పేరు లేని లుమియా ఫోన్ | Microsoft's first Lumia defines Windows Phone's future | Sakshi
Sakshi News home page

పేరు లేని లుమియా ఫోన్

Published Wed, Nov 12 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

పేరు లేని లుమియా ఫోన్

పేరు లేని లుమియా ఫోన్

న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా పేరు లేకుండా మైక్రోసాఫ్ట్ లుమియా బ్రాండ్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్, లుమియా  535ను  మంగళవారం ఆవిష్కరించింది. నోకియా పేరు లేకుండా వస్తోన్న తొలి లుమియా ఫోన్ ఇది. ఈ 3జీ ఫోన్ సింగిల్, డ్యుయల్ సిమ్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ ఒక బ్లాగులో పేర్కొంది.

ధర 110 యూరోలు(రూ.8,400)అని,  ధరలు ఆయా దేశాలను బట్టి మారతాయని వివరించింది.  మైక్రోసాఫ్ట్ లోగోతో ఉన్న ఈ ఫోన్‌లో విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 5 అంగుళాల డిస్‌ప్లే, 1.2 గిగా హెర్ట్స్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 15 జీబీ ఉచిత వన్‌డ్రైవ్ స్టోరేజ్, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, అంతే మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1,905 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొంది.

  హై-ఎండ్ ఫోన్లలో ఉండే ఫీచర్లు-స్కైప్ వీడియో కాల్స్, ఆఫీస్ యాప్స్, వర్చువల్ అసిస్టెంట్ కోర్టాన వంటివి కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయని వివరించింది. ఈ నెలలోనే వీటిని ఎంపిక చేసిన దేశాల్లో విక్రయిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement