.37 కోట్లు రైతులకు పరి హారం కింద చెల్లించేందుకు సీఎం అంగీకా రం తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment