Best Light Weight Popular Smartphones Under Rs 10,000 Price List - Sakshi
Sakshi News home page

Best Light Weight Smart phones: బరువైన ఫోన్లతో విసిగిపోయారా? ఈ లైట్‌ వెయిట్‌ స్మార్ట్‌ ఫోన్లు ట్రై చేయండి..

Published Mon, Jul 24 2023 7:46 PM | Last Updated on Tue, Jul 25 2023 10:26 AM

Best light weight smart phones under Rs 10000 - Sakshi

స్మార్ట్‌ఫోన్‌లు మన దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. కస్టమర్లు తమ బడ్జెట్‌కు అనుగుణంగా ప్రీమియం, మిడ్-రేంజ్ లేదా లో బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. హార్డ్‌వేర్, ప్రీమియం గ్లాస్, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ సామర్థ్యాలను మెరుగుపరచడంతో ఈ రోజుల్లో ఫోన్‌లు చాలా బరువుగా  మారాయి. 

ప్రీమియమ్ బిల్డ్, పెద్ద బ్యాటరీలు ఉండటం మంచిదే అయినప్పటికీ కొంతమంది ఫోన్‌లు తేలికగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని తేలికపాటి ఫోన్‌ల గురించి సమాచారం ఇక్కడ అందిస్తున్నాం.

రియల్‌ మీ నార్జో ఎన్‌ 53 (Realme Narzo N53)

  • బరువు 182 గ్రాములు.
  • 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే
  • ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
  • Unisoc T612 SoC ప్రాసెసర్‌ 
  • 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజ్‌, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌,  12GB వరకు డైనమిక్ ర్యామ్‌ సపోర్ట్
  • 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ
  • LED ఫ్లాష్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్‌ కెమెరా
  • 4GB + 64GB వెర్షన్‌ ధర రూ. 8,999, 6GB + 128GB మోడల్‌ ధర రూ. 10,999. 

మోటో జీ13 (Moto G13)

  • బరువు 184.25 గ్రా
  • 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లే
  • MediaTek Helio G85 ప్రాసెసర్
  • 4GB LPDDR4X ర్యామ్‌ 64GB/128GB స్టోరేజీ
  • ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
  • 50MP ప్రైమరీ కెమెరా, 2MP డ్యూయల్ లెన్స్‌లు, 8MP ఫ్రంట్‌ కెమెరా 
  • 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ
  • 4GB + 64GB మోడల్‌ రేటు రూ. 9,499, 4GB + 128GB వెర్షన్ ధర రూ. 9,999.

వివో వై 02 (Vivo Y02)

  • బరువు 186 గ్రాములు.
  • 6.51-అంగుళాల HD+ డిస్‌ప్లే
  • మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్
  • 3GB ర్యామ్‌, 32GB స్టోరేజీ, 1TB వరకు విస్తరించవచ్చు
  • Funtouch OS 12తో Android 12 Go ఎడిషన్
  • 8MP రియర్‌ కెమెరా 5MP ఫ్రంట్‌ కెమెరా
  • 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ
  • 2GB + 32GB మోడల్ ధర రూ. 8,999.

రెడ్‌మీ 10ఎ (Redmi 10A)

  • బరువు 194 గ్రాములు
  • 6.53-అంగుళాల HD+ డిస్‌ప్లే
  • MediaTek Helio G25 ప్రాసెసర్‌
  • 3GB/4GB LPDDR4x ర్యామ్‌, 32GB/ 64GB eMMC 5.1 స్టోరేజ్.
  • ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
  • 13MP ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్‌ కెమెరా
  • 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ
  • 3GB + 32GB మోడల్‌ ధర రూ. 8,499, 4GB + 64GB వెర్షన్ ధర రూ. 9,499.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement