దేశంలో అతిపెద్ద ప్రజా ప్రయాణ వ్యవస్థ రైల్వేలు. దేశవ్యాప్తంగా రోజూ లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్నిసార్లు ప్రయాణికుల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కొంత మంది ముందు జాగ్రత్తగా కొన్ని మందులు తమ వెంట తెచ్చుకున్నా చాలా మంది మందులు దొరక్క, ఒకవేళ దొరికినా అధిక ధరల కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి ఇబ్బందుల పరిష్కారానికి రైల్వే చర్యలు చేపట్టింది.
ప్రయాణికుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ దేశంలోని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు మందులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాల పేరుతో మెడికల్ స్టాల్స్ ప్రారంభించనుంది. ఇక్కడ ప్రయాణికులకు అవసరమైన వివిధ రకాల మందులు తక్కువ ధరకు విక్రయిస్తారు. ఈ అవుట్‌లెట్‌లు రైల్వేస్టేషన్లలోని రద్దీ ప్రదేశాలలో, కాన్కోర్స్‌లలో ఏర్పటు చేస్తారు. దీని వల్ల వచ్చీపోయే ప్రయాణికులందరికీ ప్రయోజనం కలుగుతుందని రైల్వే శాఖ భావిస్తోంది.
మొదట 50 స్టేషన్లలో..
పైలట్ ప్రాజెక్ట్ కింద మొదట ఎంపిక చేసిన 50 రైల్వే స్టేషన్లలో ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ జాబితాలో ఆనంద్ విహార్, దర్భంగా, శ్రీనగర్, మైసూర్, లక్నో తదితర ప్రధాన స్టేషన్లతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: Water Bottles in Trains: రైళ్లలో వాటర్ బాటిల్ కొంటున్నారా.. ఏ బ్రాండ్ అమ్మాలి.. రూల్స్ ఏంటి?
రైల్వే డివిజన్ల ద్వారా గుర్తించిన ప్రదేశాలలో ఈ మందుల కేంద్రాలను లైసెన్సుల ద్వారా ఏర్పాటు చేసి నిర్వహిస్తారు. సంబంధిత రైల్వే డివిజన్‌ల ఆధ్వర్యంలో ఈ-వేలం ద్వారా ఈ స్టాల్స్ ను కేటాయిస్తారు. వీటిని ఎన్‌ఐడీ అహ్మదాబాద్ డిజైన్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment